S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/18/2018 - 03:20

తిరుపతి, ఏప్రిల్ 17: కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో ఓ నయవంచకుడు మాయమాటలు చెప్పి ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి తిరుపతికి తీసుకువచ్చిన సంఘటన సోమవారం అర్థరాత్రి తిరుపతి రైల్వే స్టేషన్లో గుర్తించారు. ఆపై వారి తల్లితండ్రులకు సమాచారం ఇచ్చి వారికి పిల్లలను అప్పగించారు.

04/18/2018 - 03:19

విజయవాడ, ఏప్రిల్ 17: రాష్ట్రంలో గ్రామీణ పశువైద్య యూనిట్లను పశు వైద్యశాలలుగా ఉన్నతీకరించి నిరుద్యోగులుగా ఉన్న 500 మంది పశువైద్య పట్ట్భద్రులకు అవకాశం కల్పించాలంటూ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం పశు వైద్యశాలలను పారా మెడికల్ స్ట్ఫాతో నిర్వహిస్తున్నారని, ఇది సరికాదన్నారు.

04/18/2018 - 03:18

విశాఖపట్నం, ఏప్రిల్ 17: అదనపువిద్యుత్ వినియోగిస్తున్న గృహ విద్యుత్ వినియోగదారులు క్రమబద్ధీకరించుకునేందుకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. అననపు లోడు క్రమబద్ధీకరించుకునే వినియోగదారులు డెవలప్‌మెంట్ ఛార్జీల్లో 50 శాతం రాయితీని ఇవ్వాలని ఈపీడీసీఎల్ ప్రతిపాదించగా ఏపీఈఆర్‌సీ అమోదం తెలిపినట్టు సీఎండీ హెచ్‌వై దొర తెలిపారు.

04/18/2018 - 03:17

విజయవాడ, ఏప్రిల్ 17: ఆర్థికశాఖ, ఇతర శాఖల పరస్పర సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్)లో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్ సూచించారు.

04/18/2018 - 03:17

రేణిగుంట, ఏప్రిల్ 17: ఒకరి చేతిలో మోసపోయిన వ్యక్తి తానే మోసగాడిగా మారి మరికొంతమందిని మోసగించడంతో పోలీసులకు చిక్కిన సంఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది. ఈజీ మనీకి అలవాటు పడ్డ ఓ నిరుద్యోగి రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇద్దరు నిరుద్యోగులను మోసగించే ప్రయత్నంలో విమానాశ్రయంలో పోలీసులు అడ్డంగా దొరికిపోయాడు.

04/20/2018 - 10:30

విజయవాడ, ఏప్రిల్ 17: గత కొంత కాలంగా వివాదాస్పదమవుతున్న విజయవాడలోని దుర్గగుడి వ్యవహారాల ప్రక్షాళనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి దృష్టి సారించారు. దుర్గగుడి ఈవోలుగా పని చేసిన వారు నిందలపాలై బదిలీ అవడం వెనుక కారణాల అన్వేషణ, పాలనా వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేకంగా అధికారి ఏర్పాటు వంటి అంశాలను మంగళవారం ఆ శాఖ అధికారుల వద్ద ప్రస్తావించారు.

04/18/2018 - 03:15

విజయవాడ, ఏప్రిల్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో శ్రీశైలం దేస్థానంలో చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల సమీకరణ అంశంపై దేవస్థానం ఈఓతో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.

04/18/2018 - 03:14

విజయవాడ, ఏప్రిల్ 17: నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయటానికి కొంత అటవీ భూములు, రెవెన్యూ భూములు ఆటంకంగా ఉన్న విషయం గుర్తించి నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులతో వెలగపూడి సచివాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమావేశమై ప్రత్యేకంగా అటవీశాఖ అనుమతుల విషయంపై చర్చించారు.

04/18/2018 - 03:14

విజయవాడ, ఏప్రిల్ 17: పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన నెల్లూరు మున్సిపల్ జూనియర్ కళాశాల విద్యార్థులు మొదటి సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు సాధించారని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. గత నెలలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పరీక్షలకు 49మంది విద్యార్థులు హాజరుకాగా 32 మంది 10కి 10 జీపీఏ, మరో 12 మంది 9.8, మిగిలిన ఐదుగురు 9.5 జీపీఏ సాధించారన్నారు.

04/18/2018 - 03:13

కాకినాడ, ఏప్రిల్ 17:రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మంగళవారం వినూత్న రీతిలో సముద్ర దీక్ష చేపట్టారు. బోట్లలో సముద్రంలోకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీ తీరుకు నిరసనగా నీరు, మట్టి కలిపారు.

Pages