S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/03/2018 - 04:56

హైదరాబాద్, ఏప్రిల్ 2: ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో విఫలమైన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రోజురోజుకూ పట్టుకోల్పోతోందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కనుగుతోందని, నియంత పాలన కొనసాగుతోందని ఆరోపించారు.

04/03/2018 - 04:55

హైదరాబాద్, ఏప్రిల్ 2: కొరియన్ భాష నేర్చుకుంటే భారతీయులకు వేలాది ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కొరియా కాన్సుల్ జనరల్ సురేష్ చుక్కపల్లి పేర్కొన్నారు. కొరియన్ భాష అధ్యయనంలో నూతన పోకడలు అనే అంశంపై ఆంగ్లం -విదేశీ భాషల విశ్వవిద్యాలయంలో సోమవారం నాడు ప్రారంభమైన మూడో అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సు రెండు రోజులపాటు జరుగుతుంది.

04/03/2018 - 04:54

హైదరాబాద్, ఏప్రిల్ 2: రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 499 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర హోంశాఖ అనుమతినిచ్చింది. ప్రత్యక్ష నియామక పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టఎస్‌పిఎస్‌సీ) ద్వారా చేపట్టాలని ఆదేశించింది.

04/03/2018 - 04:53

హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్, 12 బీసీ కులాల ఫెడరేసన్ల ద్వారా అందించనున్న సబ్సిడీ రుణాల గడువును పెంచాలని ముఖ్యమంత్రికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. దరఖాస్తు చేసుకునేందుకు అతి తక్కువ సమయం గడువు విధించడం వల్ల ధరఖాస్తు చేసుకోలేక పోతున్నారని అన్నారు.

04/03/2018 - 04:52

హైదరాబాద్, ఏప్రిల్ 2: కమ్యునిస్టుల మధ్య ఉన్నది అభిప్రాయ బేధాలు తప్ప విభేదాలు కావని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి ఉద్యమిస్తామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆర్టీసీ కల్యాణ మండపంలో సీపీఐ రాష్ట్ర ద్వితీయ మహాసభల్లో సురవరం ప్రారంభోపన్యాసం చేశారు.

04/03/2018 - 04:41

హైదరాబాద్, ఏప్రిల్ 2: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడ్ రెగ్యులేటర్ ద్వారా వినియోగించుకుంటున్న నీటికి లెక్కకట్టాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసారు.

04/03/2018 - 04:23

హైదరాబాద్, ఏప్రిల్ 2: ప్రైవేటు , కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల క్రమబద్ధీకరణకు నియమించిన ప్రొఫెసర్ టి తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం అధ్యయ నం ప్రారంభించింది. కమిటీ రిపోర్టు అమలుచేయాలంటే మరికొన్ని అంశాలపై స్పష్టత కావాలని ప్రభుత్వం సూచించినట్టు తెలిసింది. నాలుగు అంశాలపై మరింత లోతైన అధ్యయనం చేసి సమగ్రంగా సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రొఫెసర్ తిరుపతిరావును కోరింతది.

04/03/2018 - 04:22

ధర్మపురి, ఏప్రిల్ 2: బాల్యం నుండీ చదువులో ముందుండి, చేసిన ప్రతి ఉద్యోగంలోనూ ప్రత్యేక గుర్తింపు నందుకున్న ఒక యువకుడు, ఉద్యోగాలలో రాణించాలనే తండ్రి కోరికను కాదని, దేశానికి సేవ చేయాలన్నదే తన జీవిత ధ్యేయమని చెప్పి, ఒప్పించి, తన లక్ష్యాన్ని సాధించాడు.

04/03/2018 - 04:18

సూర్యాపేట, ఏప్రిల్ 2: రాష్టవ్య్రాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న శాసనసభ్యుల నివాస వసతి సముదాయాలను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.

04/03/2018 - 04:16

చింతపల్లి, ఏప్రిల్ 2: 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించి అధికారంలోకి రావడం ఖాయమని సీఎల్పీ ఉప నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లిలోనిశ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో సోమవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మానవత్వమే లేదన్నారు.

Pages