S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శివనామస్మరణతో హోరెత్తిన శైవక్షేత్రాలు

జలుమూరు, నవంబర్ 21: కార్తీక మాసం నాలుగో సోమవారాన్ని పురస్కరించు కుని మండలం శ్రీముఖలింగం మధుకేశ్వరుడు, జలుమూరు స్వయంభీమేశ్వర, యలమంచిలి ఎండలకామేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణాలు శివనామస్మరణతో హోరెత్తాయి. భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వ్యవసాయ పనులు జోరుగా అందుకుంటున్నందున కూడా సోమవారం భక్తులు తరలివచ్చారు. ముఖలింగం ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఈవో నారాయణ, జలుమూరు ఎస్ ఐ నర్శింహమూర్తి తన సిబ్బందితో పర్యవేక్షణ నిర్వహించారు. నగిరికటకం, కొమనాపల్లి, చల్లవానిపేట, సాయి సేవా సమితి సభ్యులు ఆలయ ప్రాంగాణం పరిశుభ్రత చేపట్టి భక్తులకు సౌకర్యంకల్పించారు.
వెలుగు సిబ్బందికి జియోట్యాకింగ్‌పై అవగాహన సదస్సు
నరసన్నపేట, నవంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వెలుగు సిబ్బందికి జియోట్యాకింగ్‌పై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామని జిల్లా జాబ్స్ మేనేజర్, ఏరియా కో ఆర్డినేటర్ రాజ్‌కుమార్ తెలిపారు. సోమవారం వెలుగు కార్యాలయంలో ఈ మేరకు కైజూలాయాప్‌ను సీసీలు, సి ఎఫ్‌ల ట్యాబ్‌లకు అనుసందానం చేస్తున్నామని దీని వలన అన్ని విధాల సంక్షేమ పథకాలు నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో నరసన్నపేట, పోలాకి, జలుమూరు, గార మండలాల వెలుగు సిబ్బందితోపాటు ఏ పి ఎంలు పాల్గొన్నారు.