S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 04:29

శ్రీకాకుళం(రూరల్), జూలై 22: విద్యార్థులు లక్ష్య సాధనకోసం సానుకూల ధృక్పథం అలవర్చుకోవాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి.తులసీరావు అన్నారు. గాయిత్రీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ కళాశాల రసాయనిక విభాగం శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు.

07/23/2016 - 04:27

పర్చూరు, జూలై 22: వచ్చే నెలలో జరిగే కృష్ణా పుష్కరాలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ త్రివిక్రమ వర్మ తెలిపారు. పుష్కరాలకు సంబంధించి ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను శుక్రవారం ఎస్పీ పరిశీలించారు. పర్చూరు నుంచి గుంటూరు రూట్‌లోని అడుసుమల్లి వరకు రోడ్డును పరిశీలించారు.

07/23/2016 - 04:26

ఒంగోలు,జూలై 22: జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన మంచినీటి ఎద్దడిని నివారించేందుకు తక్షణమే నాలుగుటిఎంసిల నీటిని ప్రభుత్వం విడుదల చేయాలని వైకాపా రాష్ట్ర నాయకుడు, ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ఒకప్రకటనలో డిమాండ్ చేశారు.జిల్లాలోని ప్రజలు మంచినీటికోసం తీవ్ర అవస్ధలు పడుతున్నారని అందువలన నాలుగుటిఎసిల నీటితో 291నోటిఫైడ్, నాన్‌నోటిఫైడ్ చెరువులను నింపాలన్నారు.

07/23/2016 - 04:25

ఒంగోలు, జూలై 22 : జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు అభివృద్ధి సాధించే విధంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపివో సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యవసాయ విస్తరణలో మాస్ మీడియా పాత్రపై , ఆహార భద్రత మిషన్, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పధకాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు.

07/23/2016 - 04:24

పెద్దదోర్నాల, జూలై 22: రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎన్‌జిఓ సంఘం రాజీలేని పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి అశోక్‌బాబు అన్నారు.

07/23/2016 - 04:23

ఒంగోలు,జూలై 22: ఒంగోలు నగరం 17వ డివిజన్‌లోని ప్రగతీకాలనీ, అంబేద్కర్‌కాలనీల్లో శుక్రవారం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గడపగడపకు వైఎస్‌ఆర్ పార్టీ కార్యక్రమం ఉత్సాహం సాగింది. బాలినేనికి ఆయాకాలనీల ప్రజలు ముందుగా ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా బాలినేని ఆయాకాలనీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

07/23/2016 - 04:23

మార్కాపురం టౌన్, జూలై 22: రైతన్నపై ప్రకృతి మరోసారి కనె్నర్ర చేసింది. ఖరీఫ్ పంటల సాగుకు దోహదపడే నైరుతి రుతుపవనాలు ఊరిస్తూ నిరాశను మిగులుస్తున్నాయి. మబ్బులు కమ్ముకుంటూ అంతలోనే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రైతులను ఇక్కట్ల పద్మవ్యూహంలో నెడుతున్నాయి. దుక్కులు దున్ని ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకొని ఉన్న భూముల్లో పదును లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

07/23/2016 - 04:21

నెల్లూరు, జూలై 22: జిల్లాకు కొత్త కలెక్టర్‌గా ముత్యాలరాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎం.జానకి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పిఎస్‌కు బదిలీ అయ్యారు. అయితే జిల్లాలో పనిచేసేందుకు వచ్చే కొత్త కలెక్టర్ విషయంలో రాష్ట్ర మంత్రి నారాయణ, ఇతర జిల్లా నేతలు తీవ్రస్థాయిలో చర్చలు జరిపారు. ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన అధికారులు అందరూ తమకు అనుకూలంగానే పనిచేసినవారు ఉన్నారు.

07/23/2016 - 04:19

గూడూరు, జూలై 22: గూడూరు సబ్ కలెక్టర్‌గా గత ఏడాది జూలై 28న బాధ్యతలు స్వీకరించిన కర్నాటక రాష్ట్రానికి చెందిన గిరీషా పిఎస్‌ను పదోన్నతిపై చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గూడూరు సబ్ డివిజన్ తొలి నుంచి ఐఎఎస్‌లను నియమిస్తుండగా, గత కొంతకాలం ఆర్‌డిఓను కూడా నియమించింది.

07/23/2016 - 04:19

ఆత్మకూరు, జూలై 22 : ఆ యువకుడు అందరికీ తెలిసేలా ఓ పాటకచేరి బృందాన్ని నిర్వహిస్తూ వివిధ వేడుకల్లో సంగీత విభావరి కార్యక్రమాలను చేపడుతుంటాడు...అంతర్లీనంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన కేటుగాడుగా అక్రమార్జన గడిస్తున్నాడు.

Pages