S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 04:12

నెల్లూరు లీగల్, జూలై 22: నూతనంగా నెల్లూరు జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన వౌలానా జునైద్ అహ్మద్ శుక్రవారం నెల్లూరు బార్ అసోసియేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పర సహకారంతో కేసులు పరిష్కరించాలని అప్పుడే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు. బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులకు సంబంధించిన కూలర్‌ను ఆయన ప్రారంభించారు.

07/23/2016 - 04:12

నెల్లూరు, జూలై 22: రాష్ట్రంలో వ్యవసాయరంగ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం నియమించిన వ్యవసాయ కమిషన్ సమగ్ర అధ్యయనం చేస్తుందని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ వ్యవసాయ కమిషన్ టాస్క్ఫోర్స్ డైరెక్టర్ ఎస్ గాలబ్ తెలిపారు.

07/23/2016 - 04:10

చిప్పగిరి, జూలై, 22: చిప్పగిరిలో వెలసిన శ్రీ భంభం స్వాముల 107 ఉరుసు ఈనెల 23 నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కార్య నిర్వాహకులు సయ్యద్ అరీపుద్దీన్ ఖాద్రి గురువారం తెలిపారు. 23న సందల్ మాలి, 24న ఉరుసు, 25న జియారత్ నిర్వహిస్తామన్నారు. ఉరుసుకు గుంతకల్లు నుంచి అదనపు బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరినట్లు చెప్పారు.

07/23/2016 - 04:10

నంద్యాల, జూలై 22: నంద్యాల జిల్లా అవుతుందన్న ఈ ప్రాంత ప్రజల కలలు త్వరలో సాకారం కానున్నాయన్న వార్తలు వస్తుండడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

07/23/2016 - 04:09

కర్నూలు, జూలై 22:కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆధ్యాత్మిక భావనతో సంతృప్తి చెందిన మనసుతో తిరిగి వెళ్లాలని, ఆ దిశగా వసతులు, భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పుష్కరాల ప్రత్యేకాధికారి జి.అనంతరాము అధికారులను ఆదేశించారు. కృష్ణా పుష్కరాలపై శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

07/23/2016 - 04:08

కర్నూలు సిటీ, జూలై 22 : రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి 10శాతం కేటాయించాలని అఖిల భారత కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఏపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్ అధ్యక్షతన శుక్రవారం నగరంలోని కెకె భవన్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు కలిపి మొత్తం రూ. 1.35 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందన్నారు.

07/23/2016 - 04:07

నంద్యాల రూరల్, జూలై 22: నంద్యాల తహశీల్దార్ కార్యాలయంలోని సివిల్ సప్లై కార్యాలయ విభాగాన్ని శుక్రవారం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం రామకృష్ణరావు, శ్రీనివాసరెడ్డిలు తనిఖీ చేశారు.

07/23/2016 - 04:07

ఆదోని, జూలై 22: తుంగభద్ర డ్యాం నుంచి గురువారం నీటిని తుంగభద్ర దిగువ కాలువకు వదలడం జరిగింది. మరో నాలుగైదు రోజుల్లో ఆదోని డివిజన్‌లో ఉన్న ప్రాంతంలోని కాలువలకు నీరు చేరుతుంది. దీంతో ఆయకట్టు రైతులు భూముల్లో పంటలు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా ఆయకట్టు భూముల్లో వరి పంట అధికంగా వేస్తారు. అందువల్ల ఇప్పటికే రైతులు వరి నారుమళ్ళును వేసుకున్నారు.

07/23/2016 - 04:06

పాములపాడు, జూలై 22:కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరు గైన సౌకర్యాలు కల్పించాలని కృష్ణా పుష్కరాల ప్రత్యేకాధికారి జి.అనంతరాము ఆదేశించారు. ఆయన శుక్రవా రం సాయంత్రం కలెక్టర్ విజయమోహన్‌తో కలిసి సంగమేశ్వరం క్షేత్రంలో జరుగుతున్న పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు.

07/23/2016 - 04:06

కర్నూలు సిటీ, జూలై 22:బహిరంగ మల విసర్జనతో అనేక సమస్యలు తలెత్తుతాయని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కళ్యాణ చక్రవర్తి పేర్కొన్నారు. ట్రిగ్గరింగ్ డే సందర్భంగా శుక్రవారం నగరంలోని మమతానగర్, బంగారుపేట కాలనీల్లో ప్రజలకు మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్డి మనల్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుందన్నారు.

Pages