S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లా కలెక్టర్ జానకి బదిలీ

నెల్లూరు, జూలై 22: జిల్లాకు కొత్త కలెక్టర్‌గా ముత్యాలరాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎం.జానకి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పిఎస్‌కు బదిలీ అయ్యారు. అయితే జిల్లాలో పనిచేసేందుకు వచ్చే కొత్త కలెక్టర్ విషయంలో రాష్ట్ర మంత్రి నారాయణ, ఇతర జిల్లా నేతలు తీవ్రస్థాయిలో చర్చలు జరిపారు. ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన అధికారులు అందరూ తమకు అనుకూలంగానే పనిచేసినవారు ఉన్నారు. అయితే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి పలువురు కలెక్టర్ల పేర్లను సూచించినట్లు సమాచారం. వారిలో తొలుత నెల్లూరు జిల్లాలో సబ్ కలెక్టర్‌గా పనిచేసిన వీరపాండ్యన్ పేరును కొందరు సూచించగా ఎక్కువ మంది ఆయనను వ్యతిరేకించినట్లు సమాచారం. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ (ఇపిడిసి) చైర్మన్‌గా పనిచేస్తున్న రేవు ముత్యాలరాజు వైపు ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు సమాచారం. దీంతో కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రి చర్చించి చివరకు ముత్యాలరాజును ఖరారు చేశారు. ఈ మేరకు శుక్రవారం బదిలీల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎం.జానకిని కేంద్ర జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో రిపోర్టు చేయవలసిందిగా ఉత్తర్వులో పేర్కొన్నారు.
వ్యవసాయ కుటుంబం నుంచి..
కృష్ణా జిల్లాలోని మారుమూల లంక గ్రామమైన చిన్నగొల్లపాళెంకు చెందిన ముత్యాలరాజు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. మొదటి నుంచి కష్టపడి చదివే మనస్తత్వం ఆయనది. వారు ఉంటున్న గ్రామంలో పాఠశాలలు లేకపోవడంతో 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండుగొలుసు ఉన్నత పాఠశాలకు ప్రతిరోజూ సైకిల్‌పై వెళ్లి చదువుకునేవారు. మొదట ఐపిఎస్‌కు ఎంపికైనప్పటికీ ఐఎఎస్ కావాలన్న సంకల్పంతో 2007లో పోటీపడి ఐఎఎస్ ఎపి క్యాడర్‌కు ఎంపికయ్యారు. ఈయన ప్రాథమిక విద్యంతా చిన్నగొల్లపాళెంలోనే సాగింది. గుండుగొలుసు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్య, పశ్చిమగోదావరి జిల్లా తణుకు పాలిటెక్నిక్ పాఠశాలలో డిప్లమా చేశారు. 1998లో ఈసెట్‌లో రాష్టస్థ్రాయి మొదటి ర్యాంకు సాధించి వరంగల్ ఎన్‌ఐటిలో బిటెక్ పూర్తి చేశారు. 2002లో గేట్‌లో మూడవ ర్యాంకు సాధించి బెంగుళూరులో ఎంటెక్ చదివారు. 2004లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో ప్రథమ ర్యాంకు సాధించి రైల్వేలో ఉద్యోగంలో చేరారు. 2006లో సివిల్స్ ర్యాంకు సాధించి ఐపిఎస్ రాజస్థాన్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. తిరిగి 2007లో ఏపి క్యాడర్‌లో ఐఎఎస్‌కు ఎంపికయ్యారు. 2008లో కరీంనగర్ అసిస్టెంట్ కలెక్టర్‌గా, వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా, ఆదిలాబాద్ జిల్లా ముట్నూరు ఐటిడిఎ పిఓగా, రంగారెడ్డి, తూర్పుగోదావరి జెసిగా పనిచేసి ప్రస్తుతం ఈపిడిసి చైర్మన్‌గా పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీపై ముత్యాలరాజు రానున్నారు.