S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/31/2018 - 02:26

గుంటూరు, జనవరి 30: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతి సారీ రైతుల్ని అన్నివిధాల దగాచేస్తూ మభ్యపెడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు.

01/31/2018 - 02:24

విజయవాడ, జనవరి 30: అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి పనుల్లో జాప్యం జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారులపై గుంతలు కనిపిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడబోనని హెచ్చరించారు.

01/31/2018 - 02:22

విశాఖపట్నం, జనవరి 30: రాష్ట్రానికి రైల్వే జోన్ మంజూరు చేయడానికి కేంద్రం సుముఖంగా ఉన్న సమయంలో అధికార పార్టీ ఎంపీల మధ్య సమన్వయ లోపం కారణంగా అదికాస్తా వెనక్కి వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ తరువాత రైల్వే జోన్‌పై ఎంపీలు పెద్దగా కేంద్రంపై వత్తిడి తేకపోవడం వలన అది మరింత వెనక్కి వెళ్లిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

01/30/2018 - 04:11

విశాఖపట్నం, జనవరి 29: విశాఖలో జరిగిన భూ కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన నివేదికను సోమవారం నగర పోలీస్ కమిషనర్ యోగానంద్‌కు అందచేసింది. డీఐజీ వినీత్ బ్రిజ్‌లాల్, జాయింట్ కలెక్టర్ సృజనతో తదితరులు ఈ నివేదికను సీపీకి అందచేశారు. విశాఖలో వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం వెలుగు చూసింది. ఈ భూ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

01/30/2018 - 04:09

విజయవాడ, జనవరి 29: దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరును మార్పు చేస్తున్నట్లు మంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. వెలగపూడి సచివాలయం తన చాంబర్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న శాఖ పేరును దేవదాయ ధర్మదాయ శాఖగా మారుస్తున్నామని తెలిపారు. దేవాదాయ అంటే దేవుడి ఆదాయంతో నిర్వహిస్తున్నట్లు అర్థం వస్తోందని, పండితుల సూచన మేరకు దేవదాయ, ధర్మదాయ శాఖగా మారుస్తున్నామన్నారు.

01/30/2018 - 04:08

భీమవరం, జనవరి 29: కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని ఏపీ రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి కితాబిచ్చింది. వరి సాగుచేసే రైతులకు ఎకరాకు రూ.4000 సబ్సిడీ ఇస్తున్నారని పేర్కొంది.

01/30/2018 - 04:08

కాకినాడ, జనవరి 29: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో జింక్ స్మెల్టర్ పరిశ్రమ స్థాపించేందుకు వేదాంత గ్రూపు ఆసక్తి కనబరచింది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అనుకూల వాతావరణం కాకినాడ తీరంలో ఉండటంతో ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈమేరకు సోమవారం కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో వేదాంత గ్రూప్, జిఎంఆర్ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు.

01/30/2018 - 04:08

విజయవాడ, జనవరి 29: ఎంపీ గల్లా జయదేవ్‌కు అరుదైన గౌరవం లభించింది. పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లటం తెలిసిందే. అక్కడ జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన అనుభవాన్ని గుర్తించి ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీస్ గవర్నర్, గ్లోబల్ బ్యాటరీ అలయన్స్ ప్రిన్సిపల్‌గా ప్రపంచ ఆర్థిక సదస్సులో నియమించారు.

01/30/2018 - 04:07

విజయవాడ (క్రైం), జనవరి 29: ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖామంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రముఖ డిజైన్ సంస్ధ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ద్వారా అధునాతన డిజైన్లు తయారు చేయించి చేనేత కార్మికులకు అందించి ప్రపంచస్థాయి ఉత్పత్తులు సిద్ధం చేయిస్తామన్నారు.

01/30/2018 - 04:07

విజయవాడ, జనవరి 29: దళితుల భూముల్ని కొల్లగొట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌కు తోడుగా ప్రజలను రమ్మని పిలవడం పెద్ద మోసమని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ తల్లి విజయమ్మ జగన్మోహన్‌రెడ్డిని ఆశీర్వదించమంటున్నారన్నారు. అది అతను ముఖ్యమంత్రి కావడం కోసమే తప్ప ప్రజల కోసం కాదన్నారు.

Pages