S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 03:32

తిరుపతి, జూలై 22: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈనెల 27 నుంచి ఆగస్టు 5వ తదే వరకు ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవరోజుల్లో ఉదయం 6 నుంచి 6.30 గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

07/23/2016 - 03:31

వి.కోట, జూలై 22: స్థానిక అంబేద్కర్ కూడలిలో జాతీయ రహదారిపై శుక్రవారం వివిధ దళిత సంఘాలు బిఎస్‌పి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా పలమనేరు నియోజకవర్గ బిఎస్‌పి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ జాతీయ బిఎస్‌పి పార్టీ అధ్యక్షురాలు మాయావతిని పార్లమెంట్‌లో దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. దళిత ప్రతినిధులు సమాజంలో గౌరవంగా బతికేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేసారు.

07/23/2016 - 03:31

పెనుమూరు, జూలై 22: రాష్ట్ర ప్రజలను మోసగించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాల్లో తనదైన శైలిలో రాష్ట్రాన్ని దోచుకుంటున్న ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు.

07/23/2016 - 03:30

పెనుమూరు, జూలై 22: ప్రధానమంత్రి కిసాన్ వారి ఆధ్వర్యంలో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని నియోజకవర్గ ప్రత్యేక అధికారి, ఉపాధిహామీ ఎడి శంకరయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన పెనుమూరులోని స్థానిక వ్యవసాయ కార్యాలయం ఆవరణలో రైతులకు నీటి వినియోగంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్యేక అధికారి శంకరయ్య పాల్గొన్నారు.

07/23/2016 - 03:29

కరీంనగర్, జూలై 22: సినిమా రిలీజ్ కాకముందే అడ్వాన్స్ బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపిన ‘కబాలి’ సినిమాలోని ఓ సన్నివేశం మరో సంచలనానికి కేంద్ర బిందువైంది. కరీంనగర్‌కు చెందిన ప్రొఫెసర్ రాసిన పుస్తకం కబాలి సినిమాలో హీరో రజినీకాంత్ చదవడం విశేషం. తొలి సన్నివేశంలోనే జిల్లాకు చెందిన ప్రొఫెసర్ రాసిన ‘మై ఫాదర్ బాలయ్య’ అనే పుస్తకాన్ని చేతబట్టి చదవడంతో కరీంనగర్ పేరు చర్చనీయాంశమైంది.

07/23/2016 - 03:28

రాజంపేట, జూలై 22: జిల్లాలో 2014 ఎన్నికల్లో అధికార పార్టీ నుండి గెలిచిన ఏకైక శాసనసభ్యుడిగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపొందిన రాజంపేట శాసనసభ్యులు, విప్ మేడా మల్లికార్జునరెడ్డి నియోజకవర్గంలో బలాన్ని పెంచుకునే దిశగా కనే్నసి అడుగులేస్తున్నారు. రాజకీయ కోణంలో కొన్ని సామాజికవర్గాలు తనను అపార్థం చేసుకుంటున్న అంశాన్ని గుర్తించి ఇలాంటి సామాజికవర్గాలకు దగ్గరవ్వడం అత్యవసరమని మేడా భావిస్తున్నట్టు సమాచారం.

07/23/2016 - 03:27

రాజంపేట, జూలై 22:రాజంపేట మండలం అన్నమయ్య అర్చి వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను మన్నూరు పోలీసులు అరెస్టు చేసినట్లు డిఎస్పీ ఎ.రాజేంద్ర తెలిపారు.

07/23/2016 - 03:26

పులివెందుల, జూలై 22: ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగులకు ఉపాధి శిక్షణకై దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూర్యమోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

07/23/2016 - 03:26

రాయచోటి, జూలై 22: రాయచోటి నుండి రామాపురం మండలం గువ్వలచెరువు వరకు గల జాతీయ రహదారిని ఫోర్‌లైన్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు పూర్తయ్యాయని, త్వరలోనే టెండర్లను కూడా పిలవడం జరుగుతుందని రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

07/23/2016 - 03:25

కడప,(కల్చరల్)జూలై 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 3వనం-మనం2 సంక్షేమ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈనెల 29న జిల్లాలో 67వ వనమహోత్సవ దినంగా పాటిస్తున్నట్లు కడప రెవెన్యూ డివిజనల్ అధికారి కె.చినరాముడు శుక్రవారం తెలిపారు.

Pages