S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/18/2016 - 02:27

మహబూబ్‌నగర్, నవంబర్ 17: పాలమూరు జిల్లా బిజెపి కార్యాలయంపై ఆ పార్టీ కార్యకర్తలే దాడి చేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా బిజెపిలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు, అంతర్గత కలహాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. జిల్లా అధ్యక్ష పదవికి మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్యలు పోటీపడ్డారు.

11/18/2016 - 02:22

హైదరాబాద్, నవంబర్ 17: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కోట్లకు పడగలెత్తిన పలు కార్పొరేట్ ఆసుపత్రుల ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు దృష్టి సారించాయ. రద్దయిన పెద్ద నోట్లను భారీ సంఖ్యలో మార్పిడి చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు కార్పొరేట్ ఆసుపత్రులను ఉపయోగించుకుంటున్నారనే సమాచారంతో ఆదాయంపన్ను శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజన్సీలు అప్రమత్తమయ్యాయి.

11/18/2016 - 02:21

కౌటాల, నవంబర్ 17: పురుగుల అన్నం తిన్న కారణంగా తీవ్ర అస్వస్థతకు లోనై ఒక్కసారిగా ఆందోళన రేకెత్తించిన కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల వసతిగృహం పరిస్థితి గురువారం మరింత ఆందోళనకరంగా మారింది. బుధవారం 23మంది విద్యార్థినిలు ఎమ్మెల్యే కోనప్ప పర్యవేక్షణలో ఆస్పత్రిలో చేరగా గురువారం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీలు జరగడం వాస్తవ పరిస్థితిని ఆరా తీశారు.

11/18/2016 - 02:21

మంచిర్యాల అర్బన్, నవంబర్ 17: మంచిర్యాల మండలం హాజీపూర్ పోలీసుస్టేషన్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయ.

11/18/2016 - 02:20

హైదరాబాద్, నవంబర్ 17: మెదక్ జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే భూమిలేని నిరుపేదలు, వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ. 12.50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ఆరు గ్రామాల వివరాలను అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి హైకోర్టుకు అందచేశారు. ఈ కేసును హైకోర్టు ధర్మాసనం విచారించింది.

11/18/2016 - 02:19

ఆదిలాబాద్, నవంబర్ 17: ఉప ఎన్నికల కేసులో గురువారం ఆదిలాబాద్ కోర్టు విచారణకు హాజరైన టిటిడిపి మాజీ నాయకుడు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, టి-టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణలు కోర్టుకు హాజరయ్యారు. ఒకే కారులో ప్రయాణించి.. మధ్యాహ్న విందులో కలిసి భోజనం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

11/18/2016 - 01:26

అనంతపురంటౌన్, నవంబర్ 17: పెద్దనోట్ల రద్దుపై పునఃసమీక్ష జరపాలని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అనంతపురం నగరంలోని వివేకానంద జూనియర్ కాలేజీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు.

11/18/2016 - 01:24

తిరుపతి, నవంబర్ 17: రిజర్వేషన్లు ఓటు బ్యాంకు రాజకీయాలకోసమేనా? మీరు సిఎం అయితే రిజర్వేషన్ రద్దుచేస్తారా?, చదలవాడ కళాశాలలో పామ్- డి చదువుతున్న ఓ విద్యార్థి కృష్ణసాయిరెడ్డి నారా లోకేష్‌ను ప్రశ్నించారు. ఇది సున్నితమైన అంశమని, ఆర్థికంగా వెనుబకడిన అన్ని కులాలలోని నిరుపేదలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ సమాధానమిచ్చారు.

11/18/2016 - 01:19

అమరావతి, నవంబర్ 17: తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు వయసును కూడా లెక్కచేయకుండా కష్టపడుతున్నారు. దానికి తమ మేధస్సు జోడించి సత్ఫలితాలిచ్చేలా చూడాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయ ఐఏఎస్‌లు (సీఎంఓ) పార్టీ ఆశలకు అనుగుణంగా పనిచేయడం లేదని, తమకంటే సూటుబూటు వేసుకున్న వారికే రెడ్‌కార్పెట్ వేయడాన్ని తెలుగుదేశం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

11/18/2016 - 01:16

విజయవాడ, నవంబర్ 17: పట్టణ ప్రాంతాల్లోని ఎటిఎంల్లో 50 రూపాయల నోట్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంత ఎటిఎంల్లో రూ.50 నోట్లను జారీ చేస్తున్నప్పటికీ పట్టణాల్లో, నగరాల్లో జారీ చేయలేదు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్యను అధిగమించేందుకు వీలుగా ఈ నోట్లను ఎటిఎంల్లో అందుబాటులో ఉంచనున్నారు.

Pages