S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అగ్ని ప్రమాదంలో రెండిళ్ళు దగ్ధం

సారవకోట, నవంబర్ 21: మండలంలోని కిడిమి గ్రామంలో సోమవారం ఉదయం సంభవించిన అగ్ని ప్రమాదంలో రెండు గృహాలు కాలిపోయాయి. ఈ గ్రామానికి చెందిన బండి రామయ్య గృహంలో లక్ష రూపాయలు నగదుతోపాటు తులంన్నర బంగారం, అదే విధంగా గుడారి తిలకమ్మ గృహంలో రూ.10వేల నగదుతోపాటు తులంన్నర బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. కాలిపోయిన నోట్ల కట్టలను చూసి బాధితులు లబోదిబోమన్నారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడం ఆ సమయంలో గ్రామంలో ఎవ్వరూ లేకపోవడం వలన రెండు గృహాలు కాలిపోగా బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. బండి రామయ్య ఇంటిలో అతని కుమారుడు పాపారావుకు సంబంధించిన 10వ తరగతినుండి డిగ్రీ వరకు ధ్రువపత్రాలు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాలతో పాటు ఎటిఎం కార్డులు కూడా పూర్తిగా కాలిపోయాయి. రెవెన్యూ అధికారి నారాయణరావు, గ్రామ పరిలనాధికారి శేఖర్‌బాబు సందర్శించి వివరాలు సేకరించారు. కోటబొమ్మాళి అగ్నిమాపక సిబ్బంది హాజరై మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వైసిపి నేత చిన్నాల వెంకటసత్యన్నారాయణ, బాధితులను పరామర్శించి రూ.2వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బాధితులకు అవసరమైన సహాయం అందజేస్తామని ఆమె తెలిపారు.