S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 03:44

రంపచోడవరం, జూలై 22: మండలంలోని చుప్పరిపాలెం గ్రామంలో పిడుగుపాటుకు ఒక మహిళ మృతి చెందగా మరో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. రంపచోడవరం ప్రభుత్వాసుపత్రి వైద్యుడు శివరామకృష్ణ, బాధితుల బంధువులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. శుక్రవారం చుప్పరిపాలెం గ్రామంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దుంప తోటలో గొప్పు పనులు చేయడానికి వెళ్లిన మహిళలు వర్షానికి పొలం సమీపంలోని చెట్టు కిందకు చేరారు.

07/23/2016 - 03:44

సామర్లకోట, జూలై 22: అందరి భాగస్వామ్యంతో బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ కోరారు.

07/23/2016 - 03:43

కాకినాడ రూరల్, జూలై 22: రాజకీయ పార్టీలకు రాష్ట్రంలో స్థలాలు కేటాయించడం కోసం చంద్రబాబు సర్కార్ చిత్రమైన జీవోను తెచ్చిందని విమర్శించారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు కాకినాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ జీవో మాటున టిడిపి తమ పార్టీకి పెద్ద ఎత్తున భూములు కేటాయింపు చేసుకునే కార్యక్రమం చేపట్టిందని ఆరోపించారు.

07/23/2016 - 03:42

రాజమహేంద్రవరం, జూలై 22: తన హయాంలో నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో రూ. 135.07కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మేయర్ పంతం రజనీశేషసాయి వెల్లడించారు. అభివృద్ధిలో ఎక్కడా వివక్షతకు తావులేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. శుక్రవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ పాలకవర్గ హయాంలో రాజమహేంద్రవరం అభివృద్ధిపథంలో పయనిస్తోందని, పారదర్శకంగా పాలన సాగుతోందన్నారు.

07/23/2016 - 03:41

శంఖవరం, జూలై 22: గంజాయిని కారులో తరలిస్తుండగా అన్నవరం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విశాఖ జిల్లా మాడుగుల నుండి 75 కేజీల గంజాయిని కారులో తరలిస్తుండగా అన్నవరం పిఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. కారుతోపాటు ఎం శ్రీను, సూర్యనారాయణ, వెంకట్రావు అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

07/23/2016 - 03:41

కాట్రేనికోన, జూలై 22: కుండలేశ్వరం గౌతమీ గోదావరిలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గుర్తుతెలియని ఇద్దరు మహిళలు తల్లీ, కూతుళ్లుగా భావిస్తున్నారు. ఇద్దరు బుధవారం రాత్రి నుండి వీరి మృతదేహాలు గోదావరి నీటిలో తేలియాడుతుండటంతో స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేసినట్టు చెబుతుండగా పోలీసులు మాత్రం తమకు ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.

07/23/2016 - 03:40

రాజమహేంద్రవరం, జూలై 22: వైఎస్సార్‌సిపి నుంచి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన పరివారం శుక్రవారం అట్టహాసంగా విజయవాడకు తరలివెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆదిరెడ్డి, ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉదయం ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీగా విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఇందుకోసం పలువార్డుల నుంచి బస్సులు, కార్లలో జన సమీకరణ చేశారు.

07/23/2016 - 03:39

గొల్లప్రోలు, జూలై 22: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చేపట్టనున్న బైసాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లిస్తామని అదనపు జాయింట్ కలెక్టర్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించిన భూమి రికార్డులు, పాస్‌బుక్‌లను ఆయన పరిశీలించారు.

07/23/2016 - 03:39

గోకవరం, జూలై 22: పిహెచ్‌సిలపై అజమాయిషీ చేసే సిహెచ్‌ఎన్‌సిలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో 9 పిహెచ్‌సిలపై అజమాయిషీ చేసే గోకవరం సిహెచ్‌ఎన్‌సి మూతపడింది. ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలోని పిహెచ్‌సి ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనంలో సిహెచ్‌ఎన్‌సి కార్యాలయం ఏర్పాటు చేసి, ఇక్కడ నుండే 9 పిహెచ్‌సిల పనితీరును అధికార్లు పర్యవేక్షించేవారు.

07/23/2016 - 03:37

తిరుపతి, జూలై 22: రాత్రనక, పగలనక ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మలమూత్రాలను శుభ్రంచేసి పారిశుద్ధ్యాన్ని అందిస్తున్న కార్మికులు కడుపుకాలి పనిచేయడం ఆపితే ఆ పని మరొకరు చేయలేరని ధర్మబద్ధంగా జీతాలిచ్చి వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి డాక్టర్ చింతామోహన్ రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌కు విజ్ఞప్తిచేశారు.

Pages