S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘కస్తూర్బా’ పరిస్థితి మరింత విషమం

కౌటాల, నవంబర్ 17: పురుగుల అన్నం తిన్న కారణంగా తీవ్ర అస్వస్థతకు లోనై ఒక్కసారిగా ఆందోళన రేకెత్తించిన కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల వసతిగృహం పరిస్థితి గురువారం మరింత ఆందోళనకరంగా మారింది. బుధవారం 23మంది విద్యార్థినిలు ఎమ్మెల్యే కోనప్ప పర్యవేక్షణలో ఆస్పత్రిలో చేరగా గురువారం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీలు జరగడం వాస్తవ పరిస్థితిని ఆరా తీశారు. ఓవైపు ఇలా జరుగుతుండగానే ఉదయం నుంచి సాయంత్రం దాకా మరో 11మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడటం, ఫిట్స్‌రావడం, తలనొప్పి, కడుపునొప్పి తదితర కారణాలతో కుప్పకూలిపోయారు. ఎంపిపి చదువుల జ్యోతి శ్రీనివాస్, ఎస్సైలు అశోక్, శ్రీ్ధర్, విద్యాధికారి సోమయ్య, ఎంపిడివో రాజేశ్వర్‌లు ప్రత్యేకంగా చొరవచూపి పోలీసు వాహనాల్లో బాలికలను హుటాహుటిన ప్రథమ చికిత్స అందించడంతోపాటు మెరుగైన చికిత్స కోసం సిర్పూర్ సామాజిక ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల ఆదేశాలతో కస్తూర్బా ప్రత్యేకాధికారిణి వీణ వసుంధర నుంచి అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తమకు నాణ్యమైన భోజనాన్ని అందించకపోగా.. ప్రత్యేకాధికారి చులకనగా మాట్లాడుతోందని విచారణలో అధికారుల ముందు విద్యార్థినులు వాపోయారు.కస్తూర్బా ప్రత్యేకాధికారిణిని సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి.
ఇదిలా ఉండగా, విద్యార్థినుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనప్ప హుటాహుటిన సంబంధిత వసతిగృహానికి చేరుకొని విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను ఓదార్చారు. మీకేం భయంలేదని, అవసరమైతే తాను ఇక్కడే పడుకొని ప్రత్యేక వైద్యులుండేలా శ్రద్ధ తీసుకుంటానని విద్యార్థినులకు ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఎంపిపి చదువుల జ్యోతి శ్రీనివాస్, సిఐలు అచ్చేశ్వరరావు, నాగేందర్‌లు, ఎంఈవో సోమయ్య, ఎంపిడివో రాజేశ్వర్‌లు ఉన్నారు.