S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/20/2018 - 03:54

విజయవాడ, ఏప్రిల్ 17: ప్రత్యేక హోదా కోసం శుక్రవారం తాను చేపట్టబోయే 12 గంటల ధర్మ పోరాట దీక్షలో పాల్గొనాలంటూ మంత్రివర్గం ఉప సంఘం అధ్యక్షుడు, విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పంపించిన ఆహ్వానాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తిరస్కరించారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా కళా వెంకట్రావుకు బహిరంగ లేఖ రాశారు.

04/20/2018 - 03:53

తిరుపతి, ఏప్రిల్ 19: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికల ముందు తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన మాట ప్రకారం విభజన చట్టంలోని హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదాను ఇచ్చి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను అందించి ఉండేవారని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు.

04/20/2018 - 03:52

విజయవాడ, ఏప్రిల్ 17: నాబార్డు, వరల్డ్ బ్యాంకు, విదేశీ రుణాల సాయంతో అందుతున్న నిధులను వినియోగిస్తూ, ఆయా పనులను సకాలంలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో పలు శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

04/20/2018 - 03:51

విజయవాడ, ఏప్రిల్ 19: కడప, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో కరవు నుంచి ఉపశమన చర్యలకు రూ.680 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన కరవు నివారణ చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అదనపు సాయం అందించాలని కోరారు.

04/20/2018 - 03:47

విజయవాడ, ఏప్రిల్ 17: గుంటూరు హైలెవెల్ ఛానల్ ప్రకాశం జిల్లా పర్చూరు వరకు పొడిగింపు అంశంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. మొదటి దశ సర్వే పనులకు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

04/20/2018 - 03:47

మడకశిర, ఏప్రిల్ 19: కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్దనోట్ల రద్దు తర్వాత ముద్రించిన నోట్లపై శే్వతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అనంతపురం జిల్లా మడకశిరలో ఏటీఎం కేంద్రాలను ఆ యన పరిశీలించారు.

04/20/2018 - 03:46

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 19: సీలేరు జలాల పుణ్యమా అని ఎట్టకేలకు గోదావరి డెల్టాలో రబీ పంట గట్టెక్కింది. ఎన్నడూ లేని విధంగా గోదావరిలో సహజ జలాల లభ్యత తగ్గిపోవడంతో రబీ సాగుపై నీలి నీడలు అలుముకున్నాయి. అయితే సీలేరు నుండి నిర్దేశిత పరిమాణం కంటే ఆరు టీఎంసీల నీరు అధికంగానే సరఫరా చేయడంతో రబీ పంట గట్టెక్కింది.

04/18/2018 - 04:31

అనంతపురం, ఏప్రిల్ 17: వర్షాభావం కారణంగా తలెత్తిన కరవు పరిస్థితుల్ని అంచనా వేసేందుకు అనంతపురం జిల్లాలో మంగళవారం నలుగురు సభ్యులున్న కేంద్ర కరవు బృందం పర్యటించింది. ఈ బృందానికి అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. ముఖ్యంగా తాగునీరు, సాగునీటి సౌకర్యం, పంట నష్టపరిహారం, పంటల బీమా, ఫ్లోరైడ్ సమస్యల్ని రైతులు, ప్రజలు ఏకరువు పెట్టారు.

04/18/2018 - 03:21

విజయవాడ, ఏప్రిల్ 17: విజయనగరంలో ఈనెల 26 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉరుసు ఉత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సూఫీ పీఠాధిపతి ప్రతినిధులు ఆహ్వానించారు. 27న హజరత్ సయ్యద్ షహీన్ షా బాబా గంధ మహోత్సవం, 28న చాదర్ సమర్పణ, ఉరుసు ముగింపు ఉత్సవాలు ఉంటాయని హజరత్ సూఫీ మహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా పీఠాధిపతి కుమారులు ఆహ్వానించారు.

04/18/2018 - 03:20

విజయవాడ, ఏప్రిల్ 17: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల్లో నిర్వహిస్తున్న వివిధ డిప్లొమో కోర్సుల ఫీజులను సవరించేందుకు వీలుగా అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కమిటీని నియమించింది. ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులను పెంచాలని కోరిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది.

Pages