S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 18:07

దిల్లీ: దిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటనపై బీబీసీ ఫిల్మ్‌మేకర్‌ లెస్లీ ఉడ్విన్‌ రూపొందించిన ‘ఇండియాస్‌ డాటర్‌’ అనే డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎత్తివేయలేమని దిల్లీ హైకోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. నిర్భయ సులో శిక్ష పడిన దోషుల్లో ఒకరి వాంగ్మూలాన్ని లెస్లీ ఉడ్విన్‌ చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీని భారత్‌లో ప్రసారం కాకుండా ట్రయల్‌ కోర్టు నిషేధించింది.

08/05/2016 - 17:59

శ్రీశైలం: భారీగా వరదనీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 835 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 2,61,212 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 16,732 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు 16,732 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

08/05/2016 - 17:36

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు పంపుతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ శుక్రవారం ప్రకటించారు. ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌కు సిద్ధంగా ఉందని, ఇప్పుడు మళ్లీ చర్చించలేమని చెప్పారు. మనీ బిల్లు అవునా? కాదా? నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు లేదన్నారు. ప్రైవేటు బిల్లు మనీ బిల్లు అవునా? కాదా?

08/05/2016 - 17:32

ఢిల్లీ: ప్రత్యేకహోదాకు వచ్చే వారం పరిష్కారం రావచ్చనికేంద్ర మంత్రి సుజనాచౌదరి తెలిపారు . ఆర్థికమంత్రితో చంద్రబాబు చర్చించారని, ప్రధాని మోదీ అన్ని శాఖల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారని వెల్లడించారు. రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లును ద్రవ్య బిల్లుగా చెప్పడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్, వైసీపీకి చిత్తశుద్ధి లేకనే ఏపీకి ఇన్ని కష్టాలు వచ్చాయని విమర్శించారు.

08/05/2016 - 17:19

పారిస్‌ : డీహెచ్‌ఎల్‌ సంస్థకు చెందిన కార్గో విమానం శుక్రవారం ఉదయం పారిస్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరి బెర్గామో విమానాశ్రయంలో ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా రన్‌వేకి సమీపంలో ఉన్న రహదారిపై కూలిపోయింది. పైలట్‌, కో-పైలట్‌లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పారిస్‌లోని మిలాన్‌ ప్రాంతంలో రోడ్డుపై విమానం కూలిపోవడంతో రెండున్నర గంటల పాటు ఆ ప్రాంతాన్ని మూసివేశారు

08/05/2016 - 17:16

చెన్నై: నటుడు కమల్‌హాసన్‌ శుక్రవారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్నారు. జులై 14న కాలి ఎముక విరగగా ఆయన ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆళ్వార్‌పేట్‌లోని ఆయన ఇంటి ముందు అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పూర్తిగా కోలుకున్న వెంటనే ‘శభాష్‌ నాయుడు’ సినిమా షూటింగ్‌ కొనసాగిస్తారు.

08/05/2016 - 17:13

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి మంచి జోరు మీదున్న మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 66.78 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 369 పాయింట్లు లాభపడి 28078 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 132 పాయింట్లు లాభపడి 8683 పాయింట్లకు చేరుకుంది.

08/05/2016 - 16:40

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆర్థిక బిల్లు అని లోక్‌సభ కార్యదర్శి స్పష్టం చేశారని, ద్రవ్యబిల్లుపై ఓటింగ్ జరిపే సంప్రదాయం రాజ్యసభలో లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం స్పష్టం చేశారు. కొన్ని అంశాలపై రాజ్యసభలో నేరుగా చట్టం చేసే అవకాశం లేదన్నారు.

08/05/2016 - 16:40

ఇంఫాల్: పదహారేళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షను విరమించుకోవద్దని, బయటి వ్యక్తిని వివాహం చేసుకోవద్దని ‘మణిపూర్ ఉక్కుమహిళ’ షర్మిలకు కొన్ని సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సైనికులకు ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్లుగా ఆమె దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

08/05/2016 - 16:39

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. చెవిలో పూలు పెట్టుకుని కార్లు, బైక్‌లను వారు శుభ్రం చేశారు. హోదా విషయంలో బిజెపి తీరు సరిగా లేదని వారు విమర్శించారు.

Pages