S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/04/2018 - 02:20

హైదరాబాద్, ఏప్రిల్ 3: వ్యాయామ విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టిఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు ఎలాంటి అపరాథ రుసుం లేకుండా ఈ నెల 10వ తేదీ వరకూ ఉందని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ తెలిపారు. డీపీఈడీ కోర్సునకు ఇంటర్ సెకండియర్ చదువుతున్న వారు అర్హులని, డిగ్రీ చేసిన వారు బీపీఈడీకి అర్హులని పేర్కొన్నారు.

04/04/2018 - 02:19

హైదరాబాద్, ఏప్రిల్ 3: రీసెర్చి విద్యార్థులకు ఫెలోషిప్‌ల విడుదలలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి నిరసనగా ఏబీవీపీ నేతలు మంగళవారం నాడు ఉస్మానియా యూనివర్శిటీలో తీవ్ర ఆందోళన, ర్యాలీ నిర్వహించారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఎప్పటిపుడు నిధులను విడుదల చేయాల్సి ఉన్నా, పట్టించుకోవడం లేదని ఏబీవీపీ సిడబ్ల్యుసి సభ్యుడు మట్ట రాఘవేందర్ ఆరోపించారు.

04/04/2018 - 02:19

హైదరాబాద్, మార్చి 3: వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన ప్రణాళికలను రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పేర్కొన్నారు. వాతావరణ మార్పులు-సమాజంపై ప్రభావం అన్న అంశంపై మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ, ప్రకృతిలో మనం ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల వైపరీత్యాలు సంభవిస్తున్నాయన్నారు.

04/03/2018 - 05:05

హైదరాబాద్, ఏప్రిల్ 2: ‘కాగ్’ నివేదికపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడో మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడో మాట మాట్లాడటం కాంగ్రెస్ నేతల రెండు నాలుకల ధోరణికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు.

04/03/2018 - 05:04

హైదరాబాద్, ఏప్రిల్ 2: ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచి, విద్యార్థుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ముకుతాడు వేస్తున్నారు. అదనంగా ఫీజు చెల్లించమని కోరితే చెల్లించవద్దని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రుల సంఘాల ప్రతినిథులు కోరుతున్నారు.

04/03/2018 - 05:03

హైదరాబాద్, ఏప్రిల్ 2: రాష్ట్రంలో గౌడ కులస్తుల ఆర్థికాభివృద్ధికి గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గౌడ మేధావులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. సోమవారం ఇక్కడ గౌడ మేధావులు, ఉద్యోగులు, నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ జీ రాజేశంగౌడ్ మాట్లాడుతూ, గౌడ కులాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించారన్నారు.

04/03/2018 - 05:02

రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్లిన జోగినపల్లి సంతోష్‌కుమార్ సోమవారం ఎంపీ కవితతో కలిసి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడిని మర్యాద పూర్వకంగా కలిసిన దృశ్యం

04/03/2018 - 05:00

హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణలో రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందచేస్తున్న కిరోసిన్ ధరను వాయిదాల పద్ధతిలో పెంచుతున్నారు. కేంద్రప్రభుత్వం కిరోసిన్ హోల్‌సేల్ ధరలను పెంచుతుండటంతో ప్రజలకు అందించే రిటైల్ ధరలను పెంచక తప్పడం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు పౌరసరఫరాల ముఖ్యకార్యదర్శి సివి ఆనంద్ పేరుతో సోమవారం జీఓ జారీ అయింది.

04/03/2018 - 04:59

హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొమురయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్‌గా, ఓ అండ్ ఈ చీఫ్ మేనేజర్‌గా ఆయన పని చేసి పదోన్నతిపై ఈడీగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎండి జీవీ రమణారావును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎండీ ఆయనకు అభినందనలు తెలిపారు.

04/03/2018 - 04:57

హైదరాబాద్, ఏప్రిల్ 2: కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన బస్సు యాత్ర విహారయాత్రను తలపిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ ఏ మేరకు అభివృద్ధి చేసిందో చెప్పగలరా అని ప్రశ్నించారు.

Pages