S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/27/2018 - 04:39

ీరవాసరం, మార్చి 26: అభివృద్ధి చెందిన జపాన్, చైనా వంటి దేశాలకు దీటుగా వేల కోట్ల రూపాయల ఖర్చుతో బుల్లెట్ ట్రైన్‌ను సైతం ప్రవేశపెట్టడానికి ఒకపక్క పరుగులు తీస్తున్న భారతీయ రైల్వే శాఖ మరోపక్క చిన్నచిన్న కారణాలతో దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఒక్కొక్కటిగా రద్దుచేస్తోంది. రాన్రానూ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన తరుణంలో ఉన్న సౌకర్యాలనే రద్దుచేస్తూ తిరోగమన దిశలో పయనిస్తోంది.

03/27/2018 - 04:25

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 26: చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీ హాజరు కాబోమని వైకాపా అధినేత జగన్‌మోహనరెడ్డి స్పష్టం చేశారు. ఆ మేరకు సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియర్ నాయకులతో చర్చించిన మీదట తమ పార్టీ తన నిర్ణయాన్ని తెలియజేస్తుందన్నారు.

03/27/2018 - 04:23

అమరావతి, మార్చి 26: రాష్ట్రంలో ప్రతిపక్ష వైకాపాపై అధికార పార్టీ మంత్రులు నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారని వారు ధ్వజమెత్తారు. రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఎన్నికల సమయంలో ప్రతిపక్షనేత జగన్‌కు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదని మంత్రి దేవినేని ఉమ నిలదీశారు.

03/27/2018 - 03:53

అమరావతి: ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ బీజేపీపై మరిన్ని అస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ సహా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని రాష్ట్ర బీజేపీ నేతలు ఎండగడుతున్న నేపథ్యంలో..

03/27/2018 - 01:26

విజయవాడ, మార్చి 26: రాష్ట్ర విభజన అనంతరం ఏపీఎస్‌ఆర్టీసీ మూడో మేనేజింగ్ డైరెక్టర్, వైస్‌చైర్మన్‌గా ఎన్‌వి సురేంద్రబాబు సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆర్టీసీ భవన్‌లో తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర డీజీపీ డాక్టర్ ఎం.మాలకొండయ్యతో కలిసి దాదాపు రెండుగంటలపాటు ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై సమీక్ష జరిపారు.

03/27/2018 - 01:24

విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 26: ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం తక్కువగా ఉందని, అందుకే కొన్ని లక్ష్యాలను పెట్టుకుని పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

03/27/2018 - 01:21

విజయవాడ, మార్చి 26: రాష్ట్రానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మంజూరు చేసిన పీజీ సీటుపై సందిగ్ధత కొనసాగుతోంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పీజీ కౌన్సిలింగ్‌లో పెంచిన ఆ ఒక్క సీటు లేకపోవడం గమనార్హం. దేశంలోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్యను ఎంసీఐ పెంచింది.

03/27/2018 - 04:37

విజయవాడ (కార్పొరేషన్): ఏపీఎస్ ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాకపోయినప్పటికీ బస్సుల కుదింపు, సిబ్బంది తగ్గింపుతోనే ఆయా నష్టాలను తగ్గించగలమంటూ కుట్ర పూరితంగా ఆలోచిస్తున్న వైనం గర్హనీయమని ఎంప్లారుూస్ యూనియన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

03/27/2018 - 01:20

విజయవాడ, మార్చి 26: జర్నలిస్ట్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా వారి సాధక బాధలు పూర్తిగా తనకు అవగాహన ఉండటంతో పాత్రికేయుల అభివృద్ధి, సంక్షేమానికి తన శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పదేళ్ల పండుగ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

03/27/2018 - 01:19

విజయవాడ, మార్చి 26: ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజింగ్ సిస్టం’ (సీఎఫ్‌ఎంఎస్- సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం) ద్వారా ఏప్రిల్ 1 నుండి బిల్లుల చెల్లింపు పక్కాగా అమలుకానుంది. ఖజానా శాఖలో చెల్లింపులు వేగవంతం చేయటానికి ఈ ‘సీఎఫ్‌ఎంఎస్’ విధానం అమల్లోకి రానున్నది.

Pages