S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/31/2018 - 02:50

విజయవాడ, జనవరి 30: రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అంశంపై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారుల బారిన పడకుండా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

01/31/2018 - 02:48

విజయవాడ, జనవరి 30: రాష్ట్రంలోని వ్యవసాయ భూములు సహా అన్ని రకాల స్థలాలకు ఆధార్ తరహా విశిష్ట సంఖ్యను త్వరలో కేటాయించనున్నారు. భూసేవ పేరుతో త్వరలో ఆరు ప్రభుత్వ విభాగాలకు చెందిన 20 రకాల సేవలను అందించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. అన్ని రకాల భూములు, స్థలాలకు భూధార్ పేరుతో 11 అంకెల విశిష్ఠ సంఖ్యను కేటాయించనుంది.

01/31/2018 - 02:47

విజయవాడ, జనవరి 30: ఇప్పటి వరకూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే ఉన్న నన్ ఆఫ్ ది ఎబౌవ్ (నోటా) ఆప్షన్ ఇకపై నగర పాలక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటర్లకు అందుబాటులోకి రానుంది. ఇకపై రాష్ట్రంలో మున్సిపాలిటీలకు, నగర పాలక సంస్థలకూ జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపరులో చివరన నోటా ఆప్షన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

01/31/2018 - 02:46

విజయవాడ, జనవరి 30: తూర్పు యూరప్ దేశం అయిన పోలండ్‌లో ఉన్నది ఒక జాత్యహంకార ప్రభుత్వం.. అలాంటి ప్రభుత్వ రాయభారి జనసేన నేత పవన్ కళ్యాణ్‌తో భేటీ కావటానికి ప్రజలు అంతగా పట్టించుకోనప్పటికీ ఆందోళనకర అంశం అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖతోపాటు ఇటీవల ఓ ఇంగ్లీషు మ్యాగజైన్ కారవాన్‌లో పోలండ్ జాత్యహంకారంపై ప్రచురితమైన వ్యాసం కాపీని కూడా పంపించారు.

01/31/2018 - 02:46

విజయవాడ, జనవరి 30: హజ్ యాత్రికులు మొదటి విడత 81వేల రూపాయలు చెల్లింపునకు ఈ నెల 31తో ముగియనున్న గడువును ఫిబ్రవరి 12వ తేదీ వరకు పెంచుతూ సెంట్రల్ హజ్ కమిటీ నిర్ణయం తీసుకుందని ఏపీ స్టేట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ లియాఖత్ అలీ తెలిపారు.

01/31/2018 - 02:45

విజయవాడ, జనవరి 30: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్‌ప్లానర్స్- ఇండియా ప్రచురించిన 2018 డైరీని మంత్రి నారాయణ వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆవిష్కరించారు.

01/31/2018 - 02:45

విజయవాడ, జనవరి 30: విజయవాడ నగరంలో నిర్మిస్తున్న కనకదుర్గమ్మ ఫ్లైవోవర్ నిర్మాణ పనుల్లో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థ చేతకానితనం, అసమర్థత వల్ల రాష్ట్ర ప్రభుత్వ పరువు పోతోందన్నారు. కనకదుర్గమ్మ ఫ్లైవోవర్ నిర్మాణ పనులపై వెలగపూడి సచివాలయంలో మంగళవారం రాత్రి రహదారులు, భవనాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

01/31/2018 - 02:27

లేపాక్షి, జనవరి 30: ఇద్దరు కూతుళ్లకు ఉరేసి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ సంఘటన అనంతపురం జిల్లా లేపాక్షి మండలం నాయనపల్లిలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన వీరభద్రాచారి భార్య కల్పన(27) మంగళవారం ఉదయం ఇంట్లో తన ఇద్దరు కూతుళ్లు మేఘన(6), యశస్విని(4)కి ఉరివేసి చంపింది. అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

01/31/2018 - 02:27

కాకినాడ, జనవరి 30: ఎంటెక్ విద్యార్థినులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకినాడ జెఎన్‌టియు ప్రొఫెసర్ కె బాబులుపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేశారు. వర్సిటీ అధికారులు చేసిన ఫిర్యాదుమేరకు కాకినాడ నగరంలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో బాబులుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదయ్యింది.

01/31/2018 - 02:26

రాజమహేంద్రవరం, జనవరి 30: తూర్పు కనుకనుమల్లోని పాపికొండలు, తూర్పు బంగాళాఖాతంలోని కోరంగి అభయారణ్యం కేంద్రంగా జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి యూఎన్‌డీపీ సహకారంతో అటవీ శాఖ ఒక ప్రాజెక్టును కొనసాగిస్తోంది. 2011లో చేపట్టిన ఈ ప్రాజెక్టు గడువు 2016లోనే పూర్తయినప్పటికీ, మరో రెండేళ్లు పొడిగించారు.

Pages