S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 03:51

చిలకలూరిపేట, జూలై 22: పట్టణాన్ని, గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం స్థానికంగా పలు సిసి రోడ్లకు శంకుస్థాపనలు చేశారు.

07/23/2016 - 03:50

వినుకొండ, జూలై 22: దళితులపై దాడులకు నిరసనగా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం శివయ్య స్థూపం సెంటరులో మతోన్మాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పోరాట సమితి నాయకులు పూదాల శ్రీను మాట్లాడుతూ గుజరాత్‌లో దళిత యువకులపై దాడి, మాయావతిని బిజెపి నేత అవమానించటాన్ని నిరసించారు.

07/23/2016 - 03:50

అమరావతి, జూలై 22: కృష్ణా పుష్కరాల సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేయాల్సిన బందోబస్తుపై డిఎస్‌పిల బృందం విస్తృతంగా పర్యటించింది. ఈ బృందం ధ్యానబుద్ధ ఘాట్, అమరేశ్వర ఘాట్‌తో పాటు ఆలయంలో ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు గురించి ఆలయ అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డితో చర్చించారు. అలాగే మెయిన్‌బజారులో, పుష్కరనగర్‌ల వద్ద బందోబస్తు గురించి కూడా సమగ్రంగా పరిశీలించారు.

07/23/2016 - 03:49

అచ్చంపేట, జూలై 22: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తెలుగుదేశం పార్టీ నేతలు బెదిరించి బలవంతంగా తమ పార్టీలోకి లాక్కుంటున్నారని పెదకూరపాడు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు అన్నారు. గడప గడపకు వైసిపిలో భాగంగా ఆయన చల్లగరిగ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అచ్చంపేటలో విలేఖర్లతో మాట్లాడారు.

07/23/2016 - 03:49

అమరావతి, జూలై 22: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో ఆగస్టు 12 నుండి 23వ తేదీ వరకు జరిగే కృష్ణా పు ష్కరాల కోసం వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించి పలువురు కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులను అప్పగించింది. జూన్ మా సంలో ప్రారంభమైన పుష్కరఘాట్ నిర్మాణ పనులు నే టికీ కొనసాగుతూనే ఉన్నాయి.

07/23/2016 - 03:47

పి.గన్నవరం, జూలై 22: ‘మీకు పులస చేప కావాలా... మార్కెట్‌కు వచ్చి వేచివుండాల్సిన పనిలేదు... సెల్ ఫోన్‌కు రింగ్ చేసి, పులస చేప సైజు, ధర తెలుసుకుని వెంటనే రిజర్వు చేసేసుకోవచ్చు’2.. పి.గన్నవరం మార్కెట్‌లో ప్రస్తుతం పులసలు ఇలా మొబైల్ ద్వారా కూడా అమ్మకాలు సాగిస్తున్నారు. పులస చేపకున్న డిమాండ్ అందరికీ తెలిసిందే. సాధారణ చేపల మాదిరిగా ఎప్పుడుబడితే అప్పుడు లభించవు.

07/23/2016 - 03:46

రాజమహేంద్రవరం, జూలై 22: గోదావరి నదిలో డ్రెడ్జింగ్ పనులకు అతీ గతీ లేకుండా పోయింది. టెండర్లు పూర్తయ్యి ఏజెన్సీకి పనులు అప్పగించినప్పటికీ ఇంకా డ్రెడ్జింగ్ పనులు ఆరంభం కాలేదు. డ్రెడ్జింగ్ కార్యకలాపాలు ఇసుక సిండికేట్ ఉచ్చులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరదలకు నదిలో ఇసుక దిబ్బలు మరింతగా పెరిగిపోయాయి. దీంతో నదీ గమన దిశలు మారిపోయే పరిస్థితి దాపురించింది.

07/23/2016 - 03:46

కాట్రేనికోన, జూలై 22: ఓ భూ వివాదానికి సంబంధించి హైకోర్టు ఆదేశాలతో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), సిఐ కెటిటివి రమణారావు, కాట్రేనికోన ఎస్సై జానీ బాషాలపై శుక్రవారం (క్రైం నెం.89/2016 కింద) కాట్రేనికోన పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఒక భూమి అమ్మకం వ్యవహారంలో రామాంజనేయరాజుపై పోలీసు కేసులు నమోదు చేశారు.

07/23/2016 - 03:45

విజయవాడ, జూలై 22: కాపులను బిసిల్లో చేర్చవద్దంటూ స్థానిక మంజునాథ్ కమిషన్ ఎదుట పలు బిసి సంఘాలు శుక్రవారం ఆందోళన జరిపాయి. అమలాపురం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బిసి సంఘాలు శుక్రవారం విజయవాడ చేరుకున్నాయి. స్థానిక బెంజ్ సర్కిల్ దగ్గరున్న మంజునాథన్ కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశాయి. ఒక దశలో కార్యాలయంలోకి దూసుకువెళ్లడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు.

07/23/2016 - 03:45

కాకినాడ, జూలై 22: జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా సాధికార సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సర్పవరంలో సర్వేను పరిశీలించారు. కొన్ని సందర్భాలలో సర్వర్ డౌన్‌లోడ్ కావడంతో డేటా నమోదు కావడం లేదని సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. రూరల్ తహసీల్దారు జె సింహాద్రి సర్వే వివరాలను కలెక్టర్‌కు తెలియజేశారు.

Pages