S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/06/2018 - 03:36

యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 5: యాదాద్రి-్భవనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో వ్యభిచార గృహాలను కూకటివేళ్లతో పెకిలిస్తామని పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలాలకు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

08/06/2018 - 03:33

యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 5: యాదగిరిగుట్టలోని వ్యభిచార గృహాలలో బాలికలను వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు చేయడం, కిడ్నాప్‌ల ద్వారా వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే ఆశాలత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

08/06/2018 - 03:31

హైదరాబాద్, ఆగస్టు 5: రైతుబంధు జీవిత బీమా సర్ట్ఫికెట్ల (ఇన్సూరెన్స్ బాండ్లు) పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) రూపొందించిన ఇన్సూరెన్స్ బాండ్లు ఇప్పటికే మండలాల్లోని వ్యవసాయ శాఖాధికారులకు చేరాయి. వారి నుంచి గ్రామాల్లోని వ్యవసాయ విస్తరణాధికారులు, రైతు సమన్వయ సమితి నేతలు వీటిని గ్రామాలకు ఆదివారం తీసుకువెళ్లారు. ఆ మరుసటి రోజు నుంచే బాండ్ల పంపిణీ మొదలవుతుంది.

08/05/2018 - 06:11

మహబూబ్‌నగర్, ఆగస్టు 4: కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోదకులుగా మారారని అలాం టి వారిని ప్రజలు ఇక పక్కన పెట్టాలని కొడంగల్ ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గులాబీ జెండాను ఎగురవేయడానికి సిద్దంగా ఉన్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

08/05/2018 - 06:10

గోదావరిఖని టౌన్, ఆగస్టు 4: అక్రమంగా ఆధార్ కార్డులు తయారీ చేస్తున్న ముఠాను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గోదావరిఖని ఏసీపీ రక్షిత కే మూర్తి ముఠా వివరాలను వెల్లడించారు.

08/05/2018 - 06:10

నిజామాబాద్, ఆగస్టు 4: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్ తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌పై పోలీసులు నిర్భయ చట్టంతో పాటు మరో ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నేపథ్యంలో, అరెస్టు బారి నుండి తప్పించుకునేందుకు సంజయ్ ముందస్తు బెయిల్ పొందే యత్నాల్లో నిమగ్నమై ఉన్నట్టు భావిస్తున్నారు.

08/05/2018 - 06:09

నిజామాబాద్, ఆగస్టు 4: ఉత్తర తెలంగాణ జిల్లాల జలసిరి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం పోలీసుల దిగ్బంధనంలో ఉంది. కాకతీయ కాల్వకు లీకేజీ జలాలను విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ సెగ్మెంట్‌లోని 24గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన బాటలో పయనిస్తున్న నేపథ్యంలో ఎస్సారెస్పీ రిజర్వాయర్ వద్ద భారీగా పోలీసులను మోహరింపజేశారు.

08/05/2018 - 06:01

హైదరాబాద్, ఆగస్టు 4: స్వచ్ఛ భారత్‌పై యువతలో చైతన్యం కలిగించేందుకు, తద్వారా సమాజంలో సమూల మార్పునకు తోడ్పడే విధంగా వేసవి కాలంలో స్వచ్ఛ భారత్‌పై ఇంటర్న్‌షిప్‌నకు కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో ఆయా విద్యాసంస్థల విద్యార్థులు గ్రామాలకు వెళ్లి తమ సేవలను అందిస్తారు.

08/05/2018 - 06:00

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణలో సూక్ష్మసేద్యానికి (మైక్రోఇరిగేషన్) జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) సమకూర్చిన 874 కోట్ల రూపాయలను సద్వినియోగం చేస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. 2016-17, 2017-18 సంవత్సరాల్లో సూక్ష్మసేద్యం కోసం విడుదల చేసిన నిధులపై శనివారం ఆయన ఇక్కడ సమీక్షించారు.

08/04/2018 - 06:22

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు ఓ వైపు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుండగా మరోవైపు అడవుల నరికివేత ఎధేచ్చగా కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో కోట్లు ఖర్చు చేసిన చేపడుతున్న పథకం లక్ష్యం నెరవేరడం లేదు. నానాటికి పెరుగుతున్న పట్టణీకరణ, పరిశ్రమల స్థాపన వంటి కారణాలతో అడవులు అంతరించి పోయాయి.

Pages