S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/28/2018 - 00:45

గుంటూరు, మార్చి 27: ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. శాసనసభలో మంగళవారం డిమాండ్లపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ హైందవ ధర్మ పరిరక్షణతో పాటు వక్ఫ్ ఆస్తుల సంరక్షణ, దళితులకు సామాజిక భద్రత, తదితర అంశాల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.

03/28/2018 - 00:44

ఏ కొండూరు, మార్చి 27: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కలుషిత ప్రసాదం 123 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా వుంది. కృష్ణా జిల్లా ఏ కొండూరు అడ్డరోడ్డు వద్ద ఉన్న రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పులిహోర, వడపప్పు తిని, బెల్లం పానకం తాగిన వీరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

03/28/2018 - 00:44

విజయవాడ, మార్చి 27: 2029 నాటికి రాష్ట్రంలోని మొత్తం భౌగోళిక ప్రాంతంలో కనీసం 50శాతం గ్రీన్ కవర్‌ను సాధించడానికి వివిధ పథకాల ద్వారా అనేక చర్యలు చేపట్టామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు మంగళవారం శాసనసభలో తెలిపారు. ప్రస్తుతం 22.65 శాతం విస్తీర్ణంలో అటవీ సంపద ఉందన్నారు.

03/28/2018 - 00:43

గుంటూరు, మార్చి 27: విశాఖపట్నం జిల్లాలో అరకుతో పాటు పాడేరు అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రతిపాదించారు. శాసనసభలో పర్యాటకశాఖ డిమాండ్లపై మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిశీతల ప్రదేశంగా గుర్తింపుపొందిన లంబసింగితో పాటు ఈ ప్రాంతంలో అనేక జలపాతాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు.

03/28/2018 - 00:43

గుంటూరు, మార్చి 27: నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు గ్లోబల్ సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించారు. దీనివల్ల 21 రకాల అనుమతులు ఏకకాలంలో మంజూరవుతాయన్నారు.

03/28/2018 - 00:42

విజయవాడ, మార్చి 27: వేలిముద్రలు సరిపోని పక్షంలో ఫొటో గుర్తింపు ఆధారంగా రేషన్ ఇచ్చే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

03/28/2018 - 00:42

విజయవాడ, మార్చి 27: పర్యాటక శాఖ ద్వారా రాష్ట్రంలో 5లక్షల మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ఆమోదాన్ని కోరుతూ ఆమె అసెంబ్లీలో మంగళవారం పర్యాటక శాఖ లక్ష్యాలను వివరించారు. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అశోక్ బెండలం, పీలా గోవింద సత్యనారాయణ, తదితరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.

03/28/2018 - 03:23

అమరావతి: విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రజలను వంచించిందని అఖిలపక్షం మండిపడింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, దాని సాధన కోసం అవసరమైన అన్ని త్యాగాలకూ సిద్ధమేనని స్పష్టం చేసింది. మరో పదిరోజులు పోరాటం కొనసాగించాలని, ఈసారి జరిగే అఖిలపక్షానికి విద్యార్థులు, విద్యుత్, ఇతర రంగాల వారిని కూడా భాగస్వాములను చేయాలని నిర్ణయించింది.

03/28/2018 - 01:28

విశాఖపట్నం, మార్చి 27: నాలుగేళ్ల పాటు బీజేపీని నెత్తినెక్కించుకుని, చివరి క్షణంలో హోదా, విభజన హామీల సాధన కోసం కలిసి ఉద్యమిద్దామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై అఖిలపక్షం నేతలు మండిపడ్డారు. విభజన హామీలు, రైల్వే జోన్ సాధన కోసం ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం చేపట్టారు.

03/27/2018 - 04:31

విజయవాడ, మార్చి 26: రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చరిత్రలోనే తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే, అదీ టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యులు రాజీనామా చేయటంతో పాలకవర్గం వివాదాల్లో చిక్కుకున్నట్లయింది. మంత్రి పదవి నాశించి విజయవాడ పశ్చిమ వైకాపా ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఇటీవలే తెలుగుదేశంలో చేరారు.

Pages