S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/08/2018 - 20:06

ఎం.ఏ విద్యార్థులకు ‘్భరతములో వనచర వృత్తాంతము’ అనే పాఠం ఉండేది. దూర విద్యాకేంద్రం వారి పేపర్లు దిద్దుతున్నప్పుడు ఒక విద్యార్థి ఇలా వ్రాశాడు. ‘‘నేను సుల్తాన్ బజార్ వెళ్లాను. చాయ్ తాగాను’’ ద్రౌపది; ‘‘ఆబిడ్స్ వెళ్ళాను- సినిమా చూశాను’’ భీముడు; ‘‘నాంపల్లి వెళ్ళాను- పల్లీలు తిన్నాను’’ ధర్మరాజు- ఇలా రెండు పేజీల సమాధానం ఉంది. ఇందులో సుల్తాన్ బజార్ వెళ్లాను అనే వాక్యం అస్పష్టంగా వ్రాశాడు.

01/08/2018 - 20:02

గుడివాడ తాలూకా కొత్త నిమ్మకూరుకు చెందిన ధాన్యం వ్యాపారి కుదరవల్లి నరసయ్య, వీరి కుమారుడు కుదరవల్లి సీతారామస్వామి. కొంతకాలం ధాన్యం వ్యాపారం, కొంతకాలం బస్ కండక్టర్‌గా పనిచేశారు. 1967లో వీరి స్నేహితులు పొట్లూరి వెంకట నారాయణరావుతో కలిసి లక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘చిక్కడు- దొరకడు.

01/08/2018 - 19:59

తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఆచారం వుంది. అదేంటంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు పెద్ద బడ్జెట్ సినిమాలను విడుదల చేయడం. అంటే కేవలం పెద్ద సినిమాలనే కదా, చిన్న హీరోలు నటించిన సినిమాలు, చిన్న బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు కూడా విడుదలవుతాయి. కానీ పెద్ద హీరోల సినిమాలు, పెద్ద బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు ప్రదర్శించటానికే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా థియేటర్లు సరిపోవు.

01/01/2018 - 20:50

జయాపజయాలతో సంబంధం లేకుండా రాశీఖన్నా చేతిలో ఇప్పుడు చేతి నిండా చిత్రాలే ఉన్నాయి. ఈ అమ్మడు బిజీ..బిజీగా కెరీర్‌లో పరుగులు పెడుతోంది. అందానికి తోడు అభినయంలో మంచి మార్కుల్నే కొట్టేస్తున్న ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం నుంచి ఇప్పటి వరకూ ఆమె ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేదు. వరుస అవకాశాలతో కెరీర్‌లో పరుగులు పెడుతోంది.

01/01/2018 - 19:53

‘పాదుకా పట్ట్భాషేకం’..ఈ కథను ఇప్పటికి మూడుసార్లు సినిమాగా రూపొందించారు. అయితే మూడుసార్లూ సినిమా విజయవంతం కాకపోవడం గమనార్హం. 15-3-1945న విడుదలైన రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీవారు కె.బి.నాగభూషణం దర్శకత్వంలో వచ్చిన ‘పాదుకా పట్ట్భాషేకం’ చిత్రం రిలీజైన మొదట్లో విజయం సాధించలేదు. కానీ సెకెండ్ రన్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోగలగింది.

01/01/2018 - 19:53

జనవరి7, 1967లో విడుదలైన వాహిని పిక్చర్స్ వారి చిత్రం ‘రంగులరాట్నం’. దర్శకుడు బి.ఎన్.రెడ్డి. ఈ చిత్రం లో ‘ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగుల రాట్నము’ పాటను కావలి, జవహర్‌భారతి కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న భుజంగరాయశర్మతో రాయించారు బి.ఎన్.రెడ్డి. ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. ఈ పాట రాజేశ్వరరావు సంగీతంలో ఘంటసాల బృందం పాడగా, నేపథ్యగీతంగా అద్భుతంగా సాగుతుంది. మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.

01/01/2018 - 19:51

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్.టి.రామారావు, మహానటి సావిత్రి నటించిన చిత్రం ‘కన్యాశుల్కం’. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ చిత్రంలోని పాత్రలు మన మనసులో అట్లాగే నిలిచి ఉంటాయి. ప్రతి పాత్ర మనసుకు హత్తుకుంటుంది. దర్శకులు పి.పుల్లయ్య చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’ నాటకం ఆధారంగా తెరకెక్కించారు.

01/01/2018 - 19:45

నేటి తెలుగు పాటల్లోని మాధుర్యం- సంగీత సాహిత్యపరంగా, నేతిబీరకాయలో నేయి చందాన పరిణమిస్తోందనడం అతిశయోక్తి కాదేమో! మన వెండితెరపై పల్లవిస్తున్న తెలుగు పాటల్లోని సాహిత్యం పరభాషా పదాల ముప్పేట దాడిలో ఉక్కిరిబిక్కిరై ఉన్న ఉనికిని కోల్పోతుందన్న వాస్తవం అందరూ అంగీకరించక తప్పని నగ్నసత్యం!

01/01/2018 - 19:02

1938లో ‘అల్లి అర్జున్’తో చిత్ర నిర్మాణం ప్రారంభించారు ఏ.వి.మొయ్యప్పన్. మద్రాస్ శాంధోల్‌ని ఎవియం స్టూడియోని తరువాత వడపళనికి మార్చారు. 1950లో ‘వాళ్కై’ తమిళ చిత్రం ఆధారంగా వీరు నిర్మించిన ‘జీవితం’ చిత్రం ఆ ఏడాది విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నాటినుంచి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కిపైగా చిత్రాలు రూపొందించారు.

01/01/2018 - 18:59

మూకీ చిత్ర నిర్మాణ కాలంలో సినిమాల్లో నటించేందుకు స్ర్తిలు అంగీకరించేవారు కారు. 1913లో దాదాసాహెబ్ ఫాల్కే ‘రాజాహరిశ్చంద్ర’ సినిమా రూపొందిస్తుంటే చంద్రమతి పాత్ర ధరించడానికి ఆడ పిల్లలు దొరకలేదు. చివరికి ఎ.సలంకె అన్న వంట మనిషిని నెలకి 15 రూపాయల జీతం మీద ఆ సినిమాలో బుక్ చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన దేవికారాణి ప్రవేశం వెండితెరకు కొత్త వెలుగును తెచ్చింది.

Pages