S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 23:31

శ్రీకాకుళం, నవంబర్ 21: మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నేత గొర్లె హరిబాబునాయుడు మంచి స్నేహశీలి, సేవాభావం గల నాయకుడని ఎఐసిసి కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతురావు అన్నారు. సోమవారం జిల్లాలో రణస్థలం మండలం పాతర్లపల్లిలో జరిగిన హరిబాబు సంతాపసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసమస్యల పట్ల మంచి అవగాహన కలిగి ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగిన నాయకుడని కొనియాడారు.

11/21/2016 - 23:31

ఎచ్చెర్ల, నవంబర్ 21: ప్రభుత్వ అధికారులు నిరంతరం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వర్తించాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. ఎపి మానవ వనరుల అభివృద్ధి, జిల్లా శిక్షణ సంస్థల సంయుక్తంగా ఎస్‌ఎం పురం పరిధిలో 21వ శతాబ్దపు గురుకుల భవనంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు 12 రోజులు శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి.

11/21/2016 - 23:30

ఎచ్చెర్ల, నవంబర్ 21: ప్రజల ముంగిటకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు తీసుకువెళ్లేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనచైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారని జెడ్పి చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. భగీరథపురం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి జనచైతన్య యాత్రను ప్రారంభించి అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

11/21/2016 - 23:29

సోంపేట, నవంబర్ 21: మత్స్యకారుల సంక్షేమమే నా ధ్యేయమని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బి.అశోక్ అన్నారు. తీర ప్రాంత మత్స్యకార ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మండలంలో ఇసుకలపాలెం మత్స్యకార గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

11/21/2016 - 23:29

శ్రీకాకుళం(కల్చరల్), నవంబర్ 21: నగరంలో పలు శివాలయాల్లో నాలుగో కార్తీక సోమవారం శివనామస్మరణతో మోగాయి. ఈ సందర్భంగా పాలకొండ రోడ్డులో ఉన్న నీలకంఠస్వామి ఆలయంలో అర్చకుడు రాజలింగం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం, మారేడు పత్రి, తులసీ దళాలతో పూజలు నిర్వహించారు. మహిళలు నంది వద్ద కార్తీక దీపాలు వెలిగించారు.

11/21/2016 - 23:28

జలుమూరు, నవంబర్ 21: కార్తీక మాసం నాలుగో సోమవారాన్ని పురస్కరించు కుని మండలం శ్రీముఖలింగం మధుకేశ్వరుడు, జలుమూరు స్వయంభీమేశ్వర, యలమంచిలి ఎండలకామేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణాలు శివనామస్మరణతో హోరెత్తాయి. భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వ్యవసాయ పనులు జోరుగా అందుకుంటున్నందున కూడా సోమవారం భక్తులు తరలివచ్చారు.

11/21/2016 - 23:28

సారవకోట, నవంబర్ 21: మండలంలోని కిడిమి గ్రామంలో సోమవారం ఉదయం సంభవించిన అగ్ని ప్రమాదంలో రెండు గృహాలు కాలిపోయాయి. ఈ గ్రామానికి చెందిన బండి రామయ్య గృహంలో లక్ష రూపాయలు నగదుతోపాటు తులంన్నర బంగారం, అదే విధంగా గుడారి తిలకమ్మ గృహంలో రూ.10వేల నగదుతోపాటు తులంన్నర బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. కాలిపోయిన నోట్ల కట్టలను చూసి బాధితులు లబోదిబోమన్నారు.

11/21/2016 - 23:22

సంగారెడ్డి టౌన్, నవంబర్ 21: రైతులు వేసిన పంటలు నష్టపోకుండా అధిక దిగుబడి వచ్చేలా సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఎఇఓలతో సమీక్షించారు.

11/21/2016 - 23:21

నర్సాపూర్,నవంబర్ 21: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమి కజ్జా చేసేందుకు కొందరు భూ బకాసురులు సోమవారంనాడు ఏకంగా జెసిబిలు పెట్టి చదును చేసినా అధికార యంత్రాంగం కదలకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

11/21/2016 - 23:21

సిద్దిపేట, నవంబర్ 21: సిద్దిపేటలో అనుమతిలేని భవనాలపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ రాజనర్సు హెచ్చరించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను చర్యలు తీసుకోవాలని టిపిఓలను ఆదేశించారు. మున్సిపల్ అనుమతి ప్రకారమే భవనాలు నిర్మించాలని, సెట్‌బ్యాక్ విధిగా పాటించాలన్నారు.

Pages