S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/01/2018 - 00:37

జంగారెడ్డిగూడెం/జీలుగుమిల్లి, జనవరి 31: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణానికి సేకరించిన భూముల్లో సాగుచేస్తున్న పంటలను ధ్వంసం చేయడానికి అధికారులు చేసిన ప్రయత్నాలను రైతులు అడ్డుకోవడంతో బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

02/01/2018 - 00:36

నిడదవోలు, జనవరి 31: సంక్రాంతి పర్వదినాల్లో చట్టవిరుద్ధంగా కోడి పందేల్లో పాల్గొన్న 95మంది కోడి పందేలరాయుళ్లకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు అదనపు జూనియర్ సివిల్ జడ్జి వై శ్రీలక్ష్మి బుధవారం తీర్పుచెప్పారు. నిందితులకు మూడు రోజులు సాధారణ జైలుశిక్ష, వంద రూపాయల జరిమానా విధించారు.

02/01/2018 - 00:13

విజయవాడ, జనవరి 31: ‘ఒక్క క్లిక్‌తో భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే భూసేవ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం, రాష్ట్రంలోని పట్టాదారుని భూభాగానికి ఆధార్ తరహాలో భూధార్ విశిష్ట సంఖ్యను అందజేస్తాం’ అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. సచివాలయం వేదికగా భూసేవ, ఆటోమ్యూటేషన్ ప్రక్రియకు సంబంధించి రెవెన్యూ ఉన్నతాధికారులు ఉప ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

02/01/2018 - 00:13

విశాఖపట్నం, జనవరి 31: రాష్ట్రంలో మరో అవినీతి అధికారి ఏసీబీకి దొరికాడు. వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్‌గా పనిచేస్తున్న గెడ్డపు లక్ష్మీప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడన్న ఫిర్యాదులు రావడంతో ఏసీబీ విశాఖ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో రాష్ట్రంలో 20 చోట్ల బుధవారం ఏక కాలంలో దాడులు జరిగాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, గుంటూరు, హైదరాబాద్‌లోని ఈ దాడులు జరిగాయి.

01/31/2018 - 23:43

ఏలూరు, జనవరి 31: రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన పశ్చిమ గోదావరి జిల్లా నుండి రాష్ట్ర క్యాబినెట్‌లో ముగ్గురు మంత్రులున్నా ఎవరికి వారుగా వ్యవహరిస్తూ, నిమిత్తమాత్రులుగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

01/31/2018 - 23:42

అమరావతి, జనవరి 31: రాజధానిలోని పాలనా నగరంలో తొలుత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాలు, ప్రభుత్వ ఆవాసాలను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. పరిపాలన నగరంలో చేపట్టే అన్ని నిర్మాణాల్లో మొదటి ప్రాధాన్యంగా ఈ మూడు ప్రాజెక్టులను పూర్తిచేసి వచ్చే ఏడాదిలోనే వినియోగంలోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారులు తెలియజేశారు.

01/31/2018 - 23:40

తిరుపతి, జనవరి 31: చంద్రగ్రహణం కారణంగా బుధవారం ఉదయం 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేశామని, రాత్రి 9.30 గంటల తరువాత సంప్రోక్షణ అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించామని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 11గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేశామన్నారు.

01/31/2018 - 23:40

మచిలీపట్నం, జనవరి 31: కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన యువకుడు అమెరికాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగి బొమ్మల రామ్మోహనరావు కుమారుడు చైతన్య ఎంఎస్ చదివేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగానే్వషణలో ఉన్న చైతన్య ఫ్లోరిడా రాష్ట్రంలో తన స్నేహితులతో కలిసి ఒక రూమ్‌లో ఉంటున్నాడు.

01/31/2018 - 23:39

పలాస, జనవరి 31: ఇప్పటి వరకూ ఎంతో ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలు ఇప్పుడు అట్టుడికిపోతున్నాయి. రెండురోజుల కిందట జరిగిన ఒక సంఘటనలో స్వీట్ షాప్‌లో పని చేసే కుర్రాడు ఊహించని రీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అధికార పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ అకారణంగా స్వీట్ షాప్‌లో పని చేసే హరీష్‌ను చితక బాదడంతో అతడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుంది.

01/31/2018 - 23:39

పొదలకూరు, జనవరి 31: రాష్ట్రానికి నాలుగేళ్ల క్రితమే చంద్రగ్రహణం పట్టిందని, నేడు పట్టిన గ్రహణం కొన్ని గంటల్లో తొలగిపోతుందని, రాష్ట్రాన్ని పట్టింది వీడేందుకు ఇంకా ఏడాది సమయం ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు.

Pages