S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/25/2017 - 19:43

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘్ఫదా’ చిత్రం తెలుగు చిత్రసీమలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వరుణ్‌తేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతనికి జోడీగా నటించిన సాయి పల్లవికి తెలుగునాట ఎనలేని క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ భామకు అవకాశాలు ఉప్పెనలా వచ్చిపడుతున్నాయి. ఒకటి తరువాత మరోటి ఇలా వరుసగా వస్తున్న అవకాశాలతో ఆమె డైరీ నిండిపోతోంది. ఇటీవలే నానికి జోడీగా నటించిన ‘ఎం.సి.ఏ’ విడుదలయింది.

12/25/2017 - 19:41

నటుడు చలం తన స్వంత చిత్ర నిర్మాణ సంస్థ ‘రమణచిత్ర’ బేనర్‌లో తను, జయలలిత ప్రధాన పాత్రలుగా నిర్మించిన చిత్రంలోని ఈ గీతం ఆలోచింపజేస్తూ, వేదాంత ధోరణిలో సాగుతుంది. డబ్బింగ్ రచయితగా రాజశ్రీగారు బాగా ప్రాచుర్యం పొందినా నటుడు చలం తన చిత్రాలలో వారిచేత ఎన్నో ఆణిముత్యాలులాంటి పాటలు రాయించారు.

12/25/2017 - 19:40

రవితేజ చలాకీగా నటించిన ‘కిక్’ చిత్రం చూస్తున్నంతసేపు నాకు కూడా బాగా కిక్ వచ్చింది. దర్శకుడు సురేందర్‌రెడ్డి ప్రస్తుత జనరేషన్‌కు నచ్చే విధంగా సినిమాను తీశారు. అతడి దర్శకత్వ ప్రతిభ ప్రతి సన్నివేశంలో కన్పిస్తుంది.

12/25/2017 - 19:17

స్వర్గయుగపు కాలంనాటి ఎన్టీఆర్ ‘దేవాంతకుడు’ నుంచి నిన్న మొన్నటి జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ వరకూ ఫాంటసీ సినిమాల్లో యముడి పాత్ర అలరిస్తూనే ఉంది. ఎన్నో చిత్రాల్లో యముడి పాత్రను హాస్యంతోపాటు సందేశాత్మకంగా తీర్చిదిద్దుతున్నా, ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. సాంఘిక సినిమాల్లో యముడి పాత్ర సృష్టి అద్వితీయం. ఎన్టీఆర్‌తో తాతినేని రామారావు నిర్మించిన ‘యమగోల’తో ఈ పాత్ర మరింత ప్రాచుర్యాన్ని సంతరించుకుంది.

12/25/2017 - 19:00

ప్రముఖ నటుడు పద్మనాభం తన కుమారుడు మురళి, తోటి నటుడు మిత్రుడు అయిన వల్లం నరసింహారావు కుమార్తె రేఖ పేర్లు కలిసివచ్చేలా స్థాపించిన నిర్మాణ సంస్త రేఖా అండ్ మురళీ ప్రొడక్షన్స్. ఇదే పేరుతో పలు నాటకాలు ప్రదర్శించగా, చిత్ర నిర్మాణం ప్రారంభించాక తొలుత ఎన్.టి.ఆర్, సావిత్రిలతో ‘దేవత’, ఆ తర్వాత పద్మనాభం, వాణిశ్రీలతో ‘పొట్టి ప్లీడరు’ రూపొందించారు. ఈ చిత్రాలకూ హేమాంబరధరరావే దర్శకులు.

12/25/2017 - 18:57

తెలుగు చిత్రసీమలో ‘అందాలనటుడు’గా మహిళలు మెచ్చే కథానాయకుడు శోభన్‌బాబు గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆయన అసలు పేరు శోభనాచలపతిరావు. దైవబలం (1959) చిత్రంలో ఊరు పేరు లేని వేషంలో కనిపించినా ‘్భక్తశబరి’ (1960) చిత్రంలో పేరు, ఉనికితో తొలి చిత్రం సీతారామ కల్యాణంలో లక్ష్మణుడి పాత్రతో పరిశ్రమలో, ప్రేక్షకుల్లో గుర్తింపు.

12/18/2017 - 19:56

1980 జూలై 31.. రాత్రి 10 గం.లు.. పవిత్ర రంజాన్ మాసం...
భారతదేశాన్ని సంగీత లోకాలలో ఊగిసలాడించిన ఓ మధుర స్వరం మూగవోయింది.
తన గొప్పతనాన్ని ప్రపంచానికి తేటతెల్లం చేసిన తేనెల ఊటలాంటి ‘పాట’ తన శ్వాసకు శెలవు పలికింది.
ఆ పాట పేరు ‘మహమ్మద్ రఫీ’..

12/18/2017 - 19:54

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వేటూరి సుందరరామూర్తి కలం నుండి జాలువారిన అద్భుతమైన పాటలలో ‘కొండవీటి సింహం’ చిత్రంలోని ఎన్టీఆర్, శ్రీదేవి నటించిన ‘బంగినిపల్లి మామిడిపండు రంగుమీదుంది, చిలకే ముట్టని జాంపండు చేతికి వచ్చింది’ పాట నాకు ఎంతో ఇష్టం.

12/18/2017 - 19:50

వీనస్ పద్మిని కంబైన్స్ పతాకంపై విక్టరీ వి.మధుసూదనరావు దర్శకత్వంలో నిర్మించిన ‘లక్ష్మీనివాసం’ ఆద్యంతం చక్కని కుటుంబ గాథా చిత్రం. ధనం విలువను తెలియజేస్తూ, విచ్చలవిడిగా, నిర్లక్ష్యంగా అదుపు లేకుండా ఖర్చుపెడుతుంటే తర్వాత వచ్చే ఇబ్బందులు, పర్యవసానాలు తెలియజేసే మంచి వినోదంతో కూడిన సందేశాత్మక చిత్రం. 1968 జూలైలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

12/18/2017 - 20:40

తన ప్రియుడు విరాట్ కోహ్లి అనుష్కను పెళ్లి చేసుకోవడంతో రాఖీ సావంత్ భగ్నప్రేమికురాలిగా మారిపోయిందట. పెళ్లయ్యాక అనేకమంది సంతోషంగా వున్నా ఆమె మాత్రం తన బాధను వ్యక్తం చేస్తూనే వుంది. బాలీవుడ్‌లో సెక్స్‌బాంబ్‌గా సంచలనం రేపిన రాఖీ, విరాట్ కోహ్లిని ఎంతో గాఢంగా ప్రేమించిందట. ఇపుడు తన పరిస్థితి ఏమిటి? అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిందామె. ఇపుడు నేనేం చేయాలి విరాట్?

Pages