S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/28/2018 - 00:58

అమరావతి, మార్చి 27: రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చేపట్టనున్న కార్యాచరణకు అఖిలపక్షం మద్దతు ప్రకటించింది. నాలుగేళ్లు రాష్ట్ర హక్కులపై పోరాడకుండా ఎందుకు వౌనంగా ఉన్నారని సీపీఎం, సీపీఐ నేతల ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారు.

03/28/2018 - 01:20

ఖమ్మం, మార్చి 27: కల్యాణరాముడు.. రారాజుగా మారాడు. రాజాధిరాజుగా కీర్తిప్రతిష్ఠలు అందుకున్నాడు. జగదభిరాముడైన శ్రీరాముడు శ్రీరామరాజ్యానికి మహారాజుగా పట్ట్భాషిక్తుడయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి నాడు పసుపు వస్త్రాలతో సీతా సమేతంగా దర్శనమిచ్చిన కల్యాణరాముడు మంగళవారం వజ్రాల కిరీటం ధరించి మహారాజుగా దర్శనమిచ్చాడు. భక్తుల జయజయ ధ్వానాలతో భద్రాద్రి మార్మోగగా..

03/28/2018 - 00:57

అమరావతి, మార్చి 27: కేంద్రంపై యుద్ధానికి సిద్ధమయిన తెలుగుదేశం పార్టీ ఆమేరకు రాష్ట్రంలోని వివిధ వర్గాలను కూడగట్టే ఎత్తుగడలో భాగంగా.. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన అఖిలపక్ష సమావేశ ప్రాథమిక లక్ష్యం నెరవేరినట్టే కనిపిస్తోంది. అఖిలపక్షానికి హాజరైన వామపక్షాలు మినహా మిగిలిన అన్నివర్గాలూ కేంద్రంపై చేసే పోరాటంలో కలసివస్తామని ప్రకటించాయి.

03/28/2018 - 00:56

అమరావతి, మార్చి 27: జనసేనకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఆనాడు అభిమానుల పునాదితో చిరంజీవి నిర్మించిన ప్రజారాజ్యం.. నేడు అదే పునాదులతో పవన్ నిర్మించిన జనసేనలో తొలినాటి పరిస్థితులు ఒకేలా కనిపిస్తున్నాయి. ప్రజారాజ్యం మధ్యలోనే చిరంజీవి వీరాభిమానులు నిష్క్రమించగా, ఇప్పుడు పవన్ జనసేన తొలి అడుగులోనే ఆ పరిస్థితి ప్రారంభమయింది. దిలీప్ సుంకర..

03/28/2018 - 01:30

అమరావతి, మార్చి 27: ఆరోజు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వాస్తవ స్ఫూర్తితో అమలు చేయమన్నాం. వాటిని అమలు చేయకపోవడం దుర్మార్గం. హామీలు అమలు చేయమంటే ఎదురుదాడికి దిగడం హేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. తాము చెప్పిందే వినాలన్న అహంభావంతో కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

03/28/2018 - 00:53

కాకినాడ, మార్చి 27: ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో స్వంత డబ్బా కొట్టుకుంటూ స్వప్రయోజనాలకు చట్టసభను వాడుకుంటున్నారని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. గత నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కుటుంబం, ఆయన సామాజికవర్గంలోని కొంతమంది ఎంత తిన్నా తరగని ఆస్తులు సంపాదించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంగళవారం ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. లేఖ ప్రతులను కాకినాడలో విడుదల చేశారు.

03/28/2018 - 00:48

హైదరాబాద్, మార్చి 27: ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల ఖరీదు విధానాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి హేతుబద్ధంగా, పారదర్శకతవిధానంతో తగ్గించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. గత నాలుగేళ్లుగా విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించడం వల్ల విద్యుత్ దుబారాగా కళ్లెం వేసింది. దీని వల్ల విద్యుత్ సద్వినియోగం పెరిగింది.

03/28/2018 - 01:25

సత్తెనపల్లి, మార్చి 27: దేశం మొత్తం జీఎస్టీ అమల్లో వుంటే మన రాష్ట్రంలో టీఎస్‌టీ.. అంటే తెలుగుదేశం సర్వీస్ టాక్స్ కూడా అమల్లో ఉందని, చంద్రబాబు హయాంలో అవినీతి పెచ్చుమీరిపోయిందని వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి చేరుకున్న ఆయన అమరావతి బస్టాండ్ సెంటర్‌లో భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

03/28/2018 - 00:45

అమరావతి, మార్చి 27: రాష్ట్రంలో బేడ బుడిగ జంగాల సామాజిక వర్గాన్ని ఎస్సీలలో చేర్చేందుకు అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి జె శర్మ నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఒకప్పుడు ఈ సామాజిక వర్గానికి చెందిన కళాకారులు భాగవతం, మరికొన్ని కళారూపాలను ప్రదర్శించేవారని, జానపద కళారూపాలతో పల్లెల్లో సందడి చేశారని గుర్తుచేశారు.

03/28/2018 - 00:45

విజయవాడ, మార్చి 27: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయని, కానీ ఆఫీస్ స్పేస్ సమస్యగా మారిందని ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని డీటీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఐటీ కంపెనీల ఆఫీస్ స్పేస్‌కు 60లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

Pages