S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 21:25

గండేపల్లి, ఆగస్టు 4: గండేపల్లి మండలం పి నాయకంపల్లి గ్రామంలోని ఎస్సీ పేటలో గురువారం డయేరియా వ్యాధిన పడి 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను పెద్దాపురం, రాజమండ్రి, కాకినాడ ఆసుపత్రులకు తరలించారు.

08/05/2016 - 21:24

రాఘవరావుగారికి నిద్రపట్టడం లేదు. టైమెంతైందో తెలీటం లేదు. గదిలో వెలుగుతున్న గుడ్డి బల్బువల్ల గడియారంలో టైము తెలీటంలేదు.
‘సుజీ.. సుజీ. టైమెంతైంది.?’ నెమ్మదిగా పక్కనే పడుకున్న భార్యని తట్టి లేపుతూ అడిగారు.
‘‘అబ్బబ్బ.. యిప్పటికి యిది నాలుగోసారి అడగడం.. తెల్లవారితే నేనే లేపుతాగా.. నాకిప్పుడే నిద్ర పట్టింది.. అయినా లేచి చేసే నిర్వాకం ఏవిటంట..’ విసుక్కుంది ఆవిడ.

08/05/2016 - 21:24

రాజమహేంద్రవరం, ఆగస్టు 4: గోదావరి నది ఒడ్డు ఒక ప్రకృతి రమణీయ దృశ్యం.. ఆ దృశ్యాల మధ్య సెల్ఫీ స్నానాలతో యువత కేరింతలు కొడుతోంది. గోదావరి నది వరద జలాల ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. దీంతోపాటు భక్త జనంలో భక్త్భివం ఉరకలేస్తోంది. గోదావరి గల గలల మధ్య తీరమంతా అంత్య పుష్కర శోభాయమానంలో పుణ్య స్నానాలతో పునీతమవుతున్న భక్తజనం పుణ్య స్నానాల మధురానుభూతిని సెల్ఫీలతో బంధిస్తున్నారు.

08/05/2016 - 21:09

క. వీరైలులుఁ బౌరవులను
భారతులును గౌరవులును బాండవులు ననన్
వీరులయి పరఁగి రిది నయ పారగ
భవదీయ వంశ పరిపాటి మహిన్
వీరు బలులనీ, పౌరవులనీ, భారతులనీ, కౌరవులనీ, పాండవులనీ పిలువబడుతూ వీరులుగా ప్రసిద్ధి చెందారు. ఓ నయకోవిదుడా ఇది లోకంలో వాసికెక్కిన నీ వంశక్రమం అని జనమేజయునితో వైశంపాయనుడు చెప్పాడు.
క. నరవరుఁడగు శంతనున క
మరనదికిని నట్లు సంగమం బయ్యె మహా

08/05/2016 - 21:08

ఆ ఆత్మ భరణిని కాంటాక్ట్ చేయడానికి ఎంచుకున్న మాధ్యమాలు- ఉత్తరాలు, సెల్ ఫోన్ కాల్స్. దీన్ని బట్టి చూస్తే బ్రతికున్నపుడు తను తిరిగిన పరిసరాల పట్ల, తను ఇష్టంగా ఉపయోగించుకున్న మాధ్యమాలపట్ల చనిపోయిన సంధ్యకి మక్కువ పోలేదని, అటువంటి చోట సంధ్య ఆత్మ భరణికి కనిపిస్తోందని అర్థవౌతోంది.

08/05/2016 - 21:06

ఇంద్రుడు కూడా సకల దేవతా గణాలతో, అప్సరసలతో కృష్ణుడు ద్వారక చేరటానికి ముందే వచ్చి ద్వారకానగరాన్ని సకల సౌందర్య విరాజితంగా అమరావతికన్నా వైభవోపేతంగా అలంకరింపజేశాడు. భవుడూ, భవానీ, స్కందుడు కూడా ద్వారకా నగరం ఉపవనాలలో ఒకదానిలో విడిది చేశారు. సప్తర్షులు, సకల మునులు, దేవతలు, వసురుద్రాదిత్యులు అందరూ ద్వారకా నగరానికి శ్రీకృష్ణుడి ఆగమన శోభన వైభవాన్ని దర్శించి ఆనందించటానికి కుతూహలులై వచ్చారు.

08/05/2016 - 21:04

ధర్మో రక్షతిః రక్ష అనేది మన వేద వాక్కు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అనే భావం. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అనేది మతానికి, ఓ వర్గానికి సంబంధించి కాదు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని, మానవతా విలువలు మార్గదర్శనం చేసేది ధర్మం. ధర్మం అంటే ధారణ, ఆచరించి మన జీవితంలో విలువల ద్వారా వ్యక్తియొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది.

08/05/2016 - 20:57

మహేష్‌బాబు హీరోగా, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంచలనాత్మక చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే భారీ అంచనాలని పెంచుకున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లోనే షూటింగ్ జరుపుతున్నారు. అనల్ అరసు ఫైట్ మాస్టర్ నేతృత్వంలో సాగే ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని తెలిసింది.

08/05/2016 - 20:55

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వరుస సినిమాల విజయంతో దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూన్న దేవి మరోవైపు, తమిళంలో కూడా తన సత్తా చాటుకున్నాడు. డిఎస్‌పిగా పాపలరైన దేవిశ్రీ, మొట్టమొదటసారి టెలివిజన్ తెరపై షో ఇవ్వడం విశేషం. డిఎస్‌పి యుఎస్‌ఎ వరల్డ్ ప్రిమియర్ ఈవెంట్ పేరుతో అమెరికాలో సందడి చేసిన ఈ షోను త్వరలోనే జీ టీవీలో ప్రసారం చేయనున్నారు.

08/05/2016 - 20:54

తెలుగు తెరపై దర్శకుడిగా తనదైన గుర్తింపు దక్కించుకున్న శేఖర్ కమ్ముల తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘్ఫదా’. ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్న యువ హీరో వరుణ్ తేజ్ హీరోగా మలయాళ ‘ప్రేమమ్’ ఫేం సాయి పల్లవి హీరోయిన్‌గా రూపొందే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. శుక్రవారం నిజామాబాద్‌లోని బాన్సువాడలో చిత్రం ప్రారంభమైంది.

Pages