S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 04:47

అవనిగడ్డ, జూలై 22: కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత విద్యా సంస్థలు, విద్యార్థులపై ఉందని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం సాయంత్రం నియోజకవర్గంలోని విద్యా సంస్థల యాజమాన్యాలు, మండల విద్యా శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా సాగర సంగమంలో పది వేల మంది విద్యార్థులతో కోలాట ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు.

07/23/2016 - 04:46

మచిలీపట్నం, జూలై 22: డెల్టా భూములను పునీతం చేస్తున్న గోదావరి జలాలకు గ్రామ గ్రామాన హారతులిచ్చి స్వాగతం పలకాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు రైతాంగానికి పిలుపునిచ్చారు.

07/23/2016 - 04:45

విజయవాడ (క్రైం), జూలై 22: కొద్దిరోజుల్లో సమీపిస్తున్న కృష్ణా పుష్కరాలకు పోలీసుశాఖ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందని రాష్ట్ర డిజిపి జెవి రాముడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించడంలో పోలీసుశాఖ కృషి విశేషమన్నారు. సాంకేతిక పరిఙ్ఞనాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తూ విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

07/23/2016 - 04:45

విజయవాడ, జూలై 22: నగరంలో నిర్మాణంలోని పుష్కర ఘాట్స్ తుది దశ పనులను నాణ్యతా ప్రమాణాలతో పాటు సుందరంగా ఉండేవిధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ కాంట్రాక్టర్లకు సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్, పద్మావతి, కృష్ణవేణి, దుర్గాఘాట్లతో పాటు కమాండ్ కంట్రోల్ రూం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు.

07/23/2016 - 04:44

విజయవాడ, జూలై 22: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ట్రాక్ మార్చింది. హైటెక్ కాలంలో పాత పద్ధతులకు స్వస్తి పలుకుతోంది. జనంలో నిలబడాలంటే హైటెక్ మంత్రాన్ని జపించక తప్పదన్న భావనతో ఆర్టీసీ యాజమాన్యం ఇప్పుడు దూసుకుపోతోంది. అందుకు అధునాతన పద్ధతులే మేలని వాటిని అనుసరిస్తుంది. ఆధునిక బస్సులను ప్రవేశపెడుతూ ఆర్టీసీ కొత్తగా ప్రయాణిస్తోంది.

07/23/2016 - 04:42

ఇంద్రకీలాద్రి, జూలై 22: కృష్ణా పుష్కరాల మహోత్సవాలు, దుర్గగుడి అభివృద్ధి పనులు, అర్జున వీధి 100 అడుగుల విస్తరణ పేర్లతో మల్లిఖార్జున పేటలో చేపట్టిన అభివృద్ధి పనులు మరింతగా వేగం పుంజుకున్నాయి.

07/23/2016 - 04:42

విజయవాడ, జూలై 22: రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు ప్రైవేట్ బిల్లును రాజ్యసభలో వాయిదా పడటంలో బిజెపి రాజకీయ కుట్ర ఉందని ఏపిసిసి ఉపాధ్యక్షులు దేవినేని నెహ్రూ అన్నారు. ప్రైవేట్ బిల్లు వాయిదా పడిన నేపథ్యంలో ఆంధ్రరత్నభవన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి ఏలూరు రోడ్డుపై దిష్టిబొమ్మను దహనం చేశారు.

07/23/2016 - 04:41

పాతబస్తీ, జూలై 22: సితార సెంటర్‌లో గొల్లపూడి బైపాస్ రోడ్డు మార్గంలోని డివైడరు రూపురేఖలు మారుతున్నాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర రోడ్డులో డివైడరులో మట్టిపోసి మొక్కలు నాటుతున్నారు. శుక్రవారం ఉదయం లారీ నిండా మొక్కలు తెచ్చి డివైడర్ల మధ్యలో నాటారు. అంతకు ముందు కొంతమేర క్రోటన్ మొక్కలను నాటారు. మిగతా చోట పూలమొక్కలు ఏర్పాటు చేస్తున్నారు. కూలీలు మొక్కలు నాటి వాటికి ఎరువు కూడా వేశారు.

07/23/2016 - 04:40

కంచికచర్ల, జూలై 22: రాతి క్వారీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని పరిటాల గ్రామ పంచాయతీ శివారు దొనబండ క్వారీలో శుక్రవారం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. క్వారీ కొండపై నుండి రాయి ప్రమాదవశాత్తు కింద పడటంతో ఒరిస్సాకు చెందిన కార్మికుడు రూబెన్ బాబు (25) అక్కడికక్కడే మృతి చెందగా నిఖిలేష్ నిహార్ (26) , ఉప్పతోళ్ల శివకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు.

07/23/2016 - 04:39

పాతబస్తీ, జూలై 22: శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 30 డివిజన్‌లో మాజీ శాసనసభ్యులు, బిజెపి నాయకులు వెలంపల్లి శ్రీనివాసరావు, 30వ డివిజన్ అధ్యక్షులు ఆవ్వారు బుల్లబ్బాయి, స్థానిక బిజెపి నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన స్థానికులు డివిజన్‌లోని పలు సమస్యలను విన్నవించుకున్నారు.

Pages