S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 03:37

రామచంద్రాపురం, జూలై 22: కుప్పం బాదూరు సమీపంలో పాల ఆటో బోల్తా పడటంతో ఏడుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళితే పరమాల నుంచి గంగి రెడ్డిపల్లి వైష్ణవి డెయిరీఫామ్‌కు పాలు తరలిస్తున్న ఆటోలో పరమాల, మిట్టకండ్రిగ, కుప్పం గ్రామాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు కుప్పంబాదూరు పాఠశాలకు వెళ్లడానికి ఎక్కారు. కుప్పం బాదూరు రైస్‌మిల్ సమీపంలో మలుపువద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

07/23/2016 - 03:36

చిత్తూరు, జూలై 22: చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా గిరీషాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ జెసిగా ఉన్న భరత్‌గుప్తాను ప్రభుత్వం ఇటీవల శ్రీశైలం ఆలయ ఈవోగా నియమించింది. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్‌గా ఉన్న గిరీషాను జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

07/23/2016 - 03:36

హైదరాబాద్, జూలై 22: మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంటింటికి ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించే విధంగా, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో ప్రతి ఒక్కరికీ అన్ని అవకాశాలు అందాలన్న లక్ష్యంతో లక్షా 50వేల కిలో మీటర్ల మేర ఇంటర్‌నెట్ ఫైబర్ లైన్లు వేస్తున్నట్టు మంత్రి తారక రామారావు తెలిపారు. మారుమూల గ్రామాలను ప్రపంచంతో కలపాలని, ఇది ఇంటర్‌నెట్‌తోనే సాధ్యం అవుతుందని అన్నారు.

07/23/2016 - 03:35

తిరుపతి, జూలై 22: తిరుపతి-తిరుచానూరులో 7 ఇళ్లు, మహిళల మెడల్లో చెన్లుచోరీచేసి తప్పించుకుతిరుగుతున్న ముగ్గురు దొంగలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు క్రైం ఎ ఎస్పీ సిద్దారెడ్డి తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.5లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని అరెస్ట్‌చేశామన్నారు. ఎ ఎస్పీ సిద్దారెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

07/23/2016 - 03:34

తిరుపతి, జూలై 22: త్యాగరాజ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 11రోజుల పాటు నిర్వహించనున్న 250వ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కమిటీ ఛైర్మన్ బీమాస్ రఘు తెలిపారు.

07/23/2016 - 03:34

హైదరాబాద్, జూలై 22: తెలంగాణలోని అన్ని పరిశ్రమల్లో నిబంధనల మేరకు ఉండాల్సిన గ్రీనరీని పర్యవేక్షించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు తెలిపారు. ప్రతి పరిశ్రమలోనూ మూడవ వంతు చెట్ల పెంపకం ఉండాలని, ఈ వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. దీని కోసం గ్రీన్ బుక్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

07/23/2016 - 03:34

తిరుపతి, జూలై 22: మదనపల్లి మునిసిపల్ చైర్మన్ వేధింపులకు బలవన్మరణానికి పాల్పడిన శ్రీనాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలని రూ. 25 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలంటూ సి ఐ టి యు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ వేధింపుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

07/23/2016 - 03:33

పలమనేరు, జూలై 22: పలమనేరు పట్టణ సమీపంలోని గంటావూరు అటవీ ప్రాంతంలో శుక్రవారం కుక్కల దాడిలో అడవి నుంచి వచ్చిన దుప్పి తీవ్ర గాయాలై మృత్యువాత పడింది. దీనిని గమనించిన స్థానికులు పలమనేరు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. అనంతరం అటవీ అధికారులు చట్టం ప్రకారం వణ్యప్రాణికి చేయవలసిన కార్యక్రమాలు చేపట్టారు. అటవీ సమీప గ్రామాల్లో వ్యవసాయ పొలాలపై దుప్పిలు, అడవి జంతువులు వస్తుంటాయి.

07/23/2016 - 03:33

హైదరాబాద్, జూలై 22: ఇక తెలంగాణలో అరచేతిలో జలవనరుల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇది నీటిపారుదల రంగంలో నూతన ప్రయోగం. నీటిపారుదల పరిస్థితి సమీక్షకు ఉపగ్రహ సహకారం తీసుకుంటారు. జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశే్లషించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రయోగానికి నాంది పలికినట్టు ఇస్రో కితాబు ఇచ్చింది. ఆగస్టు 6న దీనికి సంబంధించి ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

07/23/2016 - 03:33

చంద్రగిరి, జూలై 22: రాష్టవ్య్రాప్తంగా 1.5 లక్షల ఉపాధ్యాయుల ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీచేయాలని బహుజన టీచర్ అసోసియేషన్‌కు చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి ఆంజినేయులు డిమాండ్ చేశారు. చంద్రగిరిలోని ప్రాథమిక పాఠశాలలో బహుజన టీచర్స్ అసోసియేషన్‌కు చెందిన కార్యవర్గ సమావేశం జరిగింది.

Pages