S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/29/2018 - 00:35

విజయవాడ, మార్చి 28: మాలక్ష్మీ ఫౌండేషన్ అనుబంధ సంస్థ మాలక్ష్మి అగ్రి, రూరల్ రీసెర్చ్ సెంటర్ (మార్క్), జర్మనీకి చెందిన డోలా - నీన్ బర్గ్ సంస్థల మధ్య వ్యవసాయ రంగంలో సాంకేతిక, నైపుణ్య అభివృద్ధి కోసం ఉద్దేశించిన అవగాహన ఒప్పందం బుధవారం స్థానిక మధుమాలక్ష్మి ఛాంబర్స్‌లోని కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడలో జరిగింది.

03/29/2018 - 00:34

అమరావతి, మార్చి 28: వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకు ఆదరణ పథకం-2 ద్వారా ఆధునిక సాంకేతిక పరికరాలు అందించేందుకు నిర్ణయించామని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తెలిపారు. బుధవారం నగరంలోని ఒక హోటల్‌లో ఆదరణ పథకం-2 కింద లబ్ధిదారులకు అందించే ఆధునిక పరికరాల విషయంపై మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి.ఉదయలక్ష్మి పాల్గొన్నారు.

03/29/2018 - 00:33

విజయవాడ, మార్చి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఏప్రిల్ 2న బ్యాంక్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముందుగా ఏప్రిల్ 1న సెలవు ప్రకటించినప్పటికీ, ఆ రోజు ఆదివారం కావడంతో ఈ మార్పు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను ప్రభుత్వం బుధవారం జారీ చేసింది.

03/29/2018 - 00:32

విజయవాడ, మార్చి 28: ప్రజలు దారిద్య్ర లేఖ దిగువ, ఎగువ ఉన్నా వారీగా విభజించిన రీతిలో దేవాలయాలను కూడా ప్రభుత్వం ఆదాయం ఉన్నవి, లేనివిగా విభజించి ఆదాయం లేని ఆలయాల పట్ల నిర్లక్ష్యం ఏ మాత్రం తగదని బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాలలో బీజేపీ సభ్యుడు ఆకుల సత్యనారాయణ అన్నారు.

03/29/2018 - 00:32

విజయవాడ, మార్చి 28: 50 ఏళ్ల వయస్సు పైబడిన ఉద్యోగులను తొలగిస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదంటూ ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. గతంలో జీవో ముసాయిదాను తయారు చేశారంటూ ప్రచారం జరగడం, దానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వడం తెలిసిందే. తాజాగా మరోసారి దీనిపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం స్పందించి, ఆ ప్రచారాన్ని ఖండించింది.

03/29/2018 - 00:31

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 28: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో రామకృష్ణ తెలిపారు. చంద్రబాబు పాలనను విమర్శించడం మాని, వ్యక్తిగతంగా దూషించడం తగదన్నారు.

03/29/2018 - 00:30

అమరావతి, మార్చి 28: జైలులో 17 నెలలు ఉన్న ముద్దాయి నెం-2, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సిగ్గు, ఎగ్గు, జంకూ, బొంకు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అసందర్భ ప్రేలాపనలు పేలి తెలుగు వారి, తెలుగు భాష పరువు తీశారని రాష్ట్రంలోని తొమ్మిది బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్లు విరుచుకుపడ్డారు.

03/29/2018 - 00:29

విజయవాడ, మార్చి 28: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి పార్లమెంటులో పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మంత్రి శిద్దా రాఘవరావు మండిపడ్డారు. హుందాగా వ్యవహరించవలసిన పార్లమెంటు సభ్యుడు ముఖ్యమంత్రిని ఉద్దేశించి వాడిన భాష, చేసిన ఆరోపణలు ఆయనలోని నేర ప్రవృత్తిని బయట పెడుతున్నాయన్నారు.

03/28/2018 - 03:12

భీమవరం, మార్చి 27: ఏన్నో ఏళ్లుగా కొల్లేరు వాసులు చేస్తున్న ఉద్యమానికి ఫలితం లభించింది. కొల్లేరు కాంటూరు కుదింపులో భాగంగా 14వేల ఎకరాల జిరాయితీ భూమిని, 7వేల ఎకరాల డి ఫారం పట్టా భూములను మినహాయిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అటవీ శాఖ కమిటీ నిర్ణయం తీసుకుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ విభాగ అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ వెల్లడించారు.

03/28/2018 - 01:00

అమరావతి, మార్చి 27: హోదా పేరుతో సెంటిమెంట్‌ను రగిలించి కొన్ని పార్టీలు ప్రజలను దగా చేస్తున్నాయని, రాష్ట్రంలోనూ బీజేపీ ఎదుగుతుండటంతో చంద్రబాబు నాయుడుకు దడ పుడుతోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శించారు. అమిత్‌షా కొడుకు అవినీతిపై మాట్లాడిన బాబు, ఆ విమర్శలు చేసిన మీడియా ప్రతినిధి కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.

Pages