S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/30/2018 - 03:31

గూడూరు, జనవరి 29: ఏమాత్రం అలుపు సొలుపు లేకుండా రెట్టించిన ఉత్సాహంతో వైసిపి అధినేత సాగిస్తున్న ప్రజా సంకల్పయాత్ర సోమవారానికి నెల్లూరు జిల్లా సైదాపురం వద్ద 74వ రోజుకు చేరుకుంది. 1000 కిలో మీటర్ల దూరం నడిచి రికార్డు సృష్టించిన నేపధ్యంలో సోమవారం గూడూరు సమీపంలోని నిమ్మ మార్కెట్ నుండి ప్రారంభమైన పాదయాత్ర రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగింది.

01/30/2018 - 03:30

కొత్తగూడెం, జనవరి 29: భద్రాది కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి సీనియర్ అసిస్టెంట్ సైదులును రూ 25వేలు నగదుతో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలను ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించారు. పాల్వంచకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల అనుమతులను రెన్యువల్ చేయించేందుకు పాఠశాల డైరెక్టర్ ఆంటోనీ సౌజా డిఇవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.

01/30/2018 - 03:28

అమరావతి, జనవరి 29: జలవనరుల సంరక్షణతో ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.400 కోట్ల విలువైన విద్యుత్ ఆదా చేశామని, ఇదే స్ఫూర్తితో సమర్ధ నీటి నిర్వహణ పనులను వచ్చే నెల నుంచి 116 రోజులపాటు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.

01/30/2018 - 03:28

రాజమహేంద్రవరం, జనవరి 29: దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను కబ్జా చేసేవారిపై తక్షణం కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కేశపాగుల రాములు అధికారులను ఆదేశించారు. దళితులకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం కాకుండా అధికార యంత్రాంగం కాపాడాలన్నారు. ఇప్పటికే నమోదైన వివిధ కేసులకు సంబంధించి అక్రమణదార్లను తక్షణం అరెస్టుచేయాలన్నారు.

01/30/2018 - 03:27

అనకాపల్లి, జనవరి 29: రాష్ట్రంలోని వివిధ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో వౌలిక వసతుల మెరుగు, ఇతర అభివృద్ధి పనులను 252 కోట్లతో చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అనకాపల్లిలో సోమవారం జరిగిన కిసాన్ మేళా వేడుకలకు హాజరైన మంత్రి విలేఖర్లతో మాట్లాడారు. 400 ఎకరాల్లో రైస్ రీసెర్చ్ సెంటర్లను అభివృద్ధి చేస్తామన్నారు.

01/30/2018 - 03:27

అనంతపురం, జనవరి 29: ‘జాతీయ, రాష్టస్థ్రాయిలో చేనేతకు ఖ్యాతి ఉంది.. అయితే చేనేత కళ అంతరించి పోతోంది..కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోకపోతే నష్టం జరుగుతుంది.. ప్రభుత్వం, సంబంధిత శాఖలు, చేనేత సొసైటీలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. విదేశాల్లో చేనేతకు మంచి ఆదరణ ఉంది.. ఈ క్రమంలో చేనేత కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి కళాకారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తాను.

01/30/2018 - 03:25

విశాఖపట్నం, జనవరి 29: రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమవుతున్న రోజులివి. కానీ ప్రభుత్వం మాత్రం దుబారాకు కళ్లెం వేయడం లేదు. లెక్కకు మించి ఖర్చు చేస్తున్నారు. రాజధాని విజయవాడలో కన్నా విశాఖపట్నంలో ఇటీవల కాలంలో అంతర్జాతీయ సదస్సులు, జాతీయ స్థాయి సమావేశాలు పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే.

01/30/2018 - 03:23

కాకినాడ, జనవరి 29: కీచక ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జెఎన్‌టియు విద్యార్థులు సాగిస్తున్న ఆందోళన సోమవారం మూడవ రోజుకు చేరింది. ఎంటెక్ విద్యార్థినులను వేధిస్తున్న ప్రొఫెసర్ బాబులును సస్పెండ్ చేయాలని ఈ నెల 27వ తేదీ నుంచి జెఎన్‌టియుకె విద్యార్థులు క్యాంపస్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం విదితమే.

01/29/2018 - 04:20

అనంతపురం, జనవరి 28 : 2019 ఎన్నికల్లో తాను ప్రజాభీష్టం మేరకే పోటీ చేస్తానని జనసేనపార్టీ అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజైన ఆదివారం పవన్ కదిరి పట్టణంలో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

01/29/2018 - 04:19

మధురవాడ, జనవరి 28: విశాఖనగర పరిధిలోని మారికవలస డంపింగ్ యార్డ్ వద్ద సుమారు రూ.7కోట్ల విలువ చేసే గంజాయిని ఆదివారం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనే్నళ్ళుగా యువత పెడతోవ పట్టేందుకు ముఖ్యకారణమవుతున్న గంజాయిని నిర్మూలించి, గంజాయి రహిత జిల్లాగా విశాఖ జిల్లాను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.

Pages