S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/08/2018 - 01:36

హైదరాబాద్, సెప్టెంబర్ 7: ‘ముందస్తు ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దాం...అవినీతిపరులను మట్టి కరిపిద్దాం..’ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మిగతా విపక్షాలకు పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది.

09/08/2018 - 01:35

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణలో శాసనసభ రద్దు కావడంతో ముందస్తు ఎన్నికల్లో ఎవరితో కలిసి పనిచేయాలనే అంశంపై జనసేన మేథోమధనం నిర్వహించింది. ఏ పార్టీలతో కలిసి పనిచేయాలనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో ఏకాభిప్రాయానికి రానున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ఏ పార్టీలతో కలిసి పనిచేస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపైనా బలాబలాపైనా భేరీజు వేసింది.

09/08/2018 - 01:35

హైదరాబాద్, సెప్టెంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కే. జానారెడ్డి విమర్శించారు. తొమ్మిది నెలల ముందే ప్రజా సంక్షేమాన్ని నిలిపి వేస్తూ తీసుకున్న నిర్ణయానికి సహేతుకమైన సమాధానం ఇప్పటికీ చెప్పలేదని అన్నారు.

09/08/2018 - 01:34

హైదరాబాద్, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సంరంభంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. డిసెంబర్ 15 నుండి జనవరి 20లోపు నాలుగు రాష్ట్రాలకు కొత్త అసెంబ్లీలు ఏర్పాటు కావల్సిన దశలో తెలంగాణ రాష్ట్రానికి సైతం ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే యోచనలో ప్రభుత్వం ఉండటంతో అందుకు అనుగుణంగా విద్యా వార్షిక ప్రణాళికలను సవరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

09/07/2018 - 17:41

హుస్నాబాద్: ముందస్తు ఎన్నికలకు సిద్ధమని అన్ని పార్టీలు ప్రకటించాయని, ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని ఈ అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా? అని దుయ్యబట్టారు.

09/07/2018 - 13:12

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.
కేటీఆర్‌ ఆహ్వానం మేరకు తాను తెరాసలో చేరుతున్నట్లు సురేశ్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం కేటీఆర్‌తో కలిసి సురేష్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఇలాగే కొనసాగలంటే మళ్లీ తెరాస అధికారంలోకి రావలన్నదే తన అభిప్రాయమని పేర్కొన్నారు.

09/07/2018 - 12:33

హైదరాబాద్: జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో ఎన్నికల ప్రధాన అధికారి రజిత్ కుమార్ సమావేశం నిర్వహించారు. ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉండాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. అలాగే ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై అవగాహన కల్పించారు. దీనిపై దశలవారీగా శిక్షణాకార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

09/07/2018 - 04:41

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశ వాది అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కే జానారెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పోవడానికి కారణాలను సీఎం వివరిస్తూ, ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారని, ఇది చాలా దారుణమని అన్నారు.

09/07/2018 - 04:40

హైదరాబాద్, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరించారని, ఆయనను అదుపు చేయాలని బీజేపీ నేతలు గురువారం నాడు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. అనేక సందర్భాల్లో సీఎం దూకుడుగా వ్యవహరించి విపక్షాలపై విరుచుకుపడ్డా రని ఇది ప్రజాస్వామ్యంలో తగదని అన్నారు. రాష్ట్రంలో ఆరు నెలల ముందే అసెంబ్లీ రద్దు అప్రజాస్వామికమని వారు చెప్పారు.

09/07/2018 - 04:37

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవెలప్‌మెంట్ (ఓఈసీడీ) ధృవీకరణ ద్వారా విత్తనాలను ధృవీకరించడం వల్ల విదేశాలకు తెలంగాణ విత్తనాన్ని ఎగుమతి చేసేందుకు వీలవుతోందని టీఎస్‌ఎస్‌ఓసీఏ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు తెలిపారు. అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి వి. భాస్కర్ గురువారం హైదరాబాద్ వచ్చారు.

Pages