S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/30/2018 - 01:31

నల్లగొండ, జూన్ 29: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తొలిసారిగా రైతు కుటుంబాలకు అండగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకంలో ఇప్పటిదాకా 18లక్షల మంది రైతులు నామినీ పేర్లతో నమోదు ప్రక్రియ పూర్తి చేశారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు.

06/30/2018 - 01:30

మునుగోడు, జూన్ 29: దేశంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ దళితులపై, మేధావులపై, జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ మునుగోడు నియోజకవర్గ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

06/30/2018 - 01:21

హైదరాబాద్, జూన్ 29: టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మార్చే ప్రసక్తి లేదని పార్టీ అధిష్టానం పదేపదే చెబుతున్నా, కొంత మంది పార్టీ నాయకులు రహస్యంగా సమావేశాలు నిర్వహించడం భావ్యం కాదని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు అన్నారు. టి.పిసిసికి కొత్తగా నియమితులైన ముగ్గురు ఎఐసిసి కార్యదర్శుల దృష్టికి తీసుకెళతానని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

06/30/2018 - 01:25

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి-హబ్ ఎంతో అద్భుతమని అరబ్ ఎమిరేట్స్ విదేశాంగశాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ ప్రశంసించారు. ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో కలిసి శుక్రవారం షేక్ అబ్దుల్లా టి-హబ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టి-హబ్ విశేషాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే అతి పెద్ద ఇంక్యూబెటర్ టి-హబ్‌లో స్థాపించడం పట్ల ఆయన అభినందించారు.

06/30/2018 - 01:17

హైదరాబాద్, జూన్ 29: అంతర్గత భద్రతపై కలిమెలిసి పని చేద్దామని నగర పోలీసు, ఆర్మీ అధికారులు అన్నారు. మిలటరీ ప్రాంతంతో పాటు సమీప ప్రాంతాల్లో తమ గస్తీ, పోలీసు శాఖ గస్తీ ఉన్నప్పటికీ సమన్వయంతో పని చేసి ఇంకా మంచి ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు.

06/30/2018 - 01:12

హైదరాబాద్, జూన్ 29: హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల పరిధిలో విద్యుత్ సరఫరా మెరుగుపర్చడానికి ఆధునిక పరికరాలతో 22 విద్యుత్ సబ్‌స్టేషన్లను త్వరితగతిగా నిర్మాణాలు చేపట్టాలని సంబంధిత శాఖ ఆదేశాలు జారీ చేసింది. తరచుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కల్గుతోందని, దీన్ని నివారించడానికి కొత్తగా విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాలకు ప్రాధాన్యత పెరిగింది.

06/30/2018 - 01:10

హైదరాబాద్, జూన్ 29: రాష్ట్రంలోని గిరిజనులు సమున్నతమైన అభివృద్ధి సాధించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం సంక్షేమ భవన్‌లో గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశం జరిగింది.

06/30/2018 - 01:10

హైదరాబాద్, జూన్ 29: జోగులాంబ గద్వాల జిల్లాలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పర్యటన ఉన్నదని తమ పార్టీ దళిత ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను పోలీసులు గృహ నిర్భంధం చేశారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశత్వానికి పరాకాష్ట అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

06/30/2018 - 01:09

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఒక్కరూ సంతోషంగా లేరని మండిపడ్డారు. న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు సైతం అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు.

06/30/2018 - 01:07

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించతలపెట్టిన రెండో విడత గొర్రెల పంపిణీ వేదిక మారింది. మొదట కామారెడ్డి నుంచి పంపిణీ చేపట్టాలని నిర్ణయించిన అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లను సైతం చేశారు. కాగా ఇటీవల నిర్వహించిన సమావేశంలో వేదికను మార్చాలని నిర్ణయించారు. దీంతో కామరెడ్డి నుంచి ప్రారంభం కావాల్సిన గొర్రెల పంపిణీ కార్యక్రమం సిరిసిల్ల నుంచి మొదలు కాబోతుంది.

Pages