S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/11/2018 - 03:32

విజయవాడ, సెప్టెంబర్ 10: కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దానిని సాధించుకోవడానికి కష్టపడాలని పార్టీ నేతలకు మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సూచించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన పార్టీ ఆహ్వానం మేరకు పీసీసీ రాష్ట్ర కార్యాలయాన్ని సోమవారం సాయంత్రం సందర్శించారు.

09/11/2018 - 03:32

హైదరాబాద్, సెప్టెంబర్ 10: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) కోరింది. టీఈఏ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ సంపత్ కుమార స్వామి, కోశాధికారి నిర్మల సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.

09/11/2018 - 03:31

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూలు ఖరారు చేశారు. బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ షెడ్యూలును సోమవారం నాడు విడుదల చేశారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 24 వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని, 100 రూపాయిల జరిమానాతో అక్టోబర్ 25 నుండి నవంబర్ 8 వరకూ ఫీజు చెల్లించవచ్చని చెప్పారు.

09/11/2018 - 04:04

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డును ప్రకటించింది. రూర్బన్ పథకాన్ని సమర్థతగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో నిలవడంతో ఈ అవార్డును కేంద్ర గ్రామీణాభావృద్ధి శాఖ ప్రకటించింది. గ్రామాల్లో పట్టణ వసతులు కల్పించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది.

09/11/2018 - 03:30

ఖైరతాబాద్, సెస్టెంబర్ 10: ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రజల్లోకి వచ్చిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీని వ్యాపార సంస్థలా మార్చారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన జ్యోత్స్న ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ రాజకీయాలు, డబ్బు ప్రమేయం లేకుండా పార్టీ నడుస్తుందని భావించి తాను టీజేఎస్‌లో చేరినట్టు చెప్పారు.

09/11/2018 - 03:29

హైదరాబాద్, సెప్టెంబర్ 10: ‘బర్రెలు, గొర్రెలు కాదు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇవ్వండి..’ అని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బీసీలను ఓట్లేసే యంత్రాలుగా చూడరాదని, బీసీలకు రాజకీయ రంగంలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

09/11/2018 - 02:49

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ వేగంగా చర్యలు చేపట్టింది. శాసనసభ రద్దయిన రెండో రోజు నుండే అధికారికంగా ఎన్నికల కార్యక్రమం ప్రారంభమైంది. ఓటర్ల జాబితా సవరణను రెండు నెలలు ముందుగానే పూర్తి చేసేందుకు ఈ నెల ఏడోతేదీననే ఉత్తర్వులు జారీ చేశారు.

09/11/2018 - 02:41

హైదరాబాద్, సెప్టెంబర్ 10: పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని, అది వాస్తవమే అయినా ఈ ధరలకు కేంద్ర ప్రభుత్వం మాత్రమే కారణం కాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగుల రాకేష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. భారత్ బంద్‌కు పిలుపునిచ్చి కాంగ్రెస్, మిగిలిన పక్షాలు రాజకీయం చేస్తున్నాయని , దేశంలో బంద్ ఛాయలు లేవని, బంద్ సంపూర్ణంగా ఫ్లాప్ అయిందని ఆయన పేర్కొన్నారు.

09/11/2018 - 02:40

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ బీజేపీ అభ్యర్ధుల జాబితా తుది రూపానికి చేరుకుంది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి జాతీయ స్థాయి నాయకులతో పెద్ద ఎత్తున కసరత్తు చేసిన తర్వాత జాబితా ఒక స్వరూపానికి వచ్చింది.

09/11/2018 - 02:38

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తనకు టికెట్ ఇవ్వకపోయినా టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని టీఆర్‌ఎస్ తాజా నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేసారు. తాను ఎలాంటి పదవులు ఆశించకుండా బేషరతుగానే టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. టీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో దానంకు టికెట్ దక్కకపోవడంతో ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారని జరగుతోన్న ప్రచారం నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడారు.

Pages