S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/03/2018 - 00:34

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలుగు రాష్ట్రాల ఐఎన్‌టీయుసి వర్కింగ్ కమిటీ 187వ కీలకమైన సమావేశాన్ని ఈ నెల 4న (ఆదివారం) నిర్వహించనున్నట్లు ఐఎన్‌టీయుసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. సంజీవ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు నారాయణగూడలోని డాక్టర్ జీఎస్‌ఆర్ భవన్‌లో ఈ సమావేశం జరుగుతుందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

11/03/2018 - 00:34

హైదరాబాద్, అక్టోబర్ 2: చేతికి గాయమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీపావళి పండుగ తర్వాత 10వ తేదీ నుంచి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టాలనుకుంటున్న జగన్‌కు డాక్టర్లు ఈ మేరకు సూచన చేశారు.

11/03/2018 - 00:33

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్ర సమితి తన నాల్గేళ్ల పాలనలో కుల వృత్తులు, వారి సంఘాల సంక్షేమం కోసం చేపట్టిన పథకాల లబ్ధిదారులను ఓటు బ్యాంక్‌గా మలుచుకునే వ్యూహాన్ని రచిస్తోంది. కుల సంఘాల ఓటర్లను టీఆర్‌ఎస్ తనవైపు తిప్పుకోవడానికి ఆయా కుల సంఘాల నాయకులను ప్రచారకర్తలుగా రంగంలోకి దింపాలని యోచిస్తోంది.

11/02/2018 - 16:26

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని గతంలో కాంగ్రెస్ ఆయనను సస్పెన్షన్ చేసింది. ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ పార్టీ ప్రకటన చేసినప్పటికీ ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

11/02/2018 - 12:32

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల రెండో విడత జాబితాను విడుదల చేశారు. అలాగే మధ్యప్రదేశ్‌లో పోటీచేసే అభ్యర్థుల రెండోవిడత జాబితాను కూడా అధిష్టానం విడుదల చేసింది.

11/02/2018 - 06:27

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణలో విద్యుత్ లోటును పూడ్చడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. విద్యుత్ లోటు ఉత్తత్తికేంద్రాలపై పెనుభారంగా మారింది. రాష్ట్రంలో రెండు రోజుల క్రితం గతంలో ఎన్నడూ లేనంతగా 14, 500 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. కాగా తెలంగాణలోని థర్మల్ కేంద్రాలతో పాటు, నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి హైడల్ విద్యుత్ ఉత్పత్తి కోసం అధికారులు పరుగులు తీస్తున్నారు.

11/02/2018 - 06:33

హైదరాబాద్, నవంబర్ 1: ఆపరేషన్ గరుడ పేరుతో నాటకం ఆడుతున్న శివాజీని అరెస్టు చేసి విచారిస్తే అసలు నిజాలు బయటికి వస్తాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

11/02/2018 - 06:25

హైదరాబాద్, నవంబర్ 1: ‘ఈ ఒక్కసారికి జైపాల్‌యాదవ్‌కు అవకాశం ఇవ్వండి, భవిష్యత్‌లో అవకాశం మీకే దక్కుతుంది’ అని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇచ్చిన హామీకి ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అంగీకరించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే.

11/02/2018 - 06:24

హైదరాబాద్, నవంబర్ 1: హైదరాబాద్ నుంచి దేశంలోని ఇతరత్రా ప్రాంతాలకు నగదు బదిలీ చేస్తూ 0.6 శాతం కమీషన్ తీసుకుంటున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పవన్‌కుమార్ శర్మ, హన్సరాజ్ నుంచి రూ. 30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. గౌలిగూడ సమీపంలో ఇద్దరు వ్యక్తులు నగదుతో వెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

11/02/2018 - 06:23

హైదరాబాద్, నవంబర్ 1: వరంగల్ నగరంలో హత్యకు గురైన పూజారి సత్యనారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని , పూజారి హత్య వెనుక ఉన్న కుట్రదారులను అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీ ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన ఇమామ్‌కు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. శివసాయి దేవాలయానికి రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Pages