S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/18/2016 - 03:22

హైదరాబాద్, నవంబర్ 17: పెద్దనోట్ల రద్దువల్ల దేశవ్యాప్తంగా ఉత్పన్నమైన పరిస్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ వివరించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో అవలంబించాల్సిన వ్యూహాన్ని ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువెళ్లారు. దీనికి వెంటనే స్పందించిన ప్రధాని ‘మీ వద్ద ఉన్న ప్రతిపాదనలను లిఖితపూర్వకంగా తీసుకొని ఢిల్లీకి రండి చర్చిద్దాం’ అని కోరారు.

11/18/2016 - 03:21

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌తో పంచుకుంటే తమకు మిగిలేది ఏమీ ఉండదని సుప్రీంకోర్టు ఎదుట తెలంగాణ ప్రభుత్వం వాదించింది. కేసు తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 18కి వాయిదా వేసింది. కృష్ణా నదీ జలాల వివాదం కేసును గురువారం న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితాబ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

11/18/2016 - 03:11

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ ఉభయ సభలూ గురువారం దద్దరిల్లి పోయాయి. దేశ వ్యాప్తంగా సామాన్యుల జీవితాలు వీధిన పడ్డాయంటూ విపక్షాలు రెండు సభల్లోనూ ప్రభుత్వంపై విరుచుకు పడ్డాయి. కోటానుకోట్ల మంది జీవితాలను వీధిపాలు చేసిన ఈ నిర్ణయంపై జరుగుతున్న చర్చకు హాజరై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. అందుకు సర్కార్ నిరాకరించింది.

11/18/2016 - 03:08

వాషింగ్టన్, నవంబర్ 17: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నిక్కీ హేలీ నియమితమయ్యే అవకాశాలున్నాయంటూ కధనాలు జోరుగా సాగుతున్నాయి. రెండు సార్లు దక్షిణ కరోలినా గవర్నర్‌గా పనిచేసి తన సమర్థతను చాటుకున్న నిక్కి హేలీ కొత్త అధ్యక్షుడ్ని కలుసుకోనున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి పదవి ఆమెకు ఖాయమన్న వాదనకు మరింత బలం చేకూరింది.

11/18/2016 - 03:04

విశాఖపట్నం, నవంబర్ 17: నగదు రహిత లావాదేవీలు జరిగే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని, దీనికోసం ప్రతి ఒక్కరూ జన్‌ధన్ ఖాతాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలో గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కరెన్సీ ప్రమేయం లేకుండా ఆర్థిక కార్యకలాపాలు జరిగితే అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. బ్యాంకుల్లో ఖాతాలతో రూపీ కార్డ్ తీసుకుంటే కొనుగోళ్లకు నగదు ప్రమేయం ఉండదన్నారు.

11/18/2016 - 03:02

విశాఖపట్నం, నవంబర్ 17: ‘బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందన్న టిడిపి ఎన్నికల నినాదాన్ని విస్మరించలేదు. బాబు అధికారంలోకి వచ్చాడు, ఇక జాబు తప్పకుండా వస్తుంది’ అని యువతకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. విశాఖ ఎయు గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించే విధంగా కొత్త పాలసీకి రూపకల్పన చేస్తున్నట్టు వెల్లడించారు.

11/18/2016 - 02:48

విజయవాడ (క్రైం), నవంబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతమున్న సెక్యూరిటీ కన్నా భారీగా భద్రత సిబ్బందిని పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ముఖ్యమంత్రికి వారినుంచి ముప్పు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలకు సమాచారం అందింది. ముఖ్యమంత్రి సెక్యూరిటీ గ్రూప్‌లో కొత్తగా 290 మంది భద్రతా అధికారులు సిబ్బంది వచ్చి చేరారు.

11/18/2016 - 02:37

హైదరాబాద్, నవంబర్ 17: పెద్ద నోట్ల రద్దుతో వ్యాపార కార్యకలాపాలు స్తంభించిన ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం డబ్బు వేటలో పడింది. జీతాలు, తప్పనిసరి ఖర్చులకు సరిపోయే విధంగానైనా డబ్బులు సర్దుబాటు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తోంది.

11/18/2016 - 02:33

హైదరాబాద్, నవంబర్ 17: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణించిన వారి మృత దేహాన్ని వారి ఇళ్ల వరకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం హర్సే పేరుతో పరమ పద వాహనాలను ఏర్పాటు చేస్తోంది. ఈ వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో ప్రారంభిస్తారు.

11/18/2016 - 02:31

సిరిసిల్ల, నవంబర్ 17: శాంతి ఉన్నచోటే అభివృద్ధి సాధ్యమని, శాంతి భద్రతలు లేనిచోట అభివృద్ధి దూరమవుతుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం సిరిసిల్ల రాజన్న జిల్లా సిరిసిల్ల మండలం సర్దాపూర్‌లో 17వ పోలీస్ బెటాలియన్‌కు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కె.తారకరామారావు, నాయిని నర్సింహారెడ్డి పోలీసు వందనం స్వీకరించారు.

Pages