S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/02/2018 - 02:34

బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 1: బాన్సువాడ డివిజన్‌లో జోరుగా జీరో వ్యాపారం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసినప్పటికీ అది ఎక్కడా కూడా అమలు కావడం లేదు. జీరో కింద సరకులను విక్రయిస్తూ వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ప్రధానంగా భవనాల నిర్మాణం కోసం ఉపయోగించే ఐరన్, సిమెంట్ విషయంలో వ్యాపారులు జీఎస్టీని బేఖాతర్ చేస్తున్నారు.

04/02/2018 - 02:32

ఆదిలాబాద్, ఏప్రిల్1: అగ్నిగోళంలా మండుతున్న ఎండలకు తోడు.. అడుగంటుతున్న భూగర్భజలాలతో ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గూడెంలు గుక్కెడునీళ్ళ కోసం పడరానిపాట్లు పడుతున్నాయి. మారుమూల గిరిజన గ్రామాల్లో దాహార్తి తీర్చుకునేందుకు గిరిజనులు రేయింబవళ్లు కాలినడకన మైళ్ళదూరం నరకయాతన పడుతున్నారు.

04/02/2018 - 02:25

హైదరాబాద్, ఏప్రిల్ 1 : తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు రాజధానిలో ఆదివారం సాయంత్రం హఠాత్తుగా వాతావరణం మారిపోయి, వడగళ్లతో పాటు భారీ వర్షం కురిసింది. దీని ప్రభావంతో వివిధ జిల్లాల్లో వరి, మామిడి తదితర పంటలకు నష్టం భారీగా వాటిల్లింది.

04/02/2018 - 03:57

హైదరాబాద్: తెలంగాణ ప్రజలను పట్టించుకోని కేసీఆర్ దేశం కోసం ఫెడరల్ ఫ్రంట్ పెడతామనడం హాస్యాస్పదమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు.

04/02/2018 - 02:20

హైదరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘రైతుబంధు’ పథకం కింద అందచేయాల్సిన పంటల పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిల సూచనల మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి ఈ అంశంపై ప్రతిరోజూ రెవెన్యూ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు.

04/02/2018 - 02:19

హైదరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణలోని 104 రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖను తనిఖీ చేయగా 3599 కేసుల్లో రూ. 42.06 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు వెల్లడైందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొంది. 2016-17 సంవత్సరానికి 104 రిజిస్ట్రేషన్ శాఖల కార్యాయాల్లో రికార్డులను శాంపిల్‌గా తనిఖీ చేసినప్పుడు ఈ విషయం బహిర్గతమైంది.

04/02/2018 - 02:19

హైదరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంక్షేమ రంగానికి నిధులు ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులోకి వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.5919.83 కోట్ల నిధులు లభ్యతగా ఉండడంతో, నిర్దేశించిన సంక్షేమ పఫథకాల అమలుకు కెసిఆర్ సర్కార్ సమాయత్తమవుతోంది. ట్యూషన్ ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ కింద ఈ ఏడాది రూ.800 కోట్ల నిధులు కేటాయించారు. ఈ స్కీం బిసి విద్యార్థులకు ఆక్సిజన్ లాంటిదని చెప్పొచ్చు.

04/02/2018 - 02:18

హైదరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి డిస్కాంలు యథేచ్ఛగా విద్యుత్ కొనుగోళ్లు చేయాలన్న ప్రతిపాదనలకు చెక్ పెట్టింది. విద్యుత్ చార్జీలు పెరగకపోయినా, అంతర్గత సామర్థ్యం పెంచుకోవాలని టిఎస్‌ఇఆర్‌సీ సిఫార్సు చేసింది. 2018-19 సంవత్సరానికి సంబందించి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగలేదు.

04/02/2018 - 04:00

హైదరాబాద్: నగర శివారుల్లో ఒకే రోజు వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకేసారి ఇన్ని సంఘటనలు జరగడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోడ్డు ప్రమాదాలు జరిగి ఒకరు మృతి చెందితే, దంపతులకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు అగ్నిప్రమాదాలు వేర్వేరు చోట్ల జరిగితే, మరో అత్యంత విషాదకర సంఘటన పెళ్లింట విషాదచాయలు అలుముకున్నాయి.

04/02/2018 - 02:13

హైదరాబాద్, ఏప్రిల్ 1: వికలాంగుల పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాలని సీపీఎం డిమాండ్ చేసింది. దీనికి కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని, విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఐక్య పోరాటాలు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టీ జ్యోతి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు-వికలాంగులపై ప్రభావం అనే అంశంపై పార్టీ నాయకుడు గొరెంకల నర్సింహ అధ్యక్షతన ఆదివారం సదస్సు జరిగింది.

Pages