S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/20/2017 - 00:36

అమరావతి, డిసెంబర్ 19: గుజరాత్ ఎన్నికల ఫలితాల కేంద్రంగా తెలుగుదేశం-్భరతీయ జనతా పార్టీ నేతల మధ్య మొదలైన వివాదానికి తెరదించేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు నడుం బిగించారు. ఎమ్మెల్సీ వైబీ రాజేంద్రప్రసాద్-బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసుకున్న పరస్పర విమర్శలు, సవాళ్లు-ప్రతి సవాళ్లపై విదేశీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఆరా తీశారు.

12/19/2017 - 03:57

విజయవాడ, డిసెంబర్ 18: అగ్రిగోల్డ్ సంస్థ ఆర్థిక మోసంతో గుండెపగిలి, మానసిక వేదనతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5లక్షల నష్టపరిహారంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ మృతుల కుటుంబ సభ్యులు సోమవారం విజయవాడలో 30 గంటల సామూహిక సత్యాగ్రహాన్ని చేపట్టారు.

12/19/2017 - 03:55

పోలవరం, డిసెంబర్ 18: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆశిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ నెల 23న నితిన్ గడ్కరీ ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి వస్తున్నారన్నారు. ఆయన తీసుకునే చర్యలతో ప్రాజెక్టు పనులు మరింత వేగవంతమవుతాయన్నారు.

12/19/2017 - 03:41

తిరుపతి, డిసెంబర్ 18: తిరుమలలో శ్రీవారిని దర్శించుకోడానికి సర్వదర్శనం భక్తులకు నిర్దేశిత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానం సోమవారం ప్రారంభమైంది. ఉదయం 6గంటలకు సీఆర్వో కౌంటర్లలో తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు పూజలు నిర్వహించి టోకెన్ల జారీని ప్రారంభించారు.

12/19/2017 - 03:39

విజయవాడ, డిసెంబర్ 18: ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంవత్సరంలోపు అమరావతి రాజధాని రోడ్ల నిర్మాణం పూర్తిచేసి నిరూపిస్తామని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సోమవారం తుళ్లూరు గ్రామంలోని ఎన్‌సీసీ క్యాంపులో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మున్సిపల్ వ్యవహారాలశాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధానిలో నిర్మిస్తున్న రహదారుల పురోగతిని వివరించారు.

12/19/2017 - 03:37

విశాఖపట్నం, డిసెంబర్ 18: విశాఖ ఏజెన్సీలోని గాలికొండ ఏరియాలో ఇద్దరు కీలక మావోయిస్ట్‌లు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఎదుట సోమవారం లొంగిపోయారు. ఇందులో ఎస్‌జెడ్‌సీ మెంబర్ చలపతికి గన్‌మేన్‌గా పనిచేసిన కిషోర్ కూడా ఉన్నాడు.

12/19/2017 - 03:35

విజయవాడ, డిసెంబర్ 18: విద్యా శాఖ నిర్లక్ష్యం.. ఐటి విభాగం అత్యుత్సాహం వెరసి టెన్త్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చలికాలంలోనూ చెమటలు పడుతున్నాయి. మొరాయిస్తున్న సర్వర్‌తో విద్యార్థుల వ్యక్తిగత వివరాల నమోదు సమస్యగా మారింది. వివరాల నమోదుకు గడువు మంగళవారంతో ముగియనున్నప్పటికీ, గడువు పొడిగింపు, తదితర అంశాలపై విద్యా శాఖ స్పందించకపోవం గమనార్హం.

12/19/2017 - 03:34

విజయవాడ, డిసెంబర్ 18: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో బీజేపీ విజయం సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల విజయసారథులు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు అభినందనలు తెలిపారు. అభివృద్ధి కోసం కృషి చేసే పార్టీలను ప్రజలు ఆదరిస్తారని మరోసారి రుజువైందని తెలిపారు. మంత్రి లోకేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
ఇది ప్రగతిపై ప్రజా తీర్పు

12/19/2017 - 03:34

కాకినాడ, డిసెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాకినాడ బీచ్ ఫెస్టివల్‌కు సంబంధించి ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది. బీచ్ ఫెస్టివల్ మంగళవారం ఇక్కడి ఎన్టీఆర్ సాగర తీరంలో ప్రారంభం కానుంది. ఈనెల 21వ తేదీ వరకు జరిగే ఈ సాగర సంబరాలకు ముందుగా అనుకున్నట్టు ముఖ్యమంత్రి హాజరు కావడం లేదు.

12/19/2017 - 03:31

విజయవాడ, డిసెంబర్ 18: భారతదేశ వ్యాప్తంగా వీస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇక ఎవరినీ సీట్లు అడుక్కునే పరిస్థితి ఉండబోదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.

Pages