S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/10/2018 - 04:03

గద్వాల, సెప్టెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు వేస్తుండడంతో అంతేస్థాయిలో ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధవౌతుంది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వాడే ఈవీఎం, వీవీ టాక్ సామాగ్రిని భద్రపర్చుటకు స్థల నిర్దేశన జరిగిందని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

09/10/2018 - 04:01

వనపర్తి, సెప్టెంబర్ 9: నాలుగేళ్ళ పాలనలో దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో చేసి చూపించామని, అభివృద్ధి పనులే టీఆర్‌ఎస్‌ను తిరిగి అధికారంలోకి తెస్తాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం వనపర్తిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు మరికొన్ని పథకాలను ప్రవేశపట్టిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.

09/10/2018 - 03:58

సంస్థాన్‌నారాయణపురం, సెప్టెంబర్ 9: అనేక రాష్ట్రాల్లో అతివృష్ఠి వల్ల పంటలు కోల్పోతున్న రైతులకు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అనావృష్ఠి వల్ల కోట్లాది రూపాయల పంటలు రైతన్నలు నష్టపోతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాలలో వర్షాలు లేని కారణంగా వ్యవసాయ పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. రాజకీయపార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగితేలుతున్నాయి తప్ప రైతులను పట్టించుకునే పరిస్థితిలో లేకుండా పోయాయి.

09/10/2018 - 03:56

హైదరాబాద్, సెప్టెంబర్ 9: పెట్రోలు, డీజిల్ ధరలు రోజు, రోజుకూ పెరిగి, సామాన్యులపై మోయలేని భారం పడుతున్నందున ఏఐసీసీ ప్రకటించిన భారత్ బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఆదివారం గాంధీ భవన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ళ, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల సమావేశం జరిగింది.

09/10/2018 - 03:55

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ముందస్తు ఎన్నికల్లో వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపి పొత్తులు కుదుర్చుకోవడానికి వీలుగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ సారథ్యంలో ఎన్నికల సమన్వయ కమిటీ ఏర్పాటైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై ఈ మేరకు సూచనలు చేశారు. దీంతో సమన్వయ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు టీ.

09/09/2018 - 23:40

నల్లగొండ, సెప్టెంబర్ 9: ముందస్తు ఎన్నికల పోరులో సైతం వామపక్షాలు మరోసారి పొత్తుల బాటలోనే సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కలిసివచ్చే పార్టీలు, సామాజిక, ప్రజా సంఘాలతో పొత్తులు, సీట్ల సర్దుబాట్లతో ఎన్నికల్లో తెలంగాణలో తమ ఉనికి చాటుకుని తెలంగాణ రాష్ట్రం రెండో అసెంబ్లీలో మెరుగైన స్థానాలతో అడుగు పెట్టాలని సీపీఐ, సీపీఎంలు భావిస్తున్నాయి.

09/09/2018 - 23:29

సంగారెడ్డి, సెప్టెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన వేళ.. ఆయా నియోజకవర్గాలు మంచి బేరసారాలకు నిలయంగా మారాయ. రాష్ట్రంలోని 105 అసెంబ్లీ స్థానాలకు గులాబి దళపతి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉంటూ వస్తున్న నాయకుల్లో ఈసారి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడానికి ఎన్నో ఆశలు పెట్టుకుని కూర్చున్నారు.

09/09/2018 - 06:21

మేళ్లచెర్వు, సెప్టెంబర్ 8: ఎన్నో అవాంతరాలను అధిగమించి ఇంజనీర్‌లు, అధికారుల సమిష్టి కృషితో పులిచింతల జల విద్యుత్‌కేంద్రాన్ని నేటికి పూర్తి చేశామని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండి డి.ప్రభాకర్‌రావు అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద గల జలవిద్యుత్ కేంద్రంలో నాల్గవ యూనిట్‌ను శనివారం ఆయన ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు.

09/09/2018 - 06:19

కరీంనగర్, సెప్టెంబర్ 8: టీఆర్‌ఎస్ మళ్లీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందస్తుకు అడుగులేసి, ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ పార్టీలో ఇంటి పోరు రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం రద్దుకు ముందే కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న అంతర్గత విబేధాలు రచ్చకెక్కగా, టికెట్ల కేటాయింపుతో అక్కడ అవి మరింతగా రాజుకుంటున్నాయి.

09/09/2018 - 06:18

ఆదిలాబాద్, సెప్టెంబర్ 8: నమ్మించి మోసగించడంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మించిన నాయకుడు మరొకరు లేరని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకుడిగా నీ సేవలు అవసరమంటూ పార్టీలో చేర్చుకొని ఖానాపూర్ టికెట్ ఇస్తానని నమ్మబలికి తీరని ద్రోహం చేశారని విమర్శించారు.

Pages