S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/02/2018 - 05:42

హైదరాబాద్, ఆగస్టు 1: ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలకు సాక్ష్యాధారాలతో సహా మంత్రి హరీశ్‌రావు బయటపెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు, కోదండరామ్ మళ్లీ మునుపటి మాదిరిగానే గోబెల్స్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని టిఆర్‌ఎస్ పార్టీ మండిపడింది.

08/02/2018 - 05:41

హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ట్రానికి తాజాగా నియమితులైన (2017 బ్యాచ్ ఐఎఎస్) 11 మంది అసిస్టెంట్ కలెక్టర్లు బుధవారం శాసనసభ, శాసనమండలిని సందర్శించారు. శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వి. నరసింహా చార్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. వారికి శాసనసభ, శాసనమండలిని చూపించిన తర్వాత కొంత సేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యదర్శి నరసింహాచార్యులు శాసనసభ, శాసనమండలి సమావేశాల గురించి వివరించారు.

08/02/2018 - 05:40

హైదరాబాద్, ఆగస్టు 1: పంపిణీ చేసిన గేదెలకు ఇన్సూరెన్స్‌తో పాటు 3 నెలలకు సరపోయేంత 300 కిలోల దాణాను లబ్దిదారులకు ఇచ్చేందుకు సిద్ధం చేశామని రాష్ట్ర మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

08/02/2018 - 05:39

హైదరాబాద్, ఆగస్టు 1: లంబాడి తండాలను, గిరిజన గూడెంలను, కొద్ది జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా మారుస్తామంటూ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేశామని రాష్ట్ర పంచాయతీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు సందర్భంగా బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన జారీ చేశారు. కొత్త పంచాయతీల ఏర్పాటుతో స్థానిక సంస్థల పాలన కొత్తపుంతలు తొక్కుతుందని మంత్రి పేర్కొన్నారు.

08/02/2018 - 05:31

మహబూబ్‌నగర్, ఆగస్టు 1: హరిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో జిల్లా ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో తెలంగాణకు హరితహారం నాలుగో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు చెరువు గట్లపై ఈత మొక్కలను నాటారు.

08/02/2018 - 05:30

హైదరాబాద్, ఆగస్టు 1: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకరావడానికి జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు రెండు నెలల కిందటి వరకు హడావుడి చేసిన టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రస్తుతం ఆ ఊసే ఎత్తకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును గోప్యంగా ఉంచుతున్నారా? లేక వచ్చే ఎన్నికలపై దృష్టి సారించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కిందా?

08/02/2018 - 05:29

చౌటుప్పల్, ఆగస్టు 1: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు అకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈవోఆర్టీతో పాటు చౌటుప్పల్ మేజర్ గ్రామపంచాయతీ ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్న జి.నర్సిరెడ్డి ఇంటి అనుమతి కోసం యువకుడి నుంచి రూ.70వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారు లు పట్టుకున్నారు. అతన్ని విచారించి రూ. 70 వేలు స్వాధీనం చేసుకున్నారు.

08/02/2018 - 05:28

ములుగు, ఆగస్టు 1: నాలుగో విడత హరితహారం కార్యక్ర మాన్ని సిద్దిపేట జిల్లా ములుగులో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మొక్కలు నాటి ప్రారంభించారు. ఇందులో భాగం గా ప్రతి ఇంట్లో పండ్లు, పూల మొక్కలు నాటాలన్న ముఖ్యమంత్రి ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు మండల కేంద్రమైన ములుగులోని ఇరుపాక ఇంద్రారెడ్డి, భాగ్యమ్మల ఇంటి ఆవరణలో కొబ్బరి మొక్కలు నాటారు.

08/02/2018 - 05:27

కరీంనగర్ (లీగల్), ఆగస్టు 1: శాసనమండలికి 2011 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ పట్ట్భద్రుల నియోజకవర్గ స్థానానికి పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి స్వామిగౌడ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో అప్పట్లో కేసు నమోదైంది.

08/01/2018 - 06:04

హైదరాబాద్, జూలై 31: విద్యుత్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్‌ను పంపిణీ చేసిన ఘనత దేశంలో తెలంగాణ టాప్‌లో ఉందని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అమోగమని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. విభజన జరిగితే తెలంగాణ అంధకారం అవుతుందని విమర్శంచిన నేతలకు ఇప్పుడు నోరుపెగలడం లేదని ఆయన ధ్వజమెత్తారు.

Pages