S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/27/2016 - 21:23

పెద్ద తారల చిత్రాలు ఎప్పుడు విడుదలైనా ఫరవాలేదు. వాటికి ఏ పోటీ ఉండటం లేదు. ఆ సినిమాలు విడుదలై ఐదారు వారాలైంది కదా. ఇక మన సినిమాలు విడుదల చేసుకుందాం అని చిన్న నిర్మాతలు అనుకుంటే అది నిరాశే అవుతుంది. ఎందుకంటే ఆయా చిత్రాల్లో ఎటువంటి ఆకర్షణ లేకపోవడమే. ఇది ప్రతివారం అనుభవైక వేద్యమే అవుతోంది.

06/27/2016 - 21:22

ఫ్యామిలీ హీరోయిన్‌గా వచ్చినా డర్టీ పిక్చర్‌తో విద్యాబాలన్ సెనే్సషన్ క్రియేట్ చేసింది. హాట్ హాట్ అందాలను ఆరబోసి బాలీవుడ్‌లో వంద కోట్ల మార్కెట్‌ను దాటేసింది. విద్యాబాలన్ అందాలకు బాలీవుడ్ తలవొంచింది కూడా. సౌత్ గ్లామర్ గాళ్ సిల్క్‌స్మిత జీవిత కథతో తెరకెక్కిన ఆ సినిమాకు, ఇప్పుడు సీక్వెల్ చేసే పనిలో పడింది నిర్మాత ఏక్తాకపూర్!?

06/27/2016 - 21:21

ఫెయిర్ అండ్ లవ్‌లీ యాడ్‌తో పాపులరైన యామీగౌతమ్ దక్షిణాదిలో చేసిన రెండు చిత్రాలూ సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో బాలీవుడ్‌నే నమ్ముకుంది. బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి హీరో పులకిత్ సామ్రాట్‌తో జోరుగా ప్రేమాయణం సాగించింది. అతనితో డేటింగ్ చేస్తోందని, పెళ్లికీ రెడీ అయిపోతున్నదంటూ మీడియాలో వచ్చిన కథనాలకు తాజా సమాచారం షాక్ ఇచ్చేదే. అదేంటంటే, పులకిత్‌కు యామీ బ్రేకప్ చెప్పిందని.

06/27/2016 - 21:13

గ్లామర్ గాళ్‌గా పాపులార్టీ అయితే సంపాదించిందిగానీ, ఒక్క ప్రాజెక్టూ తాప్సీని టాప్‌కు చేర్చలేదు. దాంతో బాలీవుడ్‌కి ఎగిరిపోయిన చిలుక, రెండు మూడు సినిమాలతో మళ్లీ క్రేజ్ సంపాదించింది. అయితే తాప్సీకి గ్లామర్ పాత్రలు, ఎక్స్‌పోజింగ్ సాంగుల్లాంటి వాటిమీద బోర్ కొట్టేసిందట. కో ఆర్టిస్టుల మాదిరి వైవిధ్యాన్ని చూపాలని అనుకుంటోందట. అంటే పాట పాడటమో, డైరెక్షన్ చేయడమో కాదు.. కలం పట్టుకుని కసరత్తు చేస్తానంటోంది.

06/27/2016 - 21:11

సినిమా అంటేనే వి’చిత్ర ప్రపంచం. ఒక సన్నివేశంలో ఉరుములు మెరుపులు సంభవించాయంటే -తరువాతి కథలో ఏదో జరగబోతోందన్న సంకేతాన్ని దర్శకుడు ఇస్తున్నాడన్న మాట. జీవితం కూడా సినిమా లాంటిదే. జీవితంలోని ఒక సన్నివేశంలో ఉరుములు మెరుపులు చోటు చేసుకున్నాయంటే -తరువాతి కథలో మంచో చెడో జరగబోతోందన్న సంకేతాన్ని భగవంతుడు ఇస్తున్నాడన్న మాట.

06/27/2016 - 21:10

సినిమా విశ్వవ్యాప్త కళాత్మక వ్యాపారం. అందుకే రీమేక్, డబ్బింగ్ ప్రక్రియల ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలనూ టచ్ చేస్తూంటుంది. ప్రాంతీయ భాషా చిత్రాలు ఆయా ప్రాంతాలకే పరిమితం అవుతుంటే, హాలీవుడ్ సినిమా మాత్రం ప్రపంచాన్ని చుట్టిముట్టేస్తూ వేల కోట్లు కొల్లగొడుతోంది. ఇటీవలి కాలంలో లోకల్ హీరోల సినిమాలకు ధీటుగా రిలీజ్ అవుతూ, పెద్ద హీరోలకూ చుక్కలు చూపిస్తున్నాయి.

06/27/2016 - 21:08

-దర్శకుడు పా రంజిత్
సూపర్‌స్టార్‌గా సౌత్‌లో తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రజనికాంత్‌తో సినిమా చేయాలంటే.. ఆ కష్టాన్ని ఊహించడమే కష్టం కదా. అలాంటిది రజనీయే పిలిచి నీతో సినిమా చేయాలని దర్శకుడితో అంటే.. ఆ దర్శకుడి మైండ్ ఎలా బ్లాంకవుతుందో
రంజిత్‌ని చూస్తే అర్థమవుతుంది. కేవలం ఒక్క సినిమా ఎక్స్‌పీరియన్స్‌తో ‘కబాలి’ ఛాన్స్ కొట్టేసిన పా రంజిత్‌తో చిట్ చాట్..

06/27/2016 - 21:06

ప్రజారంజకమైన చిత్రాలు నిర్మించడంలో ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ముందువరసలో ఉండేది. ఒక బెంగాలీ నవల ఆధారంగా నిర్మించిన చక్కటి భావోద్వేగాలున్న చిత్రం ‘్భర్యాభర్తలు’. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుమారుడైన ఏఎన్నార్ విలాసవంతంగా అమ్మాయిలతో ‘జోరుగా హుషారుగా’ అంటూ తిరుగుతూ కాలక్షేపం చేస్తూంటాడు. మధ్యతరగతి కుటుంబీకురాలైన కృష్ణకుమారిని ప్రేమిస్తాడు.

06/27/2016 - 21:01

‘మహేశా పాప వినాశా కైలాసవాసా ఈశా..’ ఈ పాట ‘కాళహస్తి మహత్మ్యం’ చిత్రంలోనిది. దశాబ్దాలు దాటినా భక్త్భివాన్ని, హృదయ స్పందన కలిగించే భక్తులకు మరువరాని పాట ఇది. పామరుడు కానీ, పండితుడు కానీ భక్త్భివనతో తెల్పుకునే విన్నపాలు భోళాశంకరుడు వింటాడని, కరుణించి ఆదుకుంటాడన్న నమ్మకము కలిగించే చిత్రమిది.

06/21/2016 - 04:17

ఆణిముత్యాల వంటి పాటల సమాహారంలో ఆధునిక డిజిటల్ యుగంలో, పాశ్చాత్య నాగరికతా ప్రభావాలని తట్టుకొని నిలబడిన పాట ‘గీతాంజలి’ చిత్రంలో ‘జో పాపా లాలి’. ఈ పాటంటే ఎంత ఇష్టమో మాటల్లో నిర్వచించడం అసాధ్యం. నాగార్జున, గిరిజ నాయకా నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని భాగ్యలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై సియల్ నరసారెడ్డి నిర్మించారు. విలక్షణ, విభిన్న సినిమాల సృష్టికర్త మణిరత్నం దర్శకత్వం వహించారు.

Pages