S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/29/2018 - 01:01

విజయవాడ, మార్చి 28: రాష్ట్రంలోని వివిధ వర్శిటీల్లో పీహెచ్‌డీల ప్రదానంలో చోటు చేసుకున్న అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. పీహెచ్‌డీల ప్రదానంలో కొన్ని వర్శిటీలు వ్యవహరిస్తున్న తీరుపై ఫ్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

03/29/2018 - 00:59

తిరుపతి, మార్చి 28: శ్రీవారి లడ్డూల తయారీకి ఉపయోగించే ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. పొగలు ఆలయ పరిసర ప్రాంతాల్లో దట్టంగా అలుముకున్నాయి. సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడం, ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేయడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది.

03/29/2018 - 05:29

అమరావతి: సరిగ్గా 38 ఏళ్ల క్రితం.. ఎన్టీఆర్ నేతృత్వంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడూ అదే నినాదంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడుతోంది. 38 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిన టీడీపీ విచిత్రంగా ఇప్పుడూ మరో జాతీయ పార్టీ బీజేపీపై యుద్ధం ప్రకటిస్తుండటం ప్రస్తావనార్హం.

03/29/2018 - 00:43

గుంటూరు, మార్చి 28: ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ వలన ఏడాదికి 200 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి అందుతుందని శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు తెలిపారు. ప్రత్యేక హోదా పరిధిలో రాయితీలు లేవన్నారు. 90 శాతం గ్రాంట్‌లు మాత్రమే కేంద్రప్రభుత్వ స్పాన్సర్స్ స్కీములలో మంజూరవుతాయని, 30 శాతం ఇస్తామన్నా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

03/29/2018 - 00:39

విజయవాడ, మార్చి 28: ఓ వైపు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నా, మరోవైపు కేంద్రం నుంచి సహకారం రాకపోయినప్పటికీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు కలలను నెరవేర్చేందుకు తమ సర్వశక్తులు ఒడ్డి గోదావరి - కృష్ణా - పెన్నా నదులను అనుసంధానం చేసి తీరుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

03/29/2018 - 00:38

విజయవాడ, మార్చి 28: రాష్ట్రంలో 20 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

03/29/2018 - 00:38

విజయవాడ, మార్చి 28: కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) నిర్ణయ పరిధిని కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పించాలని ఎమ్మెల్సీ కరణం బలరామ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసన మండలిలో వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర నిర్ణయాధికారాన్ని కేంద్రం నుంచి తప్పించినప్పుడే రాష్ట్ర రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ రైతుకు అన్యాయమే చేస్తుందని ఆరోపించారు.

03/29/2018 - 00:37

విజయవాడ, మార్చి 28: రాష్ట్రంలో వివిధ విమానాశ్రయ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఫ్రాన్సు దేశానికి చెందిన ఏరోపోర్ట్సు డి పారిస్ (ఏడీపీ) ముందుకు వచ్చింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆ సంస్థ ప్రతినిధులు గ్రేటీన్ మారీ తదితరులు బుధవారం సమావేశమయ్యారు.

03/29/2018 - 00:36

విజయవాడ, మార్చి 28: రాష్ట్రంలో ఉన్న అపార బొగ్గు క్షేత్రాలను ఆదాయవనరుగా మార్చుకోవచ్చని నీతి అయోగ్ సభ్యుడు సారస్వత్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆయన బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి, నూజివీడు తదితర ప్రాంతాలలో ఉన్న బొగ్గు నిల్వల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేపట్టవచ్చన్నారు.

03/29/2018 - 00:36

అమరావతి, మార్చి 28: శాసనసభ-శాసనమండలి సమావేశాలు నలుపుమయమయ్యాయి. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం, హోదా ఇవ్వకుండా అన్యాయం చేసినందుకు నిరసనగా వచ్చే నెల 6 వరకూ అందరూ నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రకటించాలన్న అఖిలపక్ష సమావేశ నిర్ణయం మేరకు బుధవారం సభ్యులంతా నల్లబ్యాడ్జీలతో సభకు హాజరయ్యారు.

Pages