S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/16/2018 - 05:03

విజయవాడ: దేశంలోనే ఇంధన పొదుపులో ముందంజలో ఉన్న రాష్ట్రం త్వరలో మరో మైలురాయిని అధిగమించనుంది. దేశంలోనే పూర్తిస్థాయిలో ఎల్‌ఈడీ వీధిదీపాలు కలిగి ఉన్న జిల్లాగా తూర్పు గోదావరి జిల్లా రికార్డు నెలకొల్పనుంది. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అంశాన్ని ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించనున్నారు. జిల్లాలో 3.1 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలు అమర్చనున్నారు.

04/16/2018 - 00:30

విజయవాడ, ఏప్రిల్ 15: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు జిమ్మిక్కులు మానుకోవాలని, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలును డిమాండ్ చేస్తూ ఈ నెల 16న చేపట్టిన రాష్ట్ర బంద్‌ను ఎవరూ అడ్డుకోలేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సాయం పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు.

04/16/2018 - 00:29

అనంతపురం, ఏప్రిల్ 15 : తన కోరిక తీర్చకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ మహిళా ఉద్యోగినిపై బెదిరింపులకు పాల్పడుతున్న కీచక అధికారి ఉదంతమిది. అనంతపురం జిల్లా స్ర్తి, శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సదరు అధికారి, తన కింది స్థాయి ఉద్యోగినిపై కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. కార్యాలయంలో విధులు ముగించుకుని ఇంటికెళ్లినప్పటికీ ఆమెను సెల్‌ఫోన్ ద్వారా వేధించేవాడు.

04/16/2018 - 00:28

కాకినాడ, ఏప్రిల్ 15: ప్రజలను నిరంతరం మోసం చేస్తూ, అబద్ధాలతో ఎంతకాలం వంచిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. చంద్రబాబు ఆడే అబద్ధాలు, మోసాలు క్యాన్సర్ వ్యాధి కంటే ప్రమాదకరమైనవన్నారు. మోసాలు చేయడంలో ఆరితేరిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో కాపులు సహా అన్ని వర్గాల ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

04/16/2018 - 00:27

తిరుపతి, ఏప్రిల్ 15: విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా కావాలని ఐదుకోట్ల ఆంధ్రులు బలంగా ఆకాంక్షిస్తున్నారని, ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న పోరాటంలో ప్రతిఒక్కరు బాగస్వాములు కావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

04/16/2018 - 00:27

విజయవాడ, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం సోమవారం జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పోరాటాలు ఉద్ధృతం చేస్తోందన్నారు.

04/14/2018 - 02:13

విజయవాడ, ఏప్రిల్ 13: సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కలిశారు. సీఎం సింగపూర్ వెళ్లిన సమయంలో సచిన్ కూడా అక్కడే ఉండటంతో శుక్రవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారిద్దరి మధ్య వివిధ అంశాలపై చర్చ జరిగింది. నెల్లూరు జిల్లాలో పుట్టంరాజువారి కండ్రిక గ్రామాన్ని సచిన్ ఇప్పటికే దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

04/14/2018 - 02:12

అనంతపురం సిటీ, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినట్లు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. అనంతపురంలో శుక్రవారం చలసాని విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం విభజన హామీలు, ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వకుండా ఏపీకి మోసం చేసిందన్నారు.

04/14/2018 - 02:11

అనంతపురం, ఏప్రిల్ 13 : ఈ ఏడాది జూన్ లేదా జూలై నాటికి కుప్పంకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలిస్తామని అనంతపురం జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. అనంతపురం నగరంలోని ఓ కళాశాలలో శుక్రవారం జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ‘నీరు-ప్రగతి-జల సంరక్షణ’ అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌ను మంత్రి దేవినేని ఉమా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

04/14/2018 - 02:11

విశాఖ(జగదాంబ), ఏప్రిల్ 13: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం విశాఖలో విడుదల చేశారు. ద్వితీయ, ప్రథమ సంవత్సరం ఫలితాలలో బాలికలే పైచేయిగా నిలిచారు. ఇంటర్ ప్రథమ సవంత్సరంలో 62శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది తొలి సంవత్సరంలో 64 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది రెండు శాతం ఉత్తీర్ణత శాతం తగ్గింది.

Pages