S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 04:55

తాళ్లపూడి, జూలై 22: తాళ్లపూడి పంచాయతీ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు ఛేపట్టేవారికి లే అవుట్ల అనుమతి భయం వెంటాడుతోంది. అన్ని పత్రాలు ఉన్నా అధికారులు ఏదో ఒక వంకతో నిర్మాణ పనులు నిలుపుదల చేస్తారోననే భయాన్ని ఎదుర్కొంటున్నారు. లే అవుట్ అనుమతి లేని స్థలంగా తాము గుర్తించామని, వెంటనే నిర్మాణాలు ఆపమని కొంతమందికి పంచాయతీ ఇటీవల నోటీసులు జారీచేసింది.

07/23/2016 - 04:54

జంగారెడ్డిగూడెం, జూలై 22: ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు నిరంతర సమగ్ర మూల్యాంకనం(సిసిఇ) అమలుకు కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూధనరావు పిలుపునిచ్చారు. స్థానిక విద్యావికాస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిరంతర సమగ్ర మూల్యాంకనంపై జరిగిన డివిజన్ స్థాయి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

07/23/2016 - 04:54

భీమవరం, జూలై 22: విదేశాల్లో విదేశీ విద్యను అభ్యశించాలనుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. జిఆర్‌ఇ, టోఫెల్ పరీక్షా కేంద్రాన్ని భీమవరంనకు చెందిన వత్సవాయి కృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాల (ఎస్‌వికెఆర్)కు విదేశీ విశ్వవిద్యాలయాల సమితి అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఇప్పటి వరకు విశాఖపట్నంలో మాత్రమే ఉండే ఈ పరీక్షా కేంద్రం ఇప్పుడు ఎస్‌వికెఆర్‌లో ఏర్పాటుచేశారు.

07/23/2016 - 04:53

ఏలూరు, జూలై 22 : ప్రజా సంక్షేమం అభివృద్ధి అంశాలపై శాసనసభలో లేవనెత్తిన పలు అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంపై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించడం జరుగుతుందని రాష్ట్ర శాసనసభ హామీల అమలు కమిటీ ఛైర్మన్ పెందుర్తి వెంకటేష్ చెప్పారు.

07/23/2016 - 04:52

భీమవరం, జూలై 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి సంయుక్తంగా రాష్ట్రంలో ప్రైవేటు రంగ సలహా సంఘాన్ని ఏర్పాటుచేసింది. విద్యాభివృద్ది కోసం ఏర్పాటుచేసిన ఈ సంఘం సభ్యునిగా విష్ణు ఎడ్యుకేషనల్ సోసైటీ చైర్మన్ కలిదిండి వెంకట విష్ణురాజును ప్రభుత్వం నియమించింది.

07/23/2016 - 04:52

ద్వారకాతిరుమల, జూలై 22: ద్వారకాతిరుమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిధులు గోల్‌మాల్ అయ్యాయి. సుమారు రూ.5లక్షలు పైబడిన నిధులను కొందరు సిబ్బంది స్వాహాచేసి సంవత్సరాలు కావస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. సొమ్ములు స్వాహాచేసిన ఆ ఉద్యోగులు బదిలీలపై జిల్లాలు దాటి వెళ్లిపోతుంటే అవకతవకలు ఉన్న ఆ రికార్డులను ప్రస్తుత ఉద్యోగులు కప్పిపుచ్చలేక నానా తంటాలు పడుతున్నారు.

07/23/2016 - 04:50

కంచికచర్ల, జూలై 22: రాతి క్వారీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని పరిటాల గ్రామ పంచాయతీ శివారు దొనబండ క్వారీలో శుక్రవారం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. క్వారీ కొండపై నుండి రాయి ప్రమాదవశాత్తు కింద పడటంతో ఒరిస్సాకు చెందిన కార్మికుడు రూబెన్ బాబు (25) అక్కడికక్కడే మృతి చెందగా నిఖిలేష్ నిహార్ (26) , ఉప్పతోళ్ల శివకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు.

07/23/2016 - 04:49

మచిలీపట్నం, జూలై 22: మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (మడ) అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. ‘మడ’ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారీ చేసేందుకు గాను శుక్రవారం చైనాకు చెందిన జిఐఐసి బృందం బందరులో పర్యటించింది.

07/23/2016 - 04:48

అవనిగడ్డ, జూలై 22: స్థానిక ప్రధాన రహదారిలో శుక్రవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో టివిఎస్ మోపెడ్‌పై వెళుతున్న దంపతులను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనటంతో భర్త మృతి చెందాడు. స్థానిక మండలిపురం నుండి హోటల్ వ్యాపారి బండే నాంచారయ్య(70), ఈశ్వరమ్మ దంపతులు విద్యుత్ రెవెన్యూ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న హోటల్‌కు బయలుదేరారు.

07/23/2016 - 04:47

మచిలీపట్నం (కల్చరల్), జూలై 22: బందరు నియోజకవర్గంలో రెండు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక జార్జికారోనేషన్ హైస్కూల్‌లో శుక్రవారం వసుధ ఫౌండేషన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు.

Pages