S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/18/2016 - 01:02

విజయవాడ, నవంబర్ 17: ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ను పటిష్ఠంగా అమలుపర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న రేషన్ డీలర్ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. డీలర్లకు ఆర్థిక పరిపుష్టి కలిగేలా చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు బియ్యం, గోధుమలపై భారీగా కమీషన్ పెంచింది. రేషన్ షాపులను మినీ ఏటిఎంలుగా మార్చేసి నగదు లావాదేవీల్లో కమిషన్ అందజేయాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 28,942 రేషన్ దుకాణాలు ఉన్నాయి.

11/18/2016 - 01:01

హైదరాబాద్, నవంబర్ 17: మనీ సర్క్యులేషన్ స్కాంలో నిందితుడిగా ఉన్న మైఖేల్‌ఫెరీరా మరో నలుగురిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను హైకోర్టు ధర్మాసనం గురువారం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం వద్ద పిటిషన్ దాఖలు చేసింది.

11/18/2016 - 01:00

చిత్తూరు, నవంబర్ 17 : చిత్తూరు ఎమ్మెల్యే డిఎ సత్యప్రభ గురువారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 9.30 గంటలకు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన దివంగత మేయర్ కఠారి అనురాధ దంపతుల విగ్రహాలను ఆవిష్కరించారు. కార్యక్రమానంతరం లక్ష్మినగర్ కాలనీలో ఉన్న తన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అకస్మాత్తుగా షుగర్ లెవల్స్‌తో పాటు బిపి పెరిగిపోవడంతో ఇబ్బంది పాలయ్యారు.

11/18/2016 - 01:00

హైదరాబాద్, నవంబర్ 17: పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం తెల్లధనంగా మార్చుకోవడానికి ఎవరి మార్గాలు వాళ్లు వెతుక్కుంటున్నారు. కొంత మంది బంగారంపై దృష్టిసారించడంతో నల్లమార్కెట్‌లో బంగారం ధర అమాంతంగా 50వేలకు తులం పలుకుతోంది. ఈనెల ఎనిమిదిన ప్రధాన మంత్రి పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేయగానే అన్ని వ్యాపారుల మందగించగా ఒక్క బంగారం ధర మాత్రం నల్లమార్కెట్‌లో పెరిగిపోయింది.

11/18/2016 - 00:58

హైదరాబాద్, నవంబర్ 17: హైదరాబాద్‌లోని దుందిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో గురువారం జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు అబ్బురపరిచాయి. ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఎయిర్ క్రాఫ్ట్‌లు కళ్లు మిరుమిట్లుగొల్పాయి. ఒళ్లు గగుర్పొచే విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రపంచ ప్రముఖ ఏరోబోటిక్ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలను వేలాది విద్యార్థులు, విమానయాన శాఖ అధికారులు, కుటుంబ సభ్యులతో వీక్షించారు.

11/18/2016 - 00:55

హైదరాబాద్, నవంబర్ 17: బ్యాంకుకు వెళ్లాలంటే మధ్యాహ్న భోజనం, సాయంత్రం టిఫిన్, ఆరోగ్య సమస్యలుంటే వాటికి సంబంధించిన మాత్రలు తీసుకుని వెళ్లాల్సిందే అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న జోకులను బ్యాంకులు నిజం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరం అంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంకులు తలుపులు తీయకముందే క్యూలు సిద్ధమవుతున్నాయి.

11/18/2016 - 00:46

న్యూఢిల్లీ, నవంబర్ 17: రాబోయే మూడు దశాబ్దాల్లో నిలకడగా 9నుంచి 10 శాతం వృద్ధి రేటును సాధించడంపై దృష్టి పెడుతూ భారత దేశం వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) చట్టం చేయడం, పెద్ద నోట్ల రద్దుసహా పలు చర్యలు తీసుకుందని నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ చెప్పారు. ‘దివాలా చట్టం మొదలుకొని వస్తు సేవల పన్ను(జిఎస్‌టి), పెద్ద నోట్ల రద్దు దాకా భారత్‌లో మేము వ్యవస్థాగత సంస్కరణలను చేపడుతున్నాం’ అని ఆయన చెప్పారు.

11/18/2016 - 00:45

ముంబయి, నవంబర్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లో ముగిశాయి. పెద్దనోట్ల రద్దు కారణంగా ఆర్థికంగా ఎదురుకానున్న ప్రభావాలపై భయాలు ఇంకా తొలగిపోకపోవడంతో పాటుగా అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు సైతం మార్కెట్లు నష్టాల్లో కొనసాగడానికి కారణమైనాయి.

11/18/2016 - 00:42

ముంబయి, నవంబర్ 17: టాటా సన్స్ చైర్మన్ పదవినుంచి తొలగించిన సైరస్ మిస్ర్తి గురువారం జరిగిన ఆ గ్రూపుకే మకుటాయమానమైన టిసిఎస్ బోర్డు సమావేశానికి గైరుహాజరయ్యారు. కాగా, టిసిఎస్ బోర్డునుంచి మిస్ర్తిని తొలగించడంపై నిర్ణయం తీసుకోవడం కోసం వచ్చేనెల అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ఈ రోజు జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

11/18/2016 - 00:40

న్యూఢిల్లీ, నవంబర్ 17: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత దేశ కరెంటు ఖాతా లోటు ఈ ఆర్థిక సంవత్సరంలో10.1 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యే అవకాశముందని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల సంస్థ సిటీ గ్రూపునివేదిక అభిప్రాయ పడింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంట్ ఖాతా లోటు (సిఏడి) జిడిపిలో 1.2 శాతం లేదా 30 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని కూడా ఈ సంస్థ అంచనా వేసింది.

Pages