S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమి కబ్జా!

నర్సాపూర్,నవంబర్ 21: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమి కజ్జా చేసేందుకు కొందరు భూ బకాసురులు సోమవారంనాడు ఏకంగా జెసిబిలు పెట్టి చదును చేసినా అధికార యంత్రాంగం కదలకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నర్సాపూర్ పట్టణంలోని ప్రధాన రహదారికి అతి సమీపంలో గల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమ కజ్జాదారులు అక్రమించేందుకు ఏకంగా జెసిబి సహయంతో సోమవారంనాడు చదును చేశారు. గత సంవత్సరం జేసి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ భూములను సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలం అంటూ బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. కాగా కొందరు అట్టి భూమిలోని అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి చదును చేసేందుకు ఉపక్రమించారు. నర్సాపూర్‌లో రెవెన్యూ డివిజన్ ఉన్నప్పటికి ఒక్క అధికారి కూడ కబ్జా కోసం చదును చేస్తున్న స్థలానికి వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వ అధికారులు కుమ్మకై అట్టి భూమిని అక్రమ కజ్జాదారులకు అప్పగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిసింది. ఒక అధికారి ఉన్నప్పుడు ప్రభుత్వ భూమి అవుతుంది తర్వాత అది పట్టా భూమి అవుతుందా! అనే పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇట్టి భూమిపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని కజ్జా చేసేందుకు ఉపక్రమించిన వారిని శిక్షించాలని కోరుతున్నారు.