S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/09/2018 - 06:17

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 8: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గీతాంజలి జూనియర్ కళాశాలలో శనివారం ఓ విద్యార్థిని గదిలో నిర్భందించి ప్రిన్సిపాల్ సహా అధ్యాపకులు చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చే యించారు. విద్యార్థి చెప్పిన వివరాల ప్రకారం.. గీతాంజలి జూనియర్ కళాశాలలో సెలవులలో కూడా తరగతులను నిర్వహిస్తున్నారు.

09/09/2018 - 05:27

హైదరాబాద్, సెప్టెంబర్ 8: చెన్నూరు, చొప్పదండి టీఆర్‌ఎస్ సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరించడానికి సర్వేలు కారణం కాదని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు జీ. వివేక్‌కు పెద్దపల్లి నుంచి పార్లమెంట్ టికెట్, ఆయన సోదరుడు, మాజీ మంత్రి జీ. వినోద్‌కు చొప్పదండి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికే సిట్టింగ్‌లకు టికెట్ దక్కలేదని సమాచారం.

09/09/2018 - 06:05

హైదరాబాద్, సెప్టెంబర్ 8: భారతదేశం నమ్మదగిన ఆర్బిట్రేషన్ కేంద్రంగా మారుతోందని, అయితే భారత్‌లో కూడా సంస్థాగత వివాదాల పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ (ఐసీఏడీఆర్) కార్యదర్శి జెఎల్‌ఎన్ మూర్తి పేర్కొన్నారు. ‘వ్యాపార మనుగడ - వివాదాల ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం న్యాయ సంస్కరణలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.

09/09/2018 - 06:07

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీ తనకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య గొడవ, చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యర్థులను అణగదొక్కాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని, తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో టీడీపీ ఓ చారిత్రక అవసరం ఉందన్నారు.

09/08/2018 - 06:09

సూర్యాపేట, సెప్టెంబర్ 7: ఎన్నో ఉద్యమాలు, బలిదానాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు అధికారమిస్తే పాలించలేమని తన సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని రద్దు చేసిన కేసీఆర్‌కు ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ పిలుపునిచ్చారు.

09/08/2018 - 04:33

చౌటుప్పల్, సెప్టెంబర్ 7: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాలలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఒక్క సీటు గెల్చుకున్నా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని రాజీవ్ స్మారక భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/08/2018 - 04:32

ఆదిలాబాద్, సెప్టెంబర్ 7: టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఖరారుతోనే ఆ పార్టీలో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు ముందస్తు వ్యూహానికి పదునుపెడుతూ ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నారు. మూడుసార్లు చెన్నూర్ నియోజకవర్గం నుండి కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుపొంది ఈసారి టికెట్ రాక భంగపడ్డ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీ అధిష్ఠానం వైఖరిపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.

09/08/2018 - 01:37

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణలో జరిగే ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మూడు మూడు పేర్లతో జాబితాలను తయారుచేసినా, అభ్యర్ధులు ఎవరనే దానిపై ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీచేస్తారనే అంశంపై పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు సైతం తనకేమీ తెలియదని, అభ్యర్ధులను జాతీయ కమిటీ ఖరారు చేస్తుందని పేర్కొన్నారు.

09/08/2018 - 01:37

హైదరాబాద్, సెప్టెంబర్ 7: రాష్ట్ర అర్హత పరీక్ష (టిఎస్ సెట్) ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి , ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ బి యాదవరాజు విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టీఎస్ సెట్ ఫలితాలను విడుదల చేశారు.

09/08/2018 - 01:36

హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఆకస్మాత్‌గా అగ్నిప్రమాదలు చోటు చేసుకున్నప్పుడు వాటి నుంచి ఎలా తప్పించుకోవడానికి అనుసరించాల్సిన అంశాలను అగ్నిమాపక శాఖ తెలంగాణ జిల్లాల్లో ప్రజల్ని చైతన్యం చేయడానకి విస్తత్ర ప్రచారం చేస్తోంది. రక్షించడానికి మేము ఉన్నాం అంటూ నినాదాలతో అగ్నిమాపక శాఖ హైదరాబాద్‌లో వివిధ కాలనీల్లో కార్యక్రమాలను చేపట్టింది. తెలంగాణ 10 జిల్లాల్లో 108 కార్యాక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.

Pages