S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శివాలయాల్లో పూజలు

శ్రీకాకుళం(కల్చరల్), నవంబర్ 21: నగరంలో పలు శివాలయాల్లో నాలుగో కార్తీక సోమవారం శివనామస్మరణతో మోగాయి. ఈ సందర్భంగా పాలకొండ రోడ్డులో ఉన్న నీలకంఠస్వామి ఆలయంలో అర్చకుడు రాజలింగం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం, మారేడు పత్రి, తులసీ దళాలతో పూజలు నిర్వహించారు. మహిళలు నంది వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. అదేవిధంగా నాగావళి నది ఒడ్డున ఉన్న ఉమా నీలకంఠేశ్వరస్వామి, శివబాలాజీ ఆలయంలో స్పటికా శివలింగంకు, బలగలోగల శివనాగేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తులో భక్తులు దర్శించుకున్నారు.
సాక్షర భారత్ కేంద్రాలు తనిఖీ
ఎచ్చెర్ల, నవంబర్ 21: వయోజనుల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లో ఉన్న వివిధ సాక్షరభారత్ కేంద్రాల వాలంటీర్లు కృషి చేయాలని డివిజనల్ పరిశీలకుడు ఏ.సోమేశ్వరరావు అన్నారు. మండలంలోని కుశాలపురం, తమ్మినాయుడుపేట సాక్షరభారత్ కేంద్రాలను ఆయన సోమవారం పరిశీలించి పుస్తకాలు, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు.
ఈ కేంద్రాలు బహుళ ప్రయోజనాలు చేకూర్చేలా నడపాలన్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం వంటి లక్ష్యాలతో తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆర్డినేటర్ నక్క తాతారావు, వాలంటీర్లు ఉన్నారు.