S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/18/2016 - 04:08

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఢిల్లీ-ఎన్‌సిఆర్, హర్యానాల్లో గురువారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైంది. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో భూకపంపం కారణంగా వరుస ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప మూలకేంద్రం హర్యానాలోని బావల్‌కు ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా గుర్తించారు. భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతుల్లో ఈ ప్రకంపనలు మొదలైనట్టుగా చెబుతున్నారు.

11/18/2016 - 04:07

చెన్నై, నవంబర్ 17: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేగంగా కోలుకుంటున్నారు. శ్వాసకోస సంబధిత వ్యాధి నుంచి జయలలిత పూర్తిగా కోలుకున్నారని, సొంతంగానే శ్వాస తీసుకోగలుగుతున్నారని అధికార అన్నాడిఎంకె వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆమెను ఏ రోజైనా అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జిచేసే అవకాశం ఉందని పార్టీ ప్రతినిధి సి పొన్నయ్యన్ తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి ఇదే ఆసుపత్రిలో జయ చికిత్సపొందుతున్నారు.

11/18/2016 - 04:01

జహీరాబాద్, నవంబర్ 17: గత పది రోజులుగా ఎటిఎంల వద్దకు ప్రజలు పరుగులు పెడుతుంటే... గురువారం ఏకంగా ఎటిఎంలే జనం మధ్యకు వచ్చాయ. ఎస్‌బిఐ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బ్రాంచి అధికారులు గురువారం మొబైల్ ఎటిఎం సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. కార్డు ద్వారా డబ్బులు తీసుకునే వెసులుబాటును కల్పించారు.

11/18/2016 - 03:53

న్యూఢిల్లీ, నవంబర్ 17: స్వచ్ఛ భారత్ అవగాహన ప్రచారంలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. తిరుపతికి ఎనిమిదో స్థానం దక్కింది. గురువారంనాడు స్వచ్ఛ భారత్ అవగాహన ప్రచారంలో ముందున్న పది పట్టణాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ విడుదల చేసింది. స్వచ్ఛ భారత్ అవగాహన ప్రచారంలో దేశ వ్యాప్తంగా 500 పట్టణాల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఆలీగఢ్ ప్రథమ స్థానంలో నిలిచింది.

11/18/2016 - 03:50

న్యూఢిల్లీ, నవంబర్ 17: నగదు మార్పిడిపై నేటి నుంచి రోజుకు రెండు వేలు మించి ఇచ్చేది లేదని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగున్నర గురువారం రెండు వేలకు కుదించింది. నగదు కొరతను దృష్టిలో పెట్టుకుని మార్పిడిపై ఇచ్చే మొత్తాన్ని తగ్గించినట్టు తెలిపింది. కాగా కొత్త రూ. 2000, రూ.

11/18/2016 - 03:39

హైదరాబాద్, నవంబర్ 17: పెద్ద నోట్లు రద్దయి పది రోజులు గడిచినా సామాన్యుల కష్టాలకు అంతూ పొంతూ లేకపోవడంతో కేంద్రం మరో వెసులుబాటు కల్పించింది. కొత్త నోట్లకు తగ్గట్టుగా ఏటిఎమ్‌లు సాంకేతికంగా సిద్ధం కాకపోవడంతో ఇక పెట్రోలు బంకుల్నే ఎటిఎమ్ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించింది. ఆ విధంగా ఎటిఎమ్‌లు, బ్యాంకులపై వత్తిడి తగ్గించే యోచన చేసింది.

11/18/2016 - 03:35

న్యూఢిల్లీ, నవంబర్ 17: పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు డిపాజిట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి నగదు ప్రవాహం వెల్లువెత్తడంతో ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ సహా పలు ప్రధాన బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో రానున్న కొద్ది రోజుల్లో ఇతర వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

11/18/2016 - 03:32

న్యూఢిల్లీ, నవంబర్ 17: దేశవ్యాప్తంగా పెద్దనోట్ల రద్దుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. రద్దు నిర్ణయాన్ని మూడు రోజుల్లో వాపస్ తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. వారిద్దరూ గురువారం రిజర్వ్ బ్యాంక్‌ను సందర్శించి కొత్త నోట్ల ప్రింటింగ్ పరిస్థితిని సమీక్షించి వచ్చారు.

11/18/2016 - 03:32

విశాఖ: విశాఖ క్రికెట్ స్టేడియంలో గురువారం మాజీ క్రికెటర్లు గవాస్కర్, రవిశాస్ర్తీ, మంజ్రేకర్, నాసిర్ హుసేన్, ఎంఎస్‌కె ప్రసాద్‌లకు మెమెంటోలను అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

11/18/2016 - 03:26

హైదరాబాద్, నవంబర్ 17: పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దోహదపడే పక్షంలో ప్రధానికి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. సంస్కరణలు కొనసాగి తీరాలని, అవి ఉన్నతస్థాయిలో పురోగమించడానికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఆలోచనాపరులు, మేధావులు కలిసి పనిచేస్తే ఏదైనా విజయవంతం అవుతుందన్నారు.

Pages