S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/21/2017 - 00:06

హైదరాబాద్, డిసెంబర్ 20: నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు వైఎస్ జగన్ అంటే టిడిపికి వెన్నులో వణుకు పుడుతోందని వైఎస్‌ఆర్‌సిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా తాము అదిరేది, బెదిరేది లేదని అన్నారు. బుధవారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ నేతృత్వంలో రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందని అన్నారు.

12/21/2017 - 00:05

రాజమహేంద్రవరం, డిసెంబర్ 20: ఈ నెలలో పోలవరం రానున్న కేంద్ర మంత్రి గడ్కరీని వైసీపీ బృందం కలిసి పరిస్థితులపై చర్చిస్తుందని వైసీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏపి విభజన చట్టం మేరకు పోలవరాన్ని పూర్తిగా కేంద్రమే నిర్మించాల్సివుందన్నారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించేవిధంగా వ్యవహరిస్తోందన్నారు.

12/20/2017 - 23:40

దళిత సంఘాల ఆందోళన సంఘీభావం ప్రకటించిన వైసీపీ
టీడీపీకి సంబంధం లేదన్న ఎమ్మెల్యే బండారు

12/20/2017 - 03:37

అమరావతి, డిసెంబర్ 19: మిత్రపక్షాలయిన తెలుగుదేశం-్భరతీయ జనతా పార్టీ మధ్య మళ్లీ మాటల మంటలు మొదలయ్యాయి. రెండు పార్టీల మధ్య ముసలం పుట్టడం చర్చనీయాంశమయింది. గుజరాత్ విజయంతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసేలా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీ వైబీ రాజేంద్రప్రసాద్ వ్యవహారం, రెండు పార్టీల్లోనూ వేడి రగిలించింది.

12/20/2017 - 03:36

అనంతపురం, డిసెంబర్ 19: రాష్ట్రంలో కరవు, అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే వారిని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు వంచిస్తూ వెన్నుపోటు పొడుస్తున్నారని వైపీసీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పయాత్ర 39వ రోజు మంగళవారం అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా మండలంలోని మారాల గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్ ప్రసంగించారు.

12/20/2017 - 02:52

అమరావతి, డిసెంబర్ 19: రాష్ట్రంలో కాలుష్యం వెదజల్లే పరిశ్రమల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పర్యావరణ, అడవులు, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/20/2017 - 02:51

విజయవాడ, డిసెంబర్ 19: రాష్ట్రంలోని మారుమూల, గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రిజర్వు బ్యాంకు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ (సీఎస్) సూచించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 13వ రాష్టస్థ్రాయి కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది.

12/20/2017 - 02:49

విజయవాడ, డిసెంబర్ 19: తాను అధికారంలోనికి వస్తే 45 సంవత్సరాలకే ఫించన్ ఇస్తానని చెబుతున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కూడా పింఛన్‌కు అర్హుడేనని రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు వ్యాఖ్యానించారు. పాదయాత్రలో 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని జగన్ అంటున్నాడు.. వైకాపా విధానం ప్రకారం జగన్ వృద్ధాప్య పింఛన్‌కు అర్హుడేనని వ్యంగ్యంగా అన్నారు.

12/20/2017 - 02:48

విజయవాడ, డిసెంబర్ 19: రాష్ట్రంలో ప్రతి పేదవానికి సొంత గృహం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పమని, ఆ దిశలో క్షేత్రస్థాయిలో నిర్ధేశించిన లక్ష్యాలను కన్వర్‌జెన్సీ విధానంలో పకడ్బందీగా చేపట్టాలని గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు పిలుపునిచ్చారు.

12/20/2017 - 02:16

కాకినాడ, డిసెంబర్ 19: కాకినాడ బీచ్ ఫెస్టివల్ ఎన్టీఆర్ సాగర తీరంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. వివిధ సాంస్కృతిక, జానపద కార్యక్రమాల నడుమ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బీచ్ ఫెస్టివల్‌ను ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు ప్రారంభించారు.

Pages