S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/04/2018 - 06:21

హైదరాబాద్, ఆగస్టు 3: ప్రపంచ వ్యాపితంగా సురక్షిత ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం ఒకటని, అందు కోసం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి నగరవాసుల భద్రతపై పోలీసులు వినూత్న ప్రయత్నాలు చేపట్టిందని హైదరాబాద్ నేర విభాగం అడిషినల్ కమిషనర్ శిఖా గోయల్ చెప్పారు. ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నగరంలో విస్తత్రంగా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు.

08/04/2018 - 06:20

హైదరాబాద్, ఆగస్టు 3: భూ రికార్డుల నిర్వహణ ప్రభుత్వాలకు అత్యంత క్లిష్టమైన సమస్య అని, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో వాటిని సురక్షితంగా భద్రపర్చవచ్చని ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. భూ రికార్డులు, భూముల క్రయ, విక్రయాయలను బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రపర్చడం సులభతరంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ బ్లాక్ చైన్ కాంగ్రెస్‌లో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేసారు.

08/03/2018 - 05:49

హైదరాబాద్, ఆగస్టు 2: రాష్ట్రంలోని రైతు బజార్లను దశలవారీగా ఆధునికీకరిస్తామని మార్కెటింగ్ మంత్రి టి. హరీష్‌రావు తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అల్వాల్ రైతు బజార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆధునీకరిస్తామన్నారు. ఇందుకోసం అనుకూలమైన స్థలాన్ని వెదుకుతున్నామని తెలిపారు.

08/03/2018 - 05:48

హైదరాబాద్, ఆగస్టు 2: ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా విక్రయాలు జరుపుతున్న మల్టీప్లెక్స్‌లపై తూనికల కొలతల శాఖ కొరడ ఝులిపించింది. వినోదం కోసం వస్తున్న సందర్శకుల నడ్డివిరిచేలా అధిక ధరలు వసూలు చేస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. నిబంధనల ప్రకారం ఎంఆర్‌పీ ధరల మేరకే విక్రయాలు జరపాలని, మిని, బిగ్, జంబో ప్యాక్‌ల పేరుతో దోపిడీ చేయకూడదని సూచించారు.

08/03/2018 - 05:47

\హైదరాబాద్, ఆగస్టు 2: రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో పంటల సాగు, ఉత్పత్తి, ఉత్పాదకతలపై సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

08/03/2018 - 05:46

హైదరాబాద్, ఆగస్టు 2: కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ హోదాను వదులు కున్నారని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటి ఎకరాలకు నీరు అందిస్తామన్న సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటూ యావత్ తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ కుటుంబం మోసం చేస్తోందన్నారు.

08/03/2018 - 05:45

హైదరాబాద్, ఆగస్టు 2: దివ్యాంగుల సంక్షేమంపై తాను విసిరిన సవాలుకు టీఆర్‌ఎస్ నేతలు తోక ముడిచారని పీసీసీ వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. వికలాంగులకు వాహనాల పంపిణీ సమయంలో మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావులు దేశంలో ఎక్కడా లేని విధంగా వికలాంగులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు.

08/03/2018 - 05:42

హైదరాబాద్, ఆగస్టు 2: దేశంలో ప్రమాణాలే ప్రామాణికం అవుతాయని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ సీ రంగరాజన్ పేర్కొన్నారు. ఉన్నత విద్య నాణ్యత, ప్రతిభ మెరుగుపరిచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉన్నత విద్య అందుబాటు, సమానత్వం, నాణ్యత అనే మూడు అంశాలపై ఉన్నత విద్యారంగం ఆధారపడి ఉంటుందని అన్నారు. గురువారం నాడు జరిగిన ఇక్ఫాయి యూనివర్శిటీ స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు.

08/03/2018 - 05:41

హైదరాబాద్, ఆగస్టు 2: రాజధాని నగరంలోకి రొహింగ్యాలు సహా అక్రమ చొరబాటుల వెనుక మజ్లిస్ హస్తం ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ నగరంలో ఉన్న రొహింగ్యాలను వెనక్కు పంపాలని సూచించారు. అక్రమచొరబాట్లను తొలుత ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.

08/02/2018 - 05:43

హైదరాబాద్, ఆగస్టు 1: ముంబయ- పుణే మార్గంలో ప్రధాన జంక్స్‌న్ అయిన డోన్డ్ రైల్వే స్టేషన్ నుంచి మన్మాడ్ వరకు ట్రాక్ పనులు జరుగుతున్నందున ఆ మార్గంలో నడిచే పలు రైళ్ళను రద్దు చేసినట్లు దక్షణమధ్య రైల్వే ప్రధాన పౌరసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ఈ రైళ్ళు ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టంబర్ 30వ తేదీవరకు, కొన్నింటిని అక్టోబర్ 1వ తేదీ వరకు రద్దు అయినట్లు ఆయన చెప్పారు.

Pages